Telangana

News September 8, 2024

HYD: బాధ్యతలు స్వీకరించిన విజయ్ కుమార్

image

ఇటీవల ఐపీఎస్ బదిలీలో భాగంగా విజయ్ కుమార్ తెలంగాణ అవినీతి నిరోధక శాఖ డైరెక్టర్ జనరల్‌గా నియమితులయ్యారు. ఈ మేరకు ఆయన ఆదివారం మాజీ డైరెక్టర్ సీవీ. ఆనంద్ నుంచి బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయనకు సీవీ. ఆనంద్ శుభాకాంక్షలు తెలిపారు. కాగా సీవీ హైదరాబాద్ సీపీగా నియమితులయ్యారు.

News September 8, 2024

HYD: నిమజ్జనానికి కీలక సూచనలు జారీ

image

హైదరాబాద్ వ్యాప్తంగా వినాయక చవితి కోలాహలం నడుస్తోంది. ఈ క్రమంలో వినాయక నిమజ్జనానికి సంబంధించి హైదరాబాద్ పోలీసులు కీలక సూచనలు జారీ చేశారు.
* గణేష్ విగ్రహానికి ఒక వాహనం మాత్రమే అనుమతించబడుతుంది.
* నిమజ్జనం కోసం విగ్రహాన్ని తీసుకెళ్లే వాహనంపై లౌడ్ స్పీకర్ అమర్చకూడదు.* పోలీసు అధికారులు ఎప్పటికప్పుడు ఇచ్చే సూచనలు పాటించాలి.

News September 8, 2024

అయోధ్య రాముడికి పటాన్‌చెరు నుంచి ధనస్సు, బాణం

image

పటాన్‌చెరు నియోజకవర్గం ఎల్‌ఐజీలోని దత్త పీఠంలో అయోధ్య రాముడికి బహుకరించేందుకు 13కిలోల వెండి, కిలో బంగారంతో తయారు చేసిన ధనస్సు, బాణానికి ఎంపీ రఘునందన్ రావు ప్రత్యేక పూజలు నిర్వహించారు. దాత చల్లా శ్రీనివాసశాస్త్రీ దీనిని తయారు చేయించారు. ఈ సందర్భంగా దాతను ఎంపీ అభినందించారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశంలో మరోసారి రామరాజ్య స్థాపనకోసం కృషి జరుగుతోందన్నారు.

News September 8, 2024

స్వల్పంగా తగ్గుతున్న మున్నేరు వాగు

image

ఖమ్మం నగరంలో ప్రవహిస్తున్న మున్నేరు వాగు స్వల్పంగా తగ్గుముఖం పడుతోంది. ఆదివారం మధ్యాహ్ననానికి 13.50 అడుగుల వద్ద నీటి ప్రవాహం కొనసాగుతోంది. 16 అడుగులకు చేరితే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉంది. మధ్యాహ్నం ఒంటిగంటకు 13.75 అడుగుల వద్ద ఉన్న మున్నేరు వరద రెండు గంటలకు 13.50 అడుగులకు పడిపోయింది. స్వల్పంగా తగ్గుతుండడంతో ముంపు ప్రాంతాల ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు.

News September 8, 2024

NZB: బురద నీటిలో పడి ఒకరు మృతి

image

మద్యం మత్తులో బురద నీటిలో పడి ఒకరు మృతి చెందిన ఘటన నిజామాబాద్ నగర శివారులోని గుండారం కమాన్ వద్ద జరిగింది. నాందేవ్ వాడకు చెందిన సంతలే జ్యోతిరాం(54) మద్యం మత్తులో గుండారం కమాన్ వద్ద పేరుకుపోయిన బురద నీటిలో పడి మృతి చెందాడు. ఆదివారం స్థానికులు గమనించి రూరల్ పోలీసులకు సమాచారం అందించగా వారు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ ఎస్సై ఆరిఫ్ తెలిపారు.

News September 8, 2024

జాతీయ రహదారిపై కారులో మంటలు

image

చిట్యాల పట్టణ శివారులో గల పెట్రోల్ పంపు సమీపంలో జాతీయ రహదారిపై ప్రమాదవశాత్తు కారులో మంటలు చెలరేగాయి. కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు సురక్షితంగా బయటపడ్డారు. మంటలను గుర్తించి వెంటనే కారును పక్కకు ఆపడంతో ఇద్దరికీ ప్రాణాపాయ తప్పింది. ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు.

News September 8, 2024

KNR: టీచర్లు తలుచుకుంటే సర్కార్ తలరాతలే మారతాయి: కేంద్రమంత్రి

image

టీచర్లు తలుచుకుంటే సర్కార్ తలరాతలు మారతాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. కరీంనగర్ కలెక్టరేట్‌లో ‘గురు వందనం’ కార్యక్రమంలో పాల్గొని పలువురు ఉత్తమ టీచర్లను సన్మానించారు. కాంగ్రెస్ ఉన్నంత కాలం మీ సమస్యలు తీరవు అన్నారు. 317 జీవోతో టీచర్లు అల్లాడితే ఉపాధ్యాయలు ఎందుకు నోరు విప్పలేదని ప్రశ్నించారు. టీచర్ల పక్షాన కొట్లాడి జైలుకు వెళ్లిన ఏకైక సంఘం (TUPS) మాత్రమే అని తెలిపారు.

News September 8, 2024

వరంగల్: ఎన్పీడీసీఎల్‌లో అవినీతి నిర్మూలించడానికి శ్రీకారం

image

టీజీ ఎన్పీడీసీఎల్‌లో వినియోగదారులకు మరింత మెరుగైన సేవలు అందించడంలో భాగంగా ఎవరైనా లంచం అడిగితే ఉపేక్షించదని యాజమాన్యం తెలిపింది. సంస్థలో అవినీతి నిర్మూలనపై ప్రత్యేక దృష్టి సాధించామని అన్నారు. సేవలకు ప్రతిఫలంగా లంచం అడిగితే 9281033233, 1064కు కాల్ చేయాలని తెలిపారు. ఎన్పీడీసీఎల్ పరిధిలోని 16 సర్కిల్లో అన్ని కార్యాలయంలో పోస్టర్లను పెట్టడం జరిగిందన్నారు.

News September 8, 2024

MBNR: పనిచేయని సీసీ కెమెరాలు..!

image

ఉమ్మడి పాలమూరు జిల్లాలో ‘నేను సైతం’ కార్యక్రమంలో భాగంగా పోలీసు శాఖ వారి గణాంకాల ప్రకారం ప్రధాన కూడళ్ళు, పట్టణాలు, మండల కేంద్రాల్లో మొత్తం 6,643 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. దాతల సహకారంతో రూ.లక్షలు వెచ్చించి నేరాల పరిశోధనల్లో, కేసుల ఛేదనలో ఉపయోగపడతాయి అనే ఉద్దేశంతో ఏర్పాటు చేశారు. కానీ నిర్వహణ లోపంతో మొత్తం 1,350 సీసీ కెమెరాలు పనిచేయడం లేదు. దీంతో పోలీసులకు కేసుల ఛేదన సవాలుగా మారుతోంది.

News September 8, 2024

ఘట్‌కేసర్: రైలు కింద పడి కానిస్టేబుల్ సూసైడ్

image

రైలు కింద పడి కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాలు.. సికింద్రాబాద్ పరిధిలోని గోపాలపురం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పని చేస్తున్న నరసింహరాజు ఘట్‌కేసర్ వద్ద రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నరసింహరాజుకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఆర్థిక ఇబ్బందులే ఆత్మహత్యకు కారణమని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.