Telangana

News April 4, 2024

MBNR: ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత బదిలీలు చేపట్టాలి

image

తెలంగాణ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ఉద్యోగులకు పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని, పెండింగ్లో ఉన్న మూడు డీఏలను ఎన్నికల కమిషన్ అనుమతితో మంజూరు చేయాలని, ఆర్థిక శాఖలో పెండింగ్లో ఉన్న బిల్లులను మంజూరు చేయాలని కోరారు. ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత సాధారణ బదిలీలను చేపట్టాలని అన్నారు. కార్యక్రమంలో కార్యదర్శి సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.

News April 4, 2024

మానవత్వం చాటుకున్న మంత్రి సీతక్క కుమారుడు

image

మంత్రి సీతక్క కుమారుడు, కాంగ్రెస్ యూత్ నాయకుడు దనసరి సూర్య మరోసారి మానవత్వాన్ని చాటుకున్నారు. మంగపేట మండలంలో తన పర్యటన ముగించుకొని వస్తున్న నేపథ్యంలో బోరు నరసాపురం గ్రామానికి చెందిన అజ్జు రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు. దీంతో స్వయంగా తన వాహనంలో మంగపేట ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించారు. అనంతరం వైద్యులతో సూర్య మాట్లాడి మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు.

News April 4, 2024

KMR: అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి

image

అనుమానాస్పద స్థితిలో ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన కామారెడ్డి జిల్లా మహమ్మద్ నగర్ మండలంలో గురువారం జరిగింది. ఎస్సై సుధాకర్ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని బుర్గుల్ గ్రామానికి చెందిన చాకలి పోశయ్య గ్రామ శివారు మీదుగా వెళ్లే నిజాంసాగర్ కెనాల్‌లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.

News April 4, 2024

పాలమూరు.. బెంగళూరు కానుందా..?

image

ఉమ్మడి జిల్లాలో భూగర్భజలాలు అడుగంటి పోతున్నాయి. రోజురోజుకూ నీటి ఎద్దడి తీవ్రం అవుతోంది. అయితే జలసంరక్షణ చర్యలు లేకపోవడంతోపాటు తాగునీటిని విచ్చలవిడిగా వాడటం, పచ్చదనాన్ని దెబ్బతీయడం, వాల్టా చట్టం అమలు చేయకపోవడం ఇందుకు కారణమని నిపుణులు అంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల నుంచి పాలమూరు ప్రజలు చాలా నేర్చుకోవాలని.. నీటి సంరక్షణకు చర్యలు చేపట్టకపోతే బెంగళూరు మాదిరిగా నీటి కటకట రానుందని హెచ్చరించిస్తున్నారు.

News April 4, 2024

సంగారెడ్డి: ఎన్నికల శిక్షణకు హాజరుకాని 101 మందికి నోటీసులు

image

పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఈనెల 1 నుంచి 3వ తేదీ వరకు జరిగిన ఎన్నికల శిక్షణకు హాజరుకాని 101 మందికి షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు కలెక్టర్ వల్లూరి క్రాంతి గురువారం తెలిపారు. శిక్షణకు ఎందుకు హాజరు కాలేదో వివరణ ఇవ్వాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వివరణ సంతృప్తికరంగా లేకుంటే కఠిన తీసుకుంటామని హెచ్చరించారు.

News April 4, 2024

బిజినేపల్లి: బైక్ పైనుంచి పడి వ్యక్తి మృతి

image

బైక్ అదుపుతప్పడంతో కిందపడి ఒకరు మృతిచెందారు. ఈ ఘటన బిజినేపల్లి మండల కేంద్రంలోని వెంకటాపూర్ గ్రామ సమీపంలో ఇవాళ మధ్యాహ్నం జరిగింది. ఎస్సై నాగశేఖర్ రెడ్డి వివరాల ప్రకారం.. నాగనులు గ్రామానికి చెందిన కృష్ణయ్య(65) పని నిమిత్తం ద్విచక్రవాహనంపై పాలెం నుంచి గ్రామానికి వెళ్తున్నాడు. ఈక్రమంలో మార్గ మధ్యలో అదుపుతప్పి కిందపడటంతో తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనపై కేసు నమోదు చేశారు.

News April 4, 2024

KMM: రైలు కిందపడి వ్యక్తి మృతి

image

రైలు కిందపడి గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన మధిర-మోటమర్రి రైల్వే స్టేషన్ల మధ్య ఆర్సీఎం చర్చి సమీపంలో చోటుచేసుకుంది. స్థానికుల సమాచారం మేరకు ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మధిర ప్రభుత్వాసుపత్రికి మృత దేహాన్ని తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతుడి వివరాలు తెలిసిన వారు 8712658589, 8712658607 నంబర్లు సంప్రదించాలన్నారు.

News April 4, 2024

దుబాయ్‌లో సిరిసిల్ల జిల్లా వాసి మృతి

image

దుబాయ్‌లో సిరిసిల్ల జిల్లా వాసి మృతి చెందాడు. స్థానికుల ప్రకారం.. బోయిన్పల్లి మండలం విలాసాగర్ గ్రామానికి చెందిన చల్ల శ్రీనివాస్ దుబాయ్‌లో రెండు రోజుల క్రితం మృతి చెందాడు. శ్రీనివాస్ 12 ఏళ్ల క్రితం బతుకుతెరువు కోసం దుబాయ్ వెళ్లాడు. వీసా సమస్యల వల్ల ఇంటికి రాలేకపోయాడు. ఈ క్రమంలో రెండ్రోజుల క్రితం గుండెపోటుతో మృతి చెందాడు. మృతదేహాన్ని స్వగ్రామం రప్పించేందుకు గల్ఫ్ సంఘాలు చర్యలు తీసుకుంటున్నాయి.

News April 4, 2024

జనగామ: ఎదురెదురుగా ఢీ కొన్న రెండు కార్లు

image

జనగామ జిల్లా దేవరుప్పుల మండలం సింగరాజు పల్లి టోల్ గేట్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు కార్లు ఎదురెదురుగా వస్తూ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కార్లలో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు.
కొందరికి తీవ్ర గాయాలు కాగా.. అంబులెన్స్‌లో జిల్లా ఆసుపత్రికి స్థానికులు తరలించారు.
పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News April 4, 2024

NLG: పోస్టల్ బ్యాలెట్ పై కలెక్టర్ సమీక్ష

image

లోక్ సభ ఎన్నికల సందర్బంగా కేంద్ర ఎన్నికల సంఘం గుర్తించిన అత్యవసర సేవలు అందించే శాఖల ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్, ఎన్నికల అధికారి హరిచందన అన్నారు. గురువారం ఆమె జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం ఉన్న FCI, BSNL, రైల్వే, వైద్య ఆరోగ్య, ట్రాన్స్పోర్ట్, TSSPDCL, తదితర శాఖల నోడల్ అధికారులతో పోస్టల్ బ్యాలెట్ పై సమీక్షించారు.