Telangana

News September 8, 2024

ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రి కోమటిరెడ్డి

image

నల్గొండ పట్టణంలో పలు వార్డులలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పలు వినాయకుని మండపాల వద్ద ప్రత్యేక పూజలు చేశారు. మంత్రి మాట్లాడుతూ.. దైవచింతనతో మానసిక ప్రశాంతత లభిస్తుందన్నారు. ప్రతి ఒక్కరు దైవ చింతన అలవర్చుకోవాలని కోరారు. వారి వెంట మున్సిపల్ ఛైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, గుమ్మల మోహన్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. 

News September 8, 2024

దీప్తిని సన్మానించిన మంత్రి సీతక్క

image

పారాలింపిక్స్‌లో కాంస్య పథకం సాధించిన దీప్తి జీవంజిని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ఘనంగా సన్మానించారు. వరంగల్ జిల్లాకు చెందిన దీప్తి పథకం సాధించడం తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణమని సీతక్క అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో సాట్ చైర్మన్ శివసేనారెడ్డి, దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ వీరయ్య, తదితరులు పాల్గొన్నారు.

News September 8, 2024

మిడ్ మానేరుతో నిర్వాసితులకు ఉపాధి!

image

మధ్యమానేరు నిర్వాసితులు మిడ్ మానేరులో చేపలు పడుతూ ఆర్థికంగా స్థిరపడ్డారు. మధ్యమానేరు నిర్మాణంతో సర్వం కోల్పోయి పునరావాస గ్రామాలకు తరలిన మత్స్యకారులు అదే ప్రాజెక్టును ఉపాధికి నిలయంగా మార్చుకున్నారు. హైదరాబాద్ వంటి పట్టణాలకు చేపలు తరలిస్తూ ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నారు. దాదాపు 1500 మంది చేపలు పట్టేందుకు లైసెన్స్ పొందారు.

News September 8, 2024

ములుగు: విపత్తుతో నేల కూలీల చెట్లు.. పర్యాటక ప్రాంతంగా మారింది!

image

తాడ్వాయి-మేడారం అడవుల్లో కొన్ని రోజుల క్రితం విపత్తు కారణంగా వేల చెట్లు నేలకొరిగాయి. ఇప్పుడు ఆ ప్రాంతం చెట్లను కోల్పోయి వెలవెలబోతోంది. విపత్తు కారణంగా నేలకూలిన చెట్లను చూడటానికి చుట్టుపక్కల మండల ప్రజలు, విద్యార్థులు, మేడారం దర్శనం కోసం వచ్చే భక్తులు పర్యాటక ప్రాంతంగా తరలివచ్చి వీక్షిస్తున్నారు. అందరూ సెల్ ఫోన్లో చిత్రీకరించుకుంటున్నారు. ఎప్పుడు ఇంతటి విపత్తు చూడలేదని వారు తెలిపారు.

News September 8, 2024

గద్వాల: నీటి గుంతలో పడి పదేళ్ల బాలుడి మృతి

image

గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలంలో పండగ పూట విషాదం నెలకొంది. నీటి గుంతలో పడి బాలుడు మృతిచెందాడు. స్థానికుల సమాచారం.. తనగల గ్రామ శివారులోని గుట్ట మొరం మట్టిని తరలించగా ఏర్పడిన గుంతలో నీరు నిల్వ నిలిచింది. గ్రామానికి చెందిన బోయ భాస్కర్ కుమారుడు పట్టాభి(10) శనివారం స్నేహితులతో కలిసి వెళ్లి ప్రమాదవశాత్తు ఆ గుంటలో పడి మరణించాడు. ఒక్కగానొక్క కొడుకు మృతితో ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుయ్యారు.

News September 8, 2024

ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించిన ఉప ముఖ్యమంత్రి

image

ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం ముదిగొండ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సందర్శించారు.
ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మౌలిక వసతులు, రోగులకు అందిస్తున్న సేవల గురించి సిబ్బందిని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు.

News September 8, 2024

ఖమ్మం: విద్యార్థులు చదువు.. వరద పాలు

image

భారీ వర్షాలు విద్యార్థుల చదువును వరదల పాలు చేశాయి. ఖమ్మం జిల్లాలో 72 పాఠశాలలు దెబ్బతిన్నాయి. శ్లాబ్లు కూలిపోవడం, పగుళ్లు రావడం, లీకేజీలు, కిచెన్ షెడ్ కూలిపోవడం, ఫర్నిచర్ దెబ్బతినడం, పుస్తకాలు, కంప్యూటర్లు, రికార్డులు, సర్టిఫికెట్లు తడిసి పాడైపోవడం వంటివి జరిగాయి. దీంతో వేలాది మంది విద్యార్థుల చదువుపై ప్రభావం పడే పరిస్థితి నెలకొంది.  

News September 8, 2024

రాష్ట్రంలోనే అత్యల్పంగా అక్షరాస్యత గల జిల్లా గద్వాల !

image

వయోజనులను అక్షరాలు నేర్పించేందుకు కేంద్ర ప్రభుత్వం నవ భారత సాక్షరత కార్యక్రమం అమలు చేసిందని, వాటిపై ప్రత్యేక దృష్టి పెడతామని వయోజన విద్య ప్రోగ్రాం అధికారి నుమాన్ అన్నారు. ఉమ్మడి జిల్లాలో MBNR-55.04%, GDWL-49.87%, NGKL-58.99%, NRPT-49.98%, WNPT-55.67 శాతం అక్షరాస్యత ఉందని అంచనా. GDWL జిల్లా రాష్ట్రంలోనే అక్షరాస్యత అత్యల్పంగా ఉంది. నేడు ప్రపంచ అక్షరాస్యతా దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం.

News September 8, 2024

సంగారెడ్డి: 10న న్యాస్ సన్నాహక పరీక్ష

image

సంగారెడ్డి జిల్లాలోని 3, 6, 9 తరగతుల విద్యార్థులకు ఈనెల 10న న్యాస్ సన్నాహక పరీక్ష నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు ఆదివారం తెలిపారు. ఈ పరీక్షకు సంబంధించిన ప్రశ్న పత్రాలు ఇప్పటికే పాఠశాలలకు పంపించినట్లు చెప్పారు. విద్యార్థులకు న్యాస్ పరీక్ష నిర్వహించి జవాబు పత్రాలు మళ్లీ మండల విద్యాధికారి కార్యాలయానికి పంపించాలని సూచించారు.

News September 8, 2024

HYD: నయా మోసం.. నమ్మితే నట్టేట మునిగినట్టే!

image

HYDలో కేటుగాళ్లు నయా మోసాలకు పాల్పడుతున్నారు. టెన్త్ చదివితే చాలు FAKE ఐడీ, ఆధార్ కార్డులు, జాబ్ ఆఫర్ లెటర్లు, ఫేక్ డిగ్రీ, B.Tech మెమోలు, క్వాలిఫికేషన్ సర్టిఫికెట్లు తయారుచేసి అవే ఒరిజినల్ అని నమ్మిస్తున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో జాబ్ వచ్చేలా చేస్తామని రూ.లక్షలు కాజేస్తున్నారు. ప్రతి విషయంపై అప్రమత్తంగా ఉండాలని, ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోవాలని రాచకొండ CP సుధీర్ బాబు సూచించారు.