Telangana

News April 6, 2024

KMM: పనికి వెళ్లమన్నందుకు సూసైడ్ 

image

కుటుంబ సభ్యులు మందలించారని ఓ బాలుడు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన కామేపల్లి మండలంలో జరిగింది. ఎస్ఐ తెలిపిన వివరాల ప్రకారం.. గోవింద్రాల గ్రామానికి చెందిన బాలుడు ఇటీవలే 10 తరగతి పరీక్షలు రాసి ఇంటి వద్ద ఉంటున్నాడు. అయితే, ఏదైనా పని చేయాలంటూ కుటుంబీకులు సూచించడంతో మనస్తాపానికి గురైన బాలుడు శుక్రవారం చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనపై ఎస్సై ప్రవీణ్ కుమార్ కేసు నమోదు చేశారు.

News April 6, 2024

సంగారెడ్డిలో దేశంలోనే మొదటి గిరిజన న్యాయ కళాశాల

image

గిరిజన విద్యార్థులు న్యాయ విద్యలో రాణించేలా ప్రోత్సహించాలన్నదే ప్రభుత్వ లక్ష్యంగా ప్రత్యేకంగా న్యాయ విద్య అభ్యసించేలా మొట్టమొదటి గిరిజన లా కళాశాలను మూడేళ్ల కిందట సంగారెడ్డిలో ఏర్పాటు చేశారు. దేశంలోనే ఏర్పడిన మొదటి ఎస్టీ గురుకుల న్యాయ కళాశాల ఇది. ఇంటర్మీడియట్‌ అర్హతతో లాసెట్‌ రాసిన వారిలో ప్రతిభ ఆధారంగా సీట్లు కేటాయిస్తారు. ఐదేళ్లలో బీఏ, ఎల్పీబీబీ పూర్తి చేసేందుకు వీలుంటుంది.

News April 6, 2024

నేడు HYDలో ట్రాఫిక్‌ మళ్లింపు

image

తుక్కుగూడలో కాంగ్రెస్‌ తలపెట్టిన జనజాతర బహిరంగ సభ నేపథ్యంలో సభకు వచ్చే వాహనదారులకు, సాధారణ వాహనదారులకు రాచకొండ సీపీ తరుణ్‌జోషి పలు సూచనలు చేశారు. శనివారం సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు వాహనదారులు నిబంధనలు పాటించాలన్నారు. NH- 44 బెంగళూరు నుంచి వచ్చే వాహనాలు పాలమాకుల, స్వర్ణభారతి ట్రస్టు, పెద్ద గోల్కొండ సర్వీసు రోడ్డు నుంచి ఓల్డ్‌ పీఎం మీటింగ్‌ స్థలం వద్ద పార్కింగ్‌ చేయాలన్నారు.

News April 6, 2024

నేడు HYDలో ట్రాఫిక్‌ మళ్లింపు

image

కాంగ్రెస్‌ తుక్కుగూడలో తలపెట్టిన జనజాతర బహిరంగ సభ నేపథ్యంలో సభకు వచ్చే వాహనదారులకు, సాధారణ వాహనదారులకు రాచకొండ సీపీ తరుణ్‌జోషి పలు సూచనలు చేశారు. శనివారం సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు వాహనదారులు నిబంధనలు పాటించాలన్నారు. NH- 44 బెంగళూరు నుంచి వచ్చే వాహనాలు పాలమాకుల, స్వర్ణభారతి ట్రస్టు, పెద్ద గోల్కొండ సర్వీసు రోడ్డు నుంచి ఓల్డ్‌ పీఎం మీటింగ్‌ స్థలం వద్ద పార్కింగ్‌ చేయాలన్నారు.

News April 6, 2024

ఉమ్మడి జిల్లాలో శుభకార్యాల వేళ ఎన్నికల కోడ్ కష్టాలు

image

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఈ నెల 9 నుంచి 28 వరకు ఎక్కువమంది పెళ్లిళ్లకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో పెళ్లి సామాగ్రిని సమకూర్చుకోవడానికి వివిధ ఖర్చుల నిమిత్తం షాపింగ్ చేసుకుంటున్నారు. ఆన్లైన్ చెల్లింపులకు ఆదాయపు పన్ను శాఖ ఆంక్షలు ఉండడం, ప్రస్తుతం పార్లమెంటు ఎన్నికల కోడ్ అమలులో ఉండడంతో రూ.50 వేలకు మించి నగదు తీసుకువెళ్తే పోలీసులు తనిఖీలు చేస్తుండడంతో.. వారు ఇబ్బందులు పడుతున్నారు.

