Telangana

News April 4, 2024

HYD: డ్రంక్‌ అండ్ డ్రైవ్, వితౌట్‌ హెల్‌మెట్.. నోజాబ్!

image

చిన్న చిన్న కేసులు ఉన్నాయని తమను పోలీసు ఉద్యోగాలకు దూరం చేయొద్దంటూ పలువురు కానిస్టేబుల్‌ అభ్యర్థులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. 2022 కానిస్టేబుల్‌ రిక్రూట్‌మెంట్‌కు చెందిన పలువురు అభ్యర్థులు బుధవారం వనస్థలిపురం పనామా చౌరస్తా వద్ద నిరసన చేపట్టారు. 1500 మందిపై డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసులు, వితౌట్‌ హెల్‌మెట్, తదితర కేసులు ఉన్నాయని నియామకపత్రాలు ఇవ్వలేదని వాపోయారు.‌ న్యాయం చేయాలని వేడుకొన్నారు. 

News April 4, 2024

HYD: డ్రంక్‌ అండ్ డ్రైవ్, వితౌట్‌ హెల్‌మెట్.. నోజాబ్!

image

చిన్న చిన్న కేసులు ఉన్నాయని తమను పోలీసు ఉద్యోగాలకు దూరం చేయొద్దంటూ పలువురు కానిస్టేబుల్‌ అభ్యర్థులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. 2022 కానిస్టేబుల్‌ రిక్రూట్‌మెంట్‌కు చెందిన పలువురు అభ్యర్థులు బుధవారం వనస్థలిపురం పనామా చౌరస్తా వద్ద నిరసన చేపట్టారు. 1500 మందిపై డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసులు, వితౌట్‌ హెల్‌మెట్, తదితర కేసులు ఉన్నాయని నియామకపత్రాలు ఇవ్వలేదని వాపోయారు.‌ న్యాయం చేయాలని వేడుకొన్నారు. 

News April 4, 2024

KMR: చిన్నారిపై అత్యాచార యత్నం.. మూడేళ్ల జైలు శిక్ష

image

చిన్నారిని కిడ్నాప్ చేసి అత్యాచారం చేయబోయిన ఘటనలో ఓ వ్యక్తికి కామారెడ్డి జిల్లా అడిషనల్ డిస్టిక్ సెషన్స్ జడ్జి శ్రీనివాస్ నాయక్ మూడేళ్ల జైలు శిక్ష విధించారు. రామారెడ్డి మండలానికి చెందిన కనకయ్య(55) 2022వ సంవత్సరంలో ఓ చిన్నారిని కిడ్నాప్ చేసి అత్యాచారానికి యత్నించినట్లు సీఐ నరేశ్ కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై విచారణ చేపట్టిన కోర్టు బుధవారం నిందితుడికి జైలు శిక్ష విధించింది.

News April 4, 2024

ఖమ్మం: టీజీ డ్రైవింగ్ లైసెన్స్ కార్డులు వచ్చాయి

image

వాహనదారులకు అందించే ఆర్‌సీ, డ్రైవింగ్‌ లైసెన్స్‌ కార్డుల్లో టీజీగా మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం 20 రోజుల క్రితం నిర్ణయం తీసుకున్న విషయం విదితమే. కాగా, టీజీ పేరుతో ప్రింట్‌ చేసిన డ్రైవింగ్‌ లైసెన్స్‌ కార్డులు బుధవారం జిల్లా రవాణా శాఖ కేంద్రానికి చేరుకున్నాయి. అయితే 1,500 కార్డులు పంపిణీ చేయాల్సి ఉండగా 500 కార్డులు మాత్రమే వచ్చాయి. జిల్లాకు సరిపడా కార్డులు త్వరలోనే వస్తాయని అధికారులు చెబుతున్నారు.

News April 4, 2024

NLG: కాంగ్రెస్ కోఆర్డినేటర్ల నియామకం

image

అసెంబ్లీ నియోజకవర్గాలకు కాంగ్రెస్ కోఆర్డినేటర్లను నియమించింది. ఉమ్మడి జిల్లాలోని 12 నియోజకవర్గాలకు 12 మందిని నియమిస్తూ టిపిసిసి ఉత్తర్వులు జారీ చేసింది. DVK – కె. మంజులారెడ్డి, సాగర్ -మహేందర్ రెడ్డి. MLG – సల్ల నరేష్ కుమార్, HZNR- రేణుక, KDD- అల్లం ప్రభాకర్రెడ్డి, SRPT – కొల్లూరు పుష్పలీల, NLG – నిరంజన్ రెడ్డి, MNGD- వజ్ర సంధ్యారెడ్డి, BNG-శిరీష్ రెడ్డి, NKL-దుడం వెంకటరమణ నియమించింది.

