Telangana

News April 4, 2024

HYD: రూ.1.26 కోట్లతో సబ్ స్టేషన్ అప్‌గ్రేడేషన్

image

HYDలో 43 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్న వేళ విద్యుత్ వినియోగం భారీగా పెరుగుతోంది. దీనికి తగ్గట్లుగా TSSPDCL అధికారులు తగు చర్యలు తీసుకుంటున్నారు. బుధవారం మేడిపల్లి నారపల్లి 5MVA కెపాసిటీ గల సబ్ స్టేషనును రూ.1.26 కోట్లతో 8MVA కెపాసిటీ కలిగిన సబ్ స్టేషన్‌గా అప్ గ్రేడ్ చేసినట్లుగా వెల్లడించారు. రాబోయే రోజుల్లో విద్యుత్ డిమాండును దృష్టిలో ఉంచుకొని అనేక చోట్ల ఇలాంటి చర్యలు చేపడతామన్నారు.

News April 4, 2024

HYD: రూ.1.26 కోట్లతో సబ్ స్టేషన్ అప్‌గ్రేడేషన్

image

HYDలో 43 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్న వేళ విద్యుత్ వినియోగం భారీగా పెరుగుతోంది. దీనికి తగ్గట్లుగా TSSPDCL అధికారులు తగు చర్యలు తీసుకుంటున్నారు. బుధవారం మేడిపల్లి నారపల్లి 5MVA కెపాసిటీ గల సబ్ స్టేషనును రూ.1.26 కోట్లతో 8MVA కెపాసిటీ కలిగిన సబ్ స్టేషన్‌గా అప్ గ్రేడ్ చేసినట్లుగా వెల్లడించారు. రాబోయే రోజుల్లో విద్యుత్ డిమాండును దృష్టిలో ఉంచుకొని అనేక చోట్ల ఇలాంటి చర్యలు చేపడతామన్నారు.

News April 4, 2024

కలెక్టర్ ప్రియాంక అలా సమీక్ష

image

వేసవి సెలవులు ముగిసేలోగా జిల్లాలోని 697 పాఠశాలల్లో మరమ్మతు పనులు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అలా అధికారులను ఆదేశించారు. కొత్తగా ఏర్పడిన అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీల ఏర్పాటు, పనులు చేయించే విధానంపై బుధవారం ఐడీవోసీ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో వీడియోకాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా నిర్వహించారు. అధిక ఉష్ణోగ్రతల దృష్ట్యా రానున్న రెండు నెలలు సెలవులపై వెళ్లరాదని ఆదేశించారు.

News April 4, 2024

సైబర్ నేరాలపై ఫిర్యాదు అందిన వెంటనే స్పందించాలి: ఎస్పి చందనా దీప్తి

image

సైబర్ నేరాలకు గురైన బాధితుల నుంచి పిర్యాదు అందిన వెంటనే పోలీస్ స్టేషన్ల వారిగా నియమించిన సైబర్ వారియర్స్ తక్షణమే స్పందించి తగు చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ చందన దీప్తి పోలీస్ సైబర్ వారియర్స్ అధికారులను ఆదేశించారు. బుధవారం జిల్లా పోలీస్ కార్యాలయంలోని సమావేశ హాల్ నందు జిల్లా ఎస్పీ పోలీస్ స్టేషన్ల వారిగా నియమించిన సైబర్ వారియర్స్ కి మొబైల్ ఫోన్స్, సిమ్ కార్డ్స్ అందజేసి అనంతరం మాట్లాడారు.

News April 4, 2024

నీటి సరఫరాలో సందేహాల నివృత్తికి ప్రత్యేక ఫోన్ నంబర్: బల్దియా కమిషనర్

image

నీటి సరఫరా జరిగే క్రమంలో ఏర్పడే సందేహాల నివృత్తికి ప్రత్యేక ఫోన్ నంబర్ 7207908583ను ఏర్పాటు చేసినట్లు వరంగల్ బల్దియా కమిషనర్ అశ్విని తానాజీ వాకాడే తెలిపారు. 66 డివిజన్ల వ్యాప్తంగా ఉ.6 గం.ల నుంచి రా. 8 గం.ల వరకు నీటి సరఫరా జరిగే సమయాల్లో ఇబ్బందులు ఏర్పడితే సూచించిన నంబరుకు సమాచారం అందించాలన్నారు. అధికారులు వెంటనే స్పందించి సమస్యను పరిష్కరిస్తారన్నారు.