News April 6, 2024

సంగారెడ్డి: 15 నుంచి వార్షిక పరీక్షలు

image

జిల్లాలో 1 నుంచి 9వ తరగతి విద్యార్థులకు ఈనెల 15 నుంచి 22వ తేదీ వరకు వార్షిక పరీక్షలు జరుగుతాయని డీఈవో వెంకటేశ్వర్లు శనివారం తెలిపారు. విద్యార్థులు రాసిన జవాబు పత్రాలు వెంటనే మూల్యాంకనం చేయాలని చెప్పారు. 23వ తేదీన విద్యార్థుల తల్లిదండ్రులను పిలిచి ప్రోగ్రెస్ కార్డులు అందజేయాలని సూచించారు.

News April 6, 2024

GREAT.. KNR జిల్లా వాసి అద్భుత ఆవిష్కరణ

image

చదివింది పదో తరగతి అయినప్పటికీ నూతన పరికరాలను తయారు చేసి ఔరా అనిపిస్తున్నాడు జగిత్యాల జిల్లా మల్యాల మండలానికి చెందిన తిరుపతి. పదేళ్లు సింగపూర్‌లో ఉండి 20 రోజుల క్రితం స్వగ్రాయానికి వచ్చారు. రైతులకు ఉపోయోగపడేలా రూ.15వేల ఖర్చుతో 2 వారాల్లోనే సైకిల్ మోటార్‌ను తయారు చేశారు. లీటరు పెట్రోల్‌కు 20కి.మీ దూరం ప్రయాణించేలా రూపొందించాడు. కాగా, గతంలో గడ్డికోసే యంత్రం, పసుపు తవ్వే యంత్రాన్ని కూడా తయారుచేశాడు.

News April 6, 2024

పర్యాటకులను ఆకట్టుకునేలా భీమునిపాదానికి సొబగులు!

image

మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలోని భీమునిపాదం జలపాతం వద్ద పర్యాటకులను ఆకట్టుకునేలా వివిధ సొబగులను దిద్దుతున్నారు. రూ.40లక్షల వ్యయంతో జలపాతం ఎదురుగా వాచ్ టవర్, 14 బల్లాలను, బండరాళ్లతో నడక దారి పనులు చేస్తున్నారు. వంటలు చేసుకునేలా గదులు, బోరు, దుస్తులు మార్చుకునే గదులను ఏర్పాటు చేశారు. పర్యాటకుల భద్రత కోసం సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు.

News April 6, 2024

కోదాడలో కరెంట్ షాక్‌తో కూలీ మృతి 

image

కరెంట్ షాక్‌తో కూలీ మృతి చెందిన ఘటన కోదాడ మండలం నల్లబండగూడెం శివారులో జరిగింది. రెడ్ల కుంటకు చెందిన మహమ్మద్ అబ్దుల్ హలీం విద్యుత్ ఇంటి నిర్మాణ పనులు చేస్తుండగా కరెంట్ షాక్ కొట్టి చనిపోయినట్లు ఎస్సై అనిల్ రెడ్డి తెలిపారు. ఇంటి పైనుంచి 11 కేవీ వైర్ వెళ్లిన విషయం గమనించకుండా అల్యూమినియం బద్దెలు ఎత్తుతుండగా అవి విద్యుత్ తీగల తగిలి విద్యుత్ ఘాతానికి గురై మృతి చెందినట్లు తెలిపారు.

News April 6, 2024

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

image

> బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రైతు నిరసన దీక్షలు
> ముదిగొండలో విద్యుత్ సరఫరాకు అంతరాయం
> జన జాతరకు తరలనున్న కాంగ్రెస్ శ్రేణులు
> ఖమ్మంలో ఎంపీ నామా నాగేశ్వరరావు పర్యటన
> ఖమ్మం వ్యవసాయ మార్కెట్ బంద్
> తాగునీటి ఎద్దడి పై జిల్లా ప్రత్యేక పర్యవేక్షణ అధికారి సురేంద్రమోహన్ సమీక్ష
> భద్రాద్రి జిల్లా కలెక్టర్ లోక్ సభ ఎన్నికలపై సమీక్ష