News April 4, 2024

పోలీసుల కస్టడీలో కరీంనగర్ కార్పొరేటర్ భర్త

image

భూ వివాదంలో కరీంనగర్ 7వ డివిజన్ కార్పొరేటర్ భర్త ఆకుల ప్రకాశ్‌ను గత నెల 26న అరెస్ట్ చేసి రిమాండుకు తరలించిన విషయం తెలిసిందే. కోర్టు ద్వారా పోలీసులు 24 గంటల కస్టడీ తీసుకున్నామని కరీంనగర్ రూరల్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ ప్రదీప్ కుమార్ తెలిపారు. ప్రకాశ్ ఇంట్లో సోదాలు నిర్వహించిన పోలీసులు పలు కీలక డాక్యుమెంట్లను స్వాధీన పరుచుకున్నట్లు తెలిపారు.

News April 4, 2024

ఖమ్మం: పనిచేస్తూనే కుప్పకూలి మహిళ మృతి

image

ఇంటి వద్ద పనిచేసుకుంటున్న ఓ మహిళ ఒక్కసారిగా కుప్పకూలి అక్కడికక్కడే మృతి చెందిన ఘటన నేలకొండపల్లిలో బుధవారం జరిగింది. సుజాత(57) బుధవారం ఇంటి వద్ద పనిచేసుకుంటోంది . ఈ క్రమంలో ఒక్కసారిగా కుప్పకూలడంతో కుటుంబ సభ్యులు గమనించి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు.

News April 4, 2024

మరికొన్ని గంటల్లో పెళ్లి.. వరుడు మృతి

image

మరికొన్ని గంటల్లో పెళ్లి ఉందనగా వరుడు చనిపోయిన ఘటన రామన్నపేట మం. కక్కిరేణిలో జరిగింది. యాదయ్య, అంజమ్మ దంపతుల పెద్ద కుమారుడు నవీన్‌కు ఉత్తటూరుకు చెందిన బంధువుల అమ్మాయితో పెళ్లి కుదిరింది. ఈ ఉదయం పెళ్లి జరగాల్సి ఉంది. కాగా నవీన్ నిన్న వ్యవసాయ బావి వద్దకు వెళ్లాడు. పెళ్లి కొడుకును చేసే టైం అవుతున్నా.. నవీన్ లేకపోవడంతో వెతకగా పొలం వద్ద విగతజీవిగా ఉన్నాడు. నవీన్ మృతి పెళ్లింట తీవ్ర విషాదం నింపింది.

News April 4, 2024

సంగారెడ్డి ప్రమాదంలో మృతుల వివరాలు..

image

సంగారెడ్డి జిల్లాలో <<12982731>>ఘోర ప్రమాదం<<>> సంభవించిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య ఐదుగురికి పెరిగింది. 15 మందికి గాయాలవ్వగా మరో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది. మృతుల వివరాలు.. ఎండీ, డైరెక్టర్‌ రవికుమార్‌ (హైదరాబాద్‌), ప్రొడక్షన్ ఆఫీసర్‌ సుబ్రహ్మణ్యం (36), దయానంద్‌ (48), సురేష్‌పాల్‌ (43), కార్మికుడు విష్ణు (35)గా గుర్తించారు. ఈ పేలుడు ఘటనపై సీఎం రేవంత్‌ రెడ్డి సమీక్ష జరిపారు.

News April 4, 2024

వరంగల్: రైలు కిందపడి ఆత్మహత్య

image

అనారోగ్యంతో ఓ యువకుడు రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. జీఆర్పీ సీఐ కథనం ప్రకారం.. నెక్కొండ మండలం రెడ్డవాడకు చెందిన నవీన్(24) నాలుగు నెలలుగా గొంతునొప్పితో బాధపడుతూ.. MGMలో చికిత్స పొందుతున్నాడు. మెరుగైన వైద్యం కోసం HYDకి వెళ్లాలని వైద్యులు సూచించారు. భయాందోళనకు గురైన నవీన్ అదేరోజు రాత్రి జాన్‌పీరీలు గేట్ సమీపంలో పుష్‌పుల్ రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు.