Telangana

News April 6, 2024

సూర్యాపేట: గంజాయి విక్రయిస్తున్న మహిళ అరెస్ట్

image

సూర్యాపేట జిల్లా చింతలపాలెంలో గంజాయి విక్రయిస్తున్న మహిళను పోలీసులు అరెస్టు చేశారు. గుగులోతు విజయ అనే మహిళ గంజాయి తాగుడుకు అలవాటైంది. ఇదే క్రమంలో డబ్బు సంపాదనకు గంజాయి విక్రయిస్తోంది. చింతలపాలెం బస్టాండులో విజయను అరెస్టు చేసినట్లు ఎస్సై సైదిరెడ్డి తెలిపారు. ఆమె వద్ద 200 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నామన్నారు.

News April 6, 2024

ములుగు: పోలీసులు, మావోయిస్టులకు ఎదురు కాల్పులు

image

ములుగు జిల్లా-చతీస్‌ఘడ్ సరిహద్దుల్లో పోలీసులు, మావోయిస్టుల మధ్య శనివారం తెల్లవారుజామున కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. మృతదేహాలతో పాటు ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఎన్‌కౌంటర్ ములుగు జిల్లా పరిధిలోని తెలంగాణ బార్డర్‌లో జరిగింది.

News April 6, 2024

వనపర్తి: ఏప్రిల్ 22 వరకు దరఖాస్తులు చేసుకోండి

image

వనపర్తి: ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఆరు ప్రభుత్వ, మూడు ప్రైవేటు మొత్తం తొమ్మిది పాలిటెక్నిక్ కళాశాలలు ఉన్నాయని వనపర్తి పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ చంద్రశేఖర్ తెలిపారు. వీటి పరిధిలో 1,740 డిప్లమా కోర్సుల్లో సీట్ల భర్తీ కోసం పాలీసెట్-2024 ప్రవేశ పరీక్షకు ఏప్రిల్ 22 వరకు polycet.sbtet.telangana.gov.in వెబ్సైట్ ద్వారా అర్హులు దరఖాస్తు చేసుకోవాలని అన్నారు. మే 17న ప్రవేశ పరీక్ష ఉంటుందని తెలిపారు.

News April 6, 2024

వేసవి సెలవులు.. ప్రశ్నార్థకంగా బడుల భద్రత

image

ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కొద్ది రోజుల్లో పాఠశాలలకు వేసవి సెలవులు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ బడుల భద్రత ప్రశ్నార్థకంగా మారింది. చాలా వరకు ప్రభుత్వ పాఠశాలల్లో వాచ్మెన్లు లేరు. గతంలో ఉన్న వారు పదవీ విరమణ పొందగా, వీరి స్థానంలో కొత్త వారిని గత ప్రభుత్వం నియమించలేదు. వీటన్నింటి నేపథ్యంలో కొన్ని చోట్ల పాఠశాలల పరిసరాలు అసాంఘిక కార్యకలాపాలకు నిలయాలుగా మారాయి.

News April 6, 2024

రుద్రూర్: భార్యతో గొడవ పడొద్దన్నందుకు హత్య

image

పొతంగల్‌లో అన్నను తమ్ముడు <<12993064>>హత్య <<>>చేసిన విషయం తెలిసిందే. స్థానికులు, పోలీసుల వివరాల ప్రకారం.. గోవింద్, విఠల్ అన్నాదమ్ములు. విఠల్ తరచూ తన భార్యతో గొడవపడుతుండడంతో అన్న మందలించేవాడు. ఈక్రమంలో గోవింద్‌పై కక్షపెంచుకున్నాడు. గురువారం ఇంటికి వచ్చిన అన్నను విఠల్ గొడ్డలితో నరికి హతమార్చాడు. మృతుడి భార్య విఠల్‌పై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

News April 6, 2024

సూర్యాపేట: పురుగు మందు తాగి వ్యక్తి ఆత్మహత్య

image

పురుగు మందు తాగి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన అనంతగిరి మండల పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వెంకట్రాపురం గ్రామానికి చెందిన చంద్రమౌళి బీపీ, షుగర్‌తో బాధపడుతున్నాడు. జీవితంపై విరక్తి చెంది మంగళవారం రాత్రి ఇంట్లో పురుగు మందు తాగాడు. చికిత్స కోసం సూర్యాపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.

News April 6, 2024

మనోహరాబాద్: కాళ్లకల్‌లో యువకుడి సూసైడ్

image

మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం కాళ్లకల్ గ్రామానికి చెందిన చింతల ప్రశాంత్(23) రాత్రి ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేసే ప్రశాంత్ రాత్రి ఇంట్లో ఉరి వేసుకోగా చికిత్స కోసం తూప్రాన్ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడి శవాన్ని పోస్టుమార్టం కోసం మార్చురీకి తరలించారు. మృతికి కారణాలు తెలియలేదు. ప్రశాంత్ నిన్న విందుకు హాజరైనట్లు తెలిసింది.

News April 6, 2024

UPDATE.. కరీంనగర్: అర్ధరాత్రి రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి

image

కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లో శుక్రవారం రాత్రి సమయంలో జరిగిన ప్రమాదంలో గంట విజయ్(17), గంట వర్ష(15), సింధూజ(18)లు మృత్యువాత పడ్డారు. బోర్నపల్లి పెద్దమ్మ జాతరలో పాల్గొని బైక్ పై తిరుగు ప్రయాణం అయిన వీరు అటు వైపుగా వస్తున్న మొరం లారీని చూసి క్రాసింగ్ వద్ద ఆగారు. మొరం తరలిస్తున్న టిప్పర్ అదుపుతప్పి వారిపైనే బోల్తాపడింది. విజయ్, వర్ష, సింధూజలపై మొరం పడటంతో చిక్కుకుపోయి అక్కడికక్కడే మృతి చెందారు.

News April 6, 2024

నెన్నెల: బైక్ అదుపుతప్పి యువకుడి మృతి

image

మంచిర్యాల జిల్లానెన్నెల మండలంలోని కంబాల కుంట మూలమలుపు వద్ద బైక్ అదుపుతప్పడంతో ప్రమాదం జరిగింది. బెల్లంపల్లి మండలానికి చెందిన బలరాం(38) మృతిచెందగా, లంబడి తండాకు చెందిన నవీన్ తీవ్రంగా గాయపడ్డారు. శుభకార్యంలో పాల్గొని బెల్లంపల్లికి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. నవీన్‌ మంచిర్యాల ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

News April 6, 2024

WGL: అంతర్జాతీయ క్రీడల్లో దీక్షిత

image

మారుమూల ప్రాంతంలో పుట్టి ఫెన్సింగ్ అంతర్జాతీయ క్రీడల్లో రాణిస్తోంది కాటారం మండల కేంద్రానికి చెదిన దేవరకొండ దీక్షిత. ప్రస్తుతం HYD స్పోర్ట్స్ స్కూల్‌లో ఇంటర్ చదువుతూ.. పంజాబ్‌లోని పటియాలలో ఫెన్సింగ్ క్రీడలో శిక్షణ పొందుతున్నారు. అంతేకాదు, పారిస్‌లో జరిగిన విదేశీ శిక్షణకు ఎంపికై గత డిసెంబర్లో 15రోజుల పాటు శిక్షణ పూర్తి చేశారు. దేశం తరఫున ఆడి బంగారు పతకం సాధించడమే తన లక్ష్యమని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.