Telangana

News April 4, 2024

కరీంనగర్ జిల్లా స్పెషల్ ఆఫీసర్‌గా ఆర్‌వీ.కర్ణన్

image

కరీంనగర్ జిల్లా స్పెషల్ ఆఫీసర్‌గా ఆర్.వి.కర్ణన్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలువురు ఐఏఎస్ ఆఫీసర్లను స్పెషల్ అబ్జర్వర్స్(ప్రత్యేక పరిశీలకులు)గా నియమిస్తూ ఈమేరకు ప్రభుత్వం ఉత్తర్వు 566 జారీ చేసింది. వేసవి దృష్ట్యా అన్ని ప్రాంతాలలో తాగు నీరు అందుబాటులో ఉండే విధంగా చూడాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.

News April 4, 2024

NRPT: ‘ఉద్యోగావకాశాలు.. ఇంటర్వ్యూల్లో పాల్గొనండి’

image

నారాయణపేట జిల్లా వైద్య కళాశాలలో ఔట్సోర్సింగ్ ఉద్యోగాల నియామకానికి నిర్వహించే ఇంటర్వ్యూలకు హాజరు కావాలని కలెక్టర్ శ్రీహర్ష తెలిపారు. 22 సీనియర్ రెసిడెంట్, 3 ఎకనామీ, 2 ఫిజియాలజీ, 2 బయో కెమిస్ట్రీ ట్యూటర్ పోస్టులు ఉన్నాయని తెలిపారు. అభ్యర్థులు ధ్రువపత్రాలతో ఏప్రిల్ 6 న ఉదయం 9 గంటలకు వైద్య కళాశాలలో వాక్ ఇన్ ఇంటర్వ్యూలో పాల్గొనాలని, వివరాలకు https://narayanpet.telagana.gov.in లో చూడాలన్నారు.

News April 4, 2024

MBNR: పచ్చటి అడవి మధ్యలో వెలసిన ఆలయం

image

మహబూబ్ నగర్ జిల్లా కేంద్రానికి నవాబ్ పేట మండల కేంద్రానికి మార్గ మధ్యంలో 9 కిలోమీటర్ల దూరంలో అడవి మధ్యలో వెలసిన పర్వతాపూర్ మైసమ్మ దేవాలయం ఉమ్మడి జిల్లాలో ప్రసిద్ధిగాంచినది. కొత్త వాహనం తెచ్చినా, ఎన్నికల ప్రచారాలు ఈ ఆలయం నుండి పూజలు చేసి ప్రారంభించడం ఆనవాయితీ. ఆది, మంగళవారాలు వేల సంఖ్యలో భక్తులు దేవాలయాన్ని దర్శించుకుని బోనాలు సమర్పిస్తారు.

News April 4, 2024

SRPT: ‘రైతులతో వెళ్లి సాగర్ గేట్లు బద్దలు కొడతాం’

image

జిల్లాలోని అన్ని గ్రామాల చెరువులను సాగర్ నీటి ద్వారా నింపాలని, నీరు వదలక పోతే నేరుగా రైతులతో వచ్చి గేట్లు బద్దలు కొడతామని నల్లగొండ పార్లమెంట్ BJP ఎంపీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వానికి హెచ్చరించారు. గురువారం సాగర్ కెనాల్ హెడ్ రెగ్యులేటర్ వద్ద నీటిని పరిశీలించి మాట్లాడారు. నీరు లేక గ్రామాలలో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, వెంటనే ప్రభుత్వం గ్రామాలలో చెరువులను నింపాలన్నారు.

News April 4, 2024

ఖమ్మం: మోడిఫైడ్ సైలెన్సర్లు ఉంటే అంతే సంగతులు

image

ద్విచక్ర వాహనాలకు మోడిఫైడ్ సైలెన్సర్లు అమర్చిన వారిపై ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాసులు తెలిపారు. నగరంలో నిర్వహించిన ప్రత్యేక డ్రైవ్ ద్వారా 79 మంది యువత వాహనాల నుంచి భారీ శబ్దం చేసే సైలెన్సర్లను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. అనంతరం ఒక్కో వాహనదారుడికి రూ. 1,000 జరిమానా విధించామన్నారు. ఇకపై అలా చేస్తే చట్టపరంగా వాహనాలను సీజ్ చేస్తామని హెచ్చరించారు.

News April 4, 2024

ఎవిస్ హాస్పిట‌ల్స్ కొత్త శాఖ‌ల‌తో సేవ‌ల విస్త‌ర‌ణ

image

వాస్క్యుల‌ర్ రంగంలో దేశంలో నం.1 ఎవిస్ హాస్పిట‌ల్స్ త‌మ సేవ‌ల‌ను మ‌రింత విస్త‌రిస్తోంది. గురువారం కూక‌ట్‌ప‌ల్లిలో ఎవిస్ హాస్పిట‌ల్స్ నూత‌న శాఖ ప్రారంభించారు. MD, ప్ర‌ముఖ ఇంట‌ర్వెన్ష‌న‌ల్ రేడియోల‌జిస్ట్ డా.రాజా వి కొప్పాల పూజాదికాల‌తో కొత్త ఆసుప‌త్రికి అంకురార్ప‌ణ చేశారు. కార్యక్రమంలో డైరెక్ట‌ర్లు శ్రీ‌నివాస్, భ‌ర‌త్‌, వైభ‌వ్, డాక్ట‌ర్లు సంప‌త్, మ‌ల్లీశ్వ‌రి, బిందు, అధికారులు పాల్గొన్నారు.

SA-2 పరీక్షలు ఈనెల 15కు వాయిదా

image

SA-2 పరీక్షలు ఈనెల 15 కు వాయిదా వేస్తూ విద్యాశాఖ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. తొలుత ఈ పరీక్షలు ఏప్రిల్ 8 నుంచి ఏప్రిల్ 18 వరకు ఉన్నాయి. కాగా హై స్కూల్ ఉపాధ్యాయులు స్పాట్ డ్యూటీలో ఉండటం మూలంగా ఒకటి నుంచి 9వ తరగతి వరకు పరీక్షల నిర్వహణకు ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉందని భావించిన విద్యాశాఖ అధికారులు ఈ పరీక్షలు ఏప్రిల్ 15 నుంచి 22 వరకు నిర్ణయిస్తూ షెడ్యూల్ జారీ చేశారు.

News April 4, 2024

మూసీ నదిపై GHMC కీలక నిర్ణయం

image

HYDలోని మూసీ నదికి ఇరువైపులా 50 మీటర్ల పరిధిలో నిర్మాణం, లే అవుట్ అనుమతులను నిలిపివేయాలని GHMC నిర్ణయించింది. ఈ మేరకు జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రాస్ ఉత్తర్వులు జారీ చేశారు. వేర్వేరు సంస్థల ఆధ్వర్యంలో చేపట్టే అభివృద్ధి పనులను అనుమతించొద్దని ఉప కమిషనర్లు, ప్రణాళిక అధికారులకు తెలుపుతూ వెంటనే ఆదేశాలను అమలు చేయాలని తెలియజేశారు. మూసీ మాస్టర్ ప్లాన్ డెవలప్మెంట్‌లో భాగంగా చర్యలకు ఉపక్రమించారు.