Telangana

News April 6, 2024

‘వేధింపులకు పాల్పడితే కఠిన చర్యలు’

image

ఖమ్మం జిల్లాలో మహిళలు, బాలికలను వేధించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఖమ్మం పోలీసు కమిషనర్ సునీల్ దత్ హెచ్చరించారు. మహిళలను వేధింపుల నుంచి రక్షించేందుకు కమిషనరేట్ పరిధిలో షీ టీమ్లతో భరోసా కల్పిస్తామన్నారు. ఫిర్యాదు దారుల వివరాలు గోప్యంగా ఉంచుతామని భరోసానిచ్చారు. మహిళలు ఎప్పుడైతే అభద్రతకు లోనవుతారో డయిల్ -100, షీటీమ్ నంబర్ 87126 59222కు ఫిర్యాదు చేయాలని సూచించారు.

News April 6, 2024

పెబ్బేర్: జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం

image

వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం రంగాపూర్ సమీపంలో హైవేపై శనివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బైకుపై హైదరాబాద్ నుంచి కర్ణాటక వైపు వెళ్తున్న ఓ వ్యక్తిని ఎదురుగా గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. తలకు హెల్మెట్ ఉన్నా.. వాహనం బలంగా ఢీకొట్టడంతో స్పాట్లోనే చనిపోయాడు. మృతుడికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. తల నుజ్జునుజ్జు కావడంతో గుర్తించలేక పోతున్నారు.

News April 6, 2024

తలమడుగులో రోడ్డు ప్రమాదం

image

ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం సుంకిడి శివారులోని అంతర్రాష్ట్ర రహదారిపై శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులకు తీవ్రగాయాలయ్యాయి. పోలీసుల వివరాల ప్రకారం.. మహారాష్ట్రలోని పిప్పల్‌ గావ్‌కు చెందిన భోపాల్, ఈశ్వర్, అంకుశ్ బైక్‌పై ఉపాధి కోసం సుంకిడికి బయలుదేరారు. ఎదురుగా వస్తున్న మ్యాక్స్ పికప్ ఢీకొట్టింది. గమనించిన స్థానికులు ముగ్గురిని రిమ్స్ ఆసుపత్రికి తరలించారు.

News April 6, 2024

కాచిగూడ నుంచి తిరుపతికి ప్రత్యేక రైలు

image

ఆరు వేసవి రైళ్లను మరికొన్ని ట్రిప్పులు పొడిగిస్తున్నట్లు ద.మ. రైల్వే శుక్రవారం తెలిపింది. కాచిగూడ నుంచి తిరుపతికి ప్రతి గురువారం వెళ్లే ప్రత్యేక రైలు (నం.07653) ను మే 1 వరకు, శుక్రవారం.. తిరుపతి -కాచిగూడ (నం.07654) రైలు మే 2 వరకు, బుధవారం.. సికింద్రాబాద్‌ -రామగుండం (నం.07695) రైలును ఏప్రిల్‌ 24 వరకు రైల్వే శాఖ పొడిగించింది.

News April 6, 2024

పటాన్ చెరు: కారు రన్నింగ్‌లో ఉండగా రివర్స్ గేర్.. యువకుడి మృతి

image

చికిత్స పొందుతూ వ్యక్తి మృతి చెందిన ఘటన పటాన్‌చెరు PS పరిధిలో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. శాంతినగర్‌కు చెందిన భగీరథ కుమార్(19), అతడి స్నేహితుడు నిఖిల్ కుమార్‌తో కలిసి శుక్రవారం ముత్తంగి పరిధిలో హోటల్‌కి వచ్చి తిరిగి వెళ్తున్నారు. ఈ క్రమంలో కారు రన్నింగ్‌లో ఉండగా నిఖిల్ కుమార్ రివర్స్ గేర్ వేయడంతో చెట్టును ఢీకొంది. భగీరథకు గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందాడు.

