Telangana

News April 5, 2024

ADB: బీఆర్ఎస్ పార్టీ ఇన్‌ఛార్జి నియామకం ఎప్పుడు..?

image

లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రధాన పార్టీలు ఇప్పటికే MP అభ్యర్థులను ప్రకటించాయి. వారితో పాటు నియోజకవర్గ ఇన్‌ఛార్జులుగా BJP.. MLA పాయల్ శంకర్‌ను, కాంగ్రెస్ పార్టీ మంత్రి సీతక్కను నియమించింది. BRS పార్టీ తమ అభ్యర్థిని ప్రకటించినప్పటికి నియోజకవర్గ ఇన్‌ఛార్జిగా ఇంకా ఎవరిని నియమించలేదు. ఒకవైపు జోగు రామన్న పేరు పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. అయితే ఈనెల 5 తర్వాత ఈ విషయంపై స్పష్టత రావచ్చని సమాచారం.

News April 5, 2024

‘నిబంధనలను అతిక్రమిస్తే కళాశాలకు చర్యలు తప్పవు’

image

నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేట్ జూనియర్ కళాశాలల్లో విద్యార్థులకు ప్రవేశాలు కల్పించినా, తరగతులు ప్రారంభించినా యాజమాన్యాలపై చర్యలు తీసుకుంటామని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖాధికారి కె.రవిబాబు తెలిపారు. అలాగే, పదో తరగతి పూర్తయిన విద్యార్థులకు బ్రిడ్జి కోర్సులు నిర్వహించినా చర్యలు తప్పవని హెచ్చరించారు. 2024-25వ విద్యాసంవత్సరానికి ప్రథమ సంవత్సరం ప్రవేశాలకు ఇంటర్మీడియట్ బోర్డు నుంచి ప్రకటన రాలేదన్నారు.

News April 5, 2024

HYD: విచిత్రం.. చనిపోయిన టీచర్‌కు నోటీసులు

image

చనిపోయిన టీచర్‌కు నోటీసులు పంపిన విచిత్ర ఘటన ఇది. మేడ్చల్ జిల్లా జవహర్‌నగర్ ZPHSలో N.గీత స్కూల్‌ అసిస్టెంట్(సోషల్)గా విధులు నిర్వహించారు. 2020‌లో ఆమె బెస్ట్‌ టీచర్‌ అవార్డు కూడా అందుకొన్నారు. కానీ, దురదృష్టవశాత్తు క్యాన్సర్‌తో పోరాడి 2023, మే నెలలో చనిపోయారు. ఇది గుర్తించని విద్యాశాఖ అధికారులు 10వ తరగతి పేపర్లు దిద్దేందుకు రాలేదని షోకాజ్ నోటీసులు పంపడం గమనార్హం. ఇది చర్చనీయాంశమైంది.

News April 5, 2024

ఉమ్మడి జిల్లాలో నేటి కార్యక్రమాలు!

image

✏MBNR&NGKL జిల్లాలో కొనసాగుతున్న పదో తరగతి జవాబు పత్రాల వాల్యుయేషన్ ✏పలుచోట్ల ఈద్గాలను పరిశీలించనున్న అధికారులు ✏పలు నియోజకవర్గంలో పర్యటించిన MBNR, NGKL ఎంపీ అభ్యర్థులు ✏నేడు ఉమ్మడి జిల్లాలో బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతి ✏నేటి రంజాన్ వేళలు:
ఇఫ్తార్(FRI)-6:37,సహార్(SAT)-4:46 ✏అచ్చంపేట:నేడు BRS సన్నాహక సమావేశం ✏పలుచోట్ల ‘ఇఫ్తార్ విందు’.. హాజరుకానున్న నేతలు✏NRPT: నేడు రైతు సమస్యలపై BJP సత్యాగ్రహం

News April 5, 2024

సూర్యాపేట రోడ్డు ప్రమాదంలో ప్రభుత్వ టీచర్ మృతి

image

సూర్యాపేటలో జరిగిన రోడ్డుప్రమాదంలో ప్రభుత్వ టీచర్ సరిత మృతి చెందారు. ఆటోలో ఉన్న లావణ్య, పావని అనే మరో ఇద్దరు టీచర్ల పరస్థితి విషమంగా ఉంది. వీరిలో లావణ్యను మెరుగైన చికిత్స కోసం HYDకు తరలించారు. వారి మృతి పట్ల తెలంగాణ రాష్ట్ర కాంట్రిబ్యూటరీ పెన్షనర్స్ స్కీం ఎంప్లాయిస్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు లక్కపాక ప్రవీణ్ కుమార్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.

