Telangana

News April 6, 2024

వరంగల్ జిల్లాలో 43,594 మంది గ్రాడ్యుయేట్స్ ఓటర్లు

image

ఉమ్మడి వరంగల్-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల శాసన మండలి ఉప ఎన్నికల కోసం ఇటీవల రాష్ట్ర ఎన్నికల సంఘం ఓటర్ల నుంచి దరఖాస్తులను స్వీకరించింది. ఇందులో వరంగల్ జిల్లాకు సంబందించిన గ్రాడ్యుయేట్స్ ఓటర్ల జాబితాను అధికారులు విడుదల చేశారు. జిల్లాలో మొత్తం 43,594 మంది ఓటర్లుగా నమోదు చేసుకున్నారు. ఇందులో 26,907 మంది పురుషులు, 16,687 మంది మహిళా ఓటర్లు ఉన్నారు.

News April 6, 2024

నేడు తుక్కుగూడ సభ.. పాలమూరు వాహనదారులకు అలర్ట్

image

కాంగ్రెస్‌ పార్టీ శనివారం తుక్కుగూడలో తలపెట్టిన జనజాతర బహిరంగ సభ నేపథ్యంలో.. సభకు వచ్చే వాహనదారులకు, సాధారణ వాహనదారులకు రాచకొండ సీపీ తరుణ్‌జోషి పలు సూచనలు చేశారు. సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9గంటల వరకు వాహనదారులు నిబంధనలు పాటించాలన్నారు. MBNR నుంచి వచ్చే వాహనాలు ఓఆర్‌ఆర్‌ బెంగుళూరు టోల్‌ నుంచి రావిర్యాల టోల్‌ వద్దనుంచి ఫ్యాబ్‌సిటీ వద్ద పార్కింగ్‌ ప్రాంతానికి చేరుకోవాలని సూచించారు.

News April 6, 2024

ఉమ్మడి జిల్లాలో నేటి కార్యక్రమాలు

image

✏నేడు PUలో జాతీయ సదస్సు
✏ధరూర్: నేడు పలు గ్రామాలలో కరెంట్ కట్
✏వనపర్తి: నేడు చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక
✏నేటి రంజాన్ వేళలు:
ఇఫ్తార్(శని)-6:38,సహార్(ఆది)-4:45
✏నేడు ‘జనజాతర బహిరంగ సభ’.. ఉమ్మడి జిల్లా నుంచి తరలి వెళ్ళనున్న నేతలు, కాంగ్రెస్ శ్రేణులు
✏నేడు MVSలో ‘వచన కవిత’ కార్యాశాల
✏నేడు పలుచోట్ల ‘ఇఫ్తార్ విందు’.. హాజరుకానున్న నేతలు
✏పలు నియోజకవర్గంలో పర్యటించనున్న MBNR&NGKL ఎంపీ అభ్యర్థులు

News April 6, 2024

వరంగల్: రేపు మోడల్ స్కూల్ ప్రవేశ పరీక్ష

image

వరంగల్ జిల్లాలోని మోడల్ స్కూళ్లలో ప్రవేశాల కోసం ఈనెల 7న పరీక్ష నిర్వహిస్తున్నట్లు డీఈవో డాక్టర్ ఎండి.అబ్దులై తెలిపారు. 6వ తరగతిలో ప్రవేశాల కోసం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, 7 నుంచి 10 తరగతుల్లో ప్రవేశాల కోసం మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పరీక్ష ఉంటుందని పేర్కొన్నారు. జిల్లాలోని మూడు మోడల్ స్కూళ్లలో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

News April 6, 2024

ఆదిలాబాద్: ’11 మండలాల రైతులను ముంచేశాడు’

image

ఇటీవల ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని తపాలా శాఖ IPPB (ఇండియన్ పోస్టల్ పేమెంట్ బ్యాంకు)లో జరిగిన అక్రమాల తీరుపై పోలీసులు లోతుగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఐపీపీబీ మేనేజర్ విజయ్ జాదవ్ జిల్లా వ్యాప్తంగా 11 మండలాల్లోని 74 మంది రైతులకు చెందిన పత్తి పంట విక్రయాల తాలూకూ డబ్బులను వారి ఖాతాల నుంచి తన సొంత ఖాతాల్లోకి అక్రమంగా మళ్లించుకున్నట్లు తేల్చారు. ఇలా రూ.1.16 కోట్లు ఆయన స్వాహా చేసినట్లు తేల్చారు.

