Telangana

News April 4, 2024

శ్రీలంక అమ్మాయి.. కరీంనగర్ అబ్బాయి ఒక్కటయ్యారు

image

కరీంనగర్ జిల్లా రామడుగు మండలం పందికుంట పల్లెకు చెందిన కటకం సురేందర్,  శ్రీలంకకు చెందిన జానుశిఖ బుధవారం కరీంనగర్‌లో ప్రేమ వివాహం చేసుకున్నారు. సురేందర్ 2018లో ఇంగ్లండులోని లండన్ వెళ్లి ఉద్యోగం చేస్తున్నాడు. అక్కడ శ్రీలంకకు చెందిన సహ ఉద్యోగిని జానుశిఖతో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. దీంతో వారి ఇరు కుటుంబాలు ఒప్పుకోవడంతో బుధవారం KNRలో వివాహం జరిపించారు.

News April 4, 2024

మెదక్‌లో బీఆర్ఎస్‌కు బిగ్ షాక్!

image

మెదక్ మున్సిపాలిటీలో BRS పార్టీకి బిగ్‌షాక్ తగిలింది. ముగ్గురు కౌన్సిలర్లు మేడి కళ్యాణి మధుసూదన్ రావు, వసంత రాజ్, జయ శ్రీ దుర్గాప్రసాద్, పట్టణ బీఆర్ఎస్ అధ్యక్షుడు, కో ఆప్షన్ సభ్యులు మందుగుల గంగాధర్.. మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ మాజీ ఛైర్మన్ మధుసూదన్ రావు, మాజీ డైరెక్టర్ కొండా శ్రీనివాస్, నాయకులు బోయిని విక్రం, స్టీవెన్ ఉన్నారు.

News April 4, 2024

మహబూబ్‌నగర్: పది మూల్యాంకనం ప్రారంభం

image

టెన్త్ జవాబు పత్రాల స్పాట్ వాల్యుయేషన్ బుధవారం నుంచి జిల్లా కేంద్రంలోని గ్రామర్ ఉన్నత పాఠశాలలో ప్రారంభమైంది. ఈ ప్రక్రియ ఈ నెల 11 వరకు కొనసాగనుంది. కాగా డ్యూటీ ఆర్డర్లు తీసుకున్న వారిలో తొలిరోజు సమాచారం ఇవ్వకుండానే 160 మందికి పైగా విధులకు గైర్హాజరైనట్లు సమాచారం. దూర ప్రాంతాల నుంచి వచ్చే ఉపాధ్యాయులకు TA, DA ఇవ్వడం లేదని, పారితోషికం తక్కువేనని ఉపాధ్యాయులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

News April 4, 2024

HYDలో మహాలక్ష్మి ఎఫెక్ట్.. తగ్గిన బస్‌ పాస్‌లు!

image

గ్రేటర్‌ హైదరాబాద్‌లో మహాలక్ష్మి స్కీమ్‌తో బస్‌‌పాస్‌లపై ప్రభావం పడింది. 2014 తర్వాత 4.50 లక్షలు ఉన్న పాస్‌ల సంఖ్య కరోనా తర్వాత 3.9 లక్షలకు తగ్గింది. కాంగ్రెస్ ప్రభుత్వం 2023, డిసెంబర్‌ 9న FREE బస్‌ స్కీం అమల్లోకి తీసుకొచ్చింది. ఉద్యోగులు, విద్యార్థులకు కూడా ఉచితం కావడంతో పాస్‌ల సంఖ్య తగ్గుతూ వచ్చింది. ప్రస్తుతం నగరంలో 2,82,000 మంది బస్‌ పాస్‌లు వినియోగిస్తున్నట్లు TSRTC లెక్కలు చెబుతున్నాయి.

NZB: ఉపాధ్యాయులకు షాక్ ఇచ్చిన డీఈవో

image

నిజామాబాద్ జిల్లాలో పార్లమెంట్ ఎన్నికల కోసం నిర్వహించిన శిక్షణకు డుమ్మా కొట్టిన ప్రభుత్వ ఉపాధ్యాయులకు డీఈవో షాక్ ఇచ్చారు. ఈ నెల 1, 2 తేదీల్లో జిల్లాలోని 5 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉపాధ్యాయులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ శిక్షణకు జిల్లాలోని 84 మంది ఉపాధ్యాయులు డుమ్మా కొట్టారు. వారికి నోటీసులు జారీ చేసి సంజాయిషీ చెప్పాలన్నారు.

News April 4, 2024

నల్గొండ జిల్లాలో కరవు రాజకీయం

image

ఉమ్మడి నల్గొండ జిల్లాలో లోక్ సభ ఎన్నికల ప్రచారం కరవు చుట్టూ తిరుగుతోంది. సాగర్ కాల్వతో పాటు బోరు బావుల కింద పంటలు ఎండిపోవడానికి కారణం గత ప్రభుత్వమే అని మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి, ఎమ్మెల్యే వేముల వీరేశం విమర్శించారు. తమ హయాంలో నీళ్లు ఇచ్చామని చెబుతూ మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించారు. మరి మీరేమంటారు.

News April 4, 2024

సంగారెడ్డి: ‘వడదెబ్బకు దూరంగా ఉందాం’

image

వేసవిలో వేడి గాలులు వచ్చే అవకాశం ఉందన్న వడదెబ్బకు దూరంగా ఉండాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు. వడదెబ్బకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కరపత్రాలను బుధవారం సంగారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో ఆవిష్కరించారు. ఆమె మాట్లాడుతూ ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు బయటకు సాధ్యమైనంత వరకు రావద్దని చెప్పారు. జిల్లా వైద్యాధికారి డాక్టర్ గాయత్రీ దేవి, ప్రోగ్రాం అధికారి డాక్టర్ శశాంక్ దేశ్పాండే పాల్గొన్నారు.

News April 4, 2024

HYD: రైలులో ప్రయాణిస్తున్నారా..? మీ కోసమే!

image

HYD నుంచి ఇతర ప్రాంతాలకు, దేశంలోని వివిధ రైళ్లలో ప్రయాణించే వారికి సికింద్రాబాద్ సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు పలు సూచనలు చేశారు. ఏదైనా ప్రయాణానికి సంబంధించి తికమకపడినా, ఆందోళనకు గురైనా, రూటు తెలియకపోయినా, దొంగలను గుర్తించినా, ఎవరైనా వేధించినా, ఇతర ఏదైనా సమాచారం కోసం 139కు కాల్ చేయవచ్చని అధికారులు తెలియజేశారు. ప్రతి ఒక్కరూ ఈ సేవలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. SHARE IT