News April 5, 2024

NZB: ఆస్తి కోసం మామను చంపిన అల్లుడు

image

ఆస్తికోసం మామను హత్య చేసిన ఘటన మహ్మద్‌నగర్ మండలం బూర్గుల్‌లో జరిగింది. గ్రామానికి చెందిన పోచయ్య(58) బుధవారం రాత్రి ఓ వివాహ వేడుకకు హాజరై తిరిగి వెళ్లాడు. గురువారం ఉదయం అతడి బైక్ నిజాంసాగర్ కాలువపై కనిపించడంతో స్థానికులు గాలించగా గాలీపూర్ శివారులో మృతదేహం లభ్యమైంది. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఆస్తి కోసం ఆయన అల్లుడు శ్రీనివాస్, మహబూబ్, రాములుతో కలిసి హత్య చేసినట్లు CI సత్యనారాయణ తెలిపారు.

News April 5, 2024

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పెరుగుతున్న ప్లాస్టిక్ వినియోగం

image

ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా రోజురోజుకు జనాభా పెరుగుతుండడంతో ప్లాస్టిక్ వినియోగం కూడా పెరుగుతోంది. ప్లాస్టిక్ కవర్లు, వ్యర్థాలతో ప్రమాదం పొంచి ఉన్నా.. ఆయా జిల్లాల పుర అధికారులు నియంత్రించడం లేదు. చట్ట ప్రకారం 120 మైక్రాన్ల కంటే తక్కువగా ఉన్న ప్లాస్టిక్ కవర్లు ఉపయోగించరాదు. గత సంవత్సరం తూతూ మంత్రంగా తనిఖీలు నిర్వహించి ప్లాస్టిక్ నిర్మూలనను గాలికి వదిలేశారు.

News April 5, 2024

జడ్చర్ల: ఐదేళ్ల బాలికపై లైంగిక దాడి

image

జడ్చర్ల మండలంలోని ఓ తండాకు చెందిన బాలిక(5)పై బాలుడు(12) లైంగిక దాడికి పాల్పడ్డాడు. పోలీసులు, స్థానికుల వివరాల ప్రకారం.. తండాలోని పాఠశాల ఆవరణలో గురువారం తోటి పిల్లలతో కలిసి బాలిక ఆడుకుంటుండగా.. అదే తండాకు చెందిన బాలుడు చాక్లెట్లు ఇస్తానని ఆశ చూపి పక్కకు తీసుకెళ్లి లైంగికదాడికి పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు ఆరా తీశారు. జరిగిన విషయాన్ని బాలిక చెప్పడంతో స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

News April 5, 2024

ఆ ప్రాంతాల్లో నిరంతర నిఘా: ఎస్పీ చందనా దీప్తి

image

షీటీం బృందాలు మహిళా రక్షణలో ముందు వరుసలో ఉంటున్నాయని ఎస్పీ చందనా దీప్తి తెలిపారు. మహిళలను వేధిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. గత నెలలో 12 ఫిర్యాదులు వస్తే 9 కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. జన సమూహాలు ఎక్కువగా ఉండే ప్రాంతాలతో పాటు బస్టాండు, రైల్వే స్టేషన్లు, కళాశాలల వద్ద షీటీం సభ్యులు నిరంతర నిఘా ఉంటుందని తెలిపారు. వీటి పై సమాచారం అందించే వారు 98126 70235 చరవాణి సంప్రదించాలని కోరారు

News April 5, 2024

ఎనుమాముల మార్కెట్‌కు 5 రోజులు సెలవు

image

వరంగల్ వ్యవసాయ మార్కెట్‌కు వరుసగా 5 రోజులు సెలవులు రానున్నాయి. ఈ మేరకు మార్కెట్ కార్యదర్శి సంగయ్య ఓ ప్రకటన విడుదల చేశారు. ఈనెల 5న బాబూజగజ్జీన్‌రామ్ జయంతి, 6, 7 తేదీల్లో వారాంతపు సెలవు, 8న అమావాస్య, 9న ఉగాది సందర్భంగా సెలవులు ప్రకటించినట్లు పేర్కొన్నారు. ఈ మేరకు మార్కెట్ బంద్ ఉంటుందని రైతులు గమనించాలని సూచించారు.