News April 6, 2024

నల్గొండ: ఫోన్ ట్యాపింగ్ మూలాలు ఇక్కడే!

image

రాష్ట్రంలో సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన పోలీసుల పాత్ర ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తోంది. జిల్లాకు చెందిన ఓ సీఐని విచారించగా, నల్గొండలో వార్ రూం ఏర్పాటు చేసినట్లు నిర్ధారించారు. అక్కడ తనిఖీలు నిర్వహించారు. ఇప్పటికే ఇద్దరు కానిస్టేబుళ్లను అదుపులో తీసుకున్నారు. విచారణ కొనసాగుతున్న కొద్దీ ఇంకా ఎవరెవరు బయటకొస్తారోనన్న ఉత్కంఠ ఉంది.

News April 6, 2024

కామారెడ్డి: ఆస్తి పన్ను చెల్లించే వారికి గుడ్ న్యూస్

image

కామారెడ్డి జిల్లాలోని పురపాలికల్లో 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఆస్తి పన్ను చెల్లించే వారికి 5 శాతం పన్ను రాయితీ కల్పిస్తూ సర్కారు తాజాగా ఉత్తర్వులిచ్చింది. ఈ నెలాఖరులోపు చెల్లించేవారికి అవకాశం వర్తించనుంది. గత ఆర్థిక సంవత్సరంలో బకాయిలు లేనివారికి ప్రస్తుతం రాయితీ ఇచ్చారు. బకాయిలు 85 శాతం దాటి వసూలు కావడంతో ఈ సారి నూతనంగా ప్రకటించిన పథకానికి స్పందన వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

News April 6, 2024

WGL: మూడు నెలల్లో వంతెన పూర్తి: MLA

image

HNK-KNR ప్రదాన రహదారిలోని నయీంనగర్ నాలాపై పాత వంతెన కూల్చే పనులకు శుక్రవారం శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా MLA నాయిని రాజేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. 3 నెలల్లో కొత్త వంతెన పనులను పూర్తి చేస్తామని అన్నారు. గత ఐదేళ్లుగా నాలాను ఆనుకొని ఉన్న కాలనీలు వర్షాకాలంలో ముంపునకు గురవుతూ ప్రజలు తీవ్ర ఇబ్బంది పడ్డారని తెలిపారు. దీనికి శాశ్వత పరిష్కారంగా కొత్త వంతెన నిర్మిస్తున్నామని పేర్కొన్నారు.

News April 6, 2024

సిద్దిపేట: విద్యార్థినితో అసభ్య ప్రవర్తన.. టీచర్ సస్పెన్షన్

image

సిద్దిపేట జిల్లా కొండపాక మండలం దుద్దెడ పదవ తరగతి పరీక్షా కేంద్రంలో విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేస్తూ జిల్లా విద్యా శాఖ అధికారి ఇ.శ్రీనివాస్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఘటనపై విచారణ జరిపిన అనంతరం విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించిన విషయం నిజమేనని తేలడంతో సస్పెండ్ చేసినట్లు కొండపాక ఎంఈవో పేర్కొన్నారు.

News April 6, 2024

ఖమ్మం: ముగిసిన ఇంటర్ వాల్యుయేషన్

image

ఖమ్మం: ఇంటర్మీడియట్‌ జవాబు పత్రాల మూల్యాంకనం శుక్రవారంతో ముగిసింది. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి 2,75,139 జవాబు పత్రాలను జిల్లాకు పంపించగా  నెల 4వ తేదీ నుంచి మూల్యాంకనం ప్రారంభించారు. ప్రతీ అధ్యాపకుడు రోజుకు 30 చొప్పున జవాబు పత్రాలను దిద్దగా , శుక్రవారంతో వాల్యూయేషన్‌ పూర్తయిందని డీఐఈఓ కె.రవిబాబు తెలిపారు.