News April 4, 2024

‘బీజేపీకీ లక్ష ఓట్లు పైచిలుకు రావడం కాయం’

image

షాద్ నగర్ నియోజకవర్గంలో బీజేపీకీ లక్ష ఓట్లు పైచిలుకు రావడం కాయమని పార్లమెంట్ అభ్యర్థి డీకే అరుణ అన్నారు. బుధవారం షాద్ నగర్ మున్సిపాలిటీ, ఫరూక్ నగర్ మండల బూత్ విస్తృత స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. మోడీ పాలన అంటే షాద్ నగర్ ప్రజలకు ఎంతో నమ్మకం ఉందన్నారు. మహబూబ్ నగర్ ప్రజల హక్కుల కోసం పోరాడుతున్న వారిలో నేను ముందు వరుసలో ఉంటానని తెలిపారు. నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

News April 4, 2024

పోలింగ్ కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం: కలెక్టర్

image

అసెంబ్లీ ఎన్నికల్లో నిర్వహించిన విధుల అనుభవంతో లోక్ సభ ఎన్నికలను జిల్లాలో పకడ్బందీగా, ప్రశాంతంగా నిర్వహించేలా, అత్యధిక శాతం ఓటింగ్ నమోదయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్ తెలిపారు. ఎండలను దృష్టిలో ఉంచుకుని పోలింగ్ కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. పోలింగ్ రోజున కూల్ వాటర్, ప్రతి పోలింగ్ గదిలో నాలుగు ఫ్యాన్లు, బయట షామియానాలు ఏర్పాటు చేస్తున్నామని వివరించారు.

News April 4, 2024

NZB: రోడ్డు ప్రమాదాల్లో అత్యధికం యువతే: సీపీ

image

యువత మద్యం తాగి వాహనాలు నడపరాదని, గత సంవత్సరం జరిగిన రోడ్డు ప్రమాదాలలో యువతే అత్యధికంగా ఉన్నారని నిజమాబాద్ పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ బుధవారం పేర్కొన్నారు. కాగా 2023లో మొత్తం 767 రోడ్డు ప్రమాద కేసులు నమోదు కాగా అందులో 337మంది మరణించారు. మార్చ్(2024)నెలలో 649 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు కాగా అందులో 267మందికి జైలుశిక్ష పడింది. మద్యం సేవించి వాహనాలు నడపరాదని సీపీ సూచించారు.

News April 4, 2024

ADB: పాఠశాల మౌలిక సదుపాయాల అంచనాలు పూర్తి చేయాలి: కలెక్టర్

image

అమ్మ ఆదర్శ- పాఠశాల కమిటీ ద్వారా ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాల అంచనాలను త్వరగా పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ రాజర్షిషా అన్నారు. బుధవారం అధికారులతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో కలెక్టర్ మాట్లాడుతూ.. త్రాగునీటి సమస్య తలెత్తకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలన్నారు. ఈనెల 4, 5 తేదీల్లో పాఠశాలల్లోని 5రకాల పనులకు సంబంధించి వాటిపనుల అంచనాలను సంబంధిత అధికారుల సమన్వయంతో పూర్తిచేయాలన్నారు.

News April 3, 2024

RR: ఉమ్మడి జిల్లాలో నేటి..TOP న్యూస్

image

✓SOT డీసీపీ రాధా కిషన్ రావుపై కేసు నమోదు:CI కృష్ణమోహన్
✓ఓయూలో Ph.D యువతిపై లైంగిక వేధింపులు..
✓సికింద్రాబాద్లో కిలాడీ లేడీ హల్చల్
✓HYD మెట్రో హాలిడే కార్డ్, పిక్ హవర్ కార్డులు రద్దు
✓మాదాపూర్: అద్దె కార్లు అమ్ముతున్న ముఠా అరెస్ట్
✓HYD: ఎర్లీ బర్డ్ ఆఫర్ ఆస్తిపన్నులో 5 శాతం రాయితీ
✓నగరంలో రెండు చోట్ల బేగంపేట, రావిర్యాల మర్డర్లు
✓VKB: స్ట్రాంగ్ రూమ్ పరిశీలించిన కలెక్టర్