News April 6, 2024

సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి: ఎస్పీ

image

సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సిరిసిల్ల ఎస్పీ అఖిల్ మహజన్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో శనివారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. మీ మొబైల్ ఫోన్‌లోకి వచ్చే లింకులపై క్లిక్ చేయవద్దని, మీ ప్రమేయం లేకుండా మీ మొబైల్‌కి వచ్చే ఓటీపీలను ఎవరికీ చెప్పొద్దని సూచించారు. ఎవరైనా సైబర్ నేరానికి గురైతే 1930, 100 నెంబర్లకు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని తెలిపారు.

News April 6, 2024

HYD: నేడు ‘షబ్‌-ఎ- ఖదర్’.. రాత్రంతా జాగారం!

image

రంజాన్ మాసం నేపథ్యంలో ‘షబ్‌-ఎ- ఖదర్’ రాత్రి మరింత మహోన్నతమైంది. రంజాన్‌ మాసంలో 26వ ఉపవాసం(నేడు) రాత్రంతా భక్తి శ్రద్ధలతో ‘షబ్‌ -ఎ- ఖదర్’ జరుపుకుంటారు. HYD, ఉమ్మడి RR జిల్లా వ్యాప్తంగా జగ్నేకి రాత్‌(జాగారం) నిర్వహించుకునేందుకు ముస్లింలు విస్తృత ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. నిన్న రంజాన్ మాసంలో చివరి శుక్రవారం సందర్భంగా మసీదులలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఆఖరి జుమాకు అల్విదా పలికారు.

News April 6, 2024

HYD: నేడు ‘షబ్‌-ఎ- ఖదర్’.. రాత్రంతా జాగారం!

image

రంజాన్ మాసం నేపథ్యంలో ‘షబ్‌-ఎ- ఖదర్’ రాత్రి మరింత మహోన్నతమైంది. రంజాన్‌ మాసంలో 26వ ఉపవాసం(నేడు) రాత్రంతా భక్తి శ్రద్ధలతో ‘షబ్‌ -ఎ- ఖదర్’ జరుపుకుంటారు. HYD, ఉమ్మడి RR జిల్లా వ్యాప్తంగా జగ్నేకి రాత్‌(జాగారం) నిర్వహించుకునేందుకు ముస్లింలు విస్తృత ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. నిన్న రంజాన్ మాసంలో చివరి శుక్రవారం సందర్భంగా మసీదులలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఆఖరి జుమాకు అల్విదా పలికారు.

News April 6, 2024

KNR జిల్లాలో రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు

image

రాష్ట్రంలో నమోదైన ఉష్ణోగ్రతలలో శుక్రవారం ఉమ్మడి జిల్లాలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలం కొల్వాయి, సిరిసిల్ల జిల్లా మర్దన పేటలో 43.5 డిగ్రీల సెల్సియస్ గరిష్ఠ పగటి ఉష్ణోగ్రత నమోదయింది. కరీంనగర్ జిల్లా వెదురుగట్టలో 43.2, పెద్దపల్లి జిల్లా సుగ్లాంపల్లిలో 43.3 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు జగిత్యాల పరిశోధన స్థానం అధికారి బి.శ్రీ లక్ష్మీ తెలిపారు.

News April 6, 2024

ధరూర్: మరమ్మతులకు నోచుకోని జూరాల క్రస్ట్ గేట్లు !

image

ధరూర్ మండలంలోని జూరాల ప్రాజెక్టు క్రస్ట్ గేట్లు మరమ్మతులకు నోచుకోవడం లేదు. ప్రాజెక్టులోని 36,37 గేట్ల ద్వారా నీరు లీకేజీ అవుతుంది. ప్రతిరోజు వేలాది క్యూసెక్కుల నీరు వృథాగా పోతున్నాయి. మరమ్మతులకు నిధులు ఉన్నప్పటికీ ఇప్పటివరకు మరమ్మత్తు పనులు ప్రారంభించలేదని స్థానికులు పేర్కొన్నారు. ప్రాజెక్టులో మొత్తం 9.68 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం ఉన్నప్పటికీ కూడిక పేరుకుపోవడంతో 7 TMCల నీరు నిల్వ ఉంటుందన్నారు.