Telangana

News April 3, 2024

HYD: అద్దె కార్లు అమ్ముతున్న ముఠా అరెస్ట్

image

లాంగ్ డ్రైవ్‌లో అద్దెకు కార్లు తీసుకొని వాటిని అమ్ముతున్న ముఠాను HYD మాదాపూర్ పోలీసులు ఈరోజు అరెస్ట్ చేశారు. మాదాపూర్ ఏసీపీ మాట్లాడుతూ.. ఆదిలాబాద్‌లో ఉంటున్న హరీశ్ కుందారపు అనే వ్యక్తికి, సదరు వ్యక్తులు కార్లు ఇవ్వడంతో వీరికి కొంత కమిషన్ రూపంలో హరీశ్ అనే వ్యక్తి ఇస్తున్నట్లు తెలిపారు. వీరి వద్ద నుంచి రూ.కోటి విలువ చేసే 6 కార్లును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

News April 3, 2024

మెదక్‌లో కాంగ్రెస్ గెలుపుపై సీఎం రేవంత్ ఫోకస్

image

మెదక్ ఎంపీ స్థానంలో కాంగ్రెస్ గెలుపే ధ్యేయంగా ముఖ్య నాయకులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమాయ్యారు. ఎన్నికల్లో గెలుపుపై దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో మంత్రి దామోదర్, మెదక్ ఎంపీ అభ్యర్థి నీలం మధు, మెదక్ ఎమ్మెల్యే డా.మైనంపల్లి రోహిత్ రావు, పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్, నాయకులు రాజిరెడ్డి, సుహాసిని రెడ్డి, హన్మంత్ రావు, నర్సారెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, నిర్మల పాల్గొన్నారు.

News April 3, 2024

నల్గొండ: ఉరి వేసుకుని యువకుడి మృతి

image

కట్టంగూరు మండలం కురుమూర్తి గ్రామానికి చెందిన గుండెగోని హరిబాబు(27) తాగుడుకు బానిస అయ్యాడు. తల్లి లక్ష్మమ్మ హరిబాబును మందలించడంతో మనస్థాపం చెంది మంగళవారం ఇంటి నుంచి వెళ్లాడు. చెరువు అన్నారం గ్రామ శివారులో ఒక స్మారక స్థూపానికి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి తమ్ముడు శ్రీకాంత్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ అప్జల్ అలీ బుధవారం తెలిపారు.

News April 3, 2024

HYD: బంపర్ OFFER మీ కోసమే.. త్వరపడండి!

image

HYDతో పాటు RR, MDCL,VKB జిల్లాల్లోని కార్పొరేషన్లు, మున్సిపాలిటీల ప్రజలకు ప్రభుత్వం బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆస్తి పన్నును ఏప్రిల్ 30వ తేదీలోపు చెల్లిస్తే 5 శాతం రాయితీ పొందవచ్చని తెలియజేసింది. కావున ఆయా ప్రాంతాల్లో ఉంటున్న ప్రజలు ఈ ఆఫర్ సద్వినియోగం చేసుకోవాలని, ఈ లింక్ https://cdma.cgg.gov.in/cdma_arbs/CDMA_PG/PTMenu ద్వారా చెల్లించవచ్చని తెలిపింది. SHARE IT

ఖమ్మం: 230 గంజాయి కాల్చారు

image

ఖమ్మం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని వివిధ పోలీస్ స్టేషన్లలో పట్టుబడిన 230 కిలోల నిషేధిత ఎండు గంజాయిని మంచుకొండ అటవీ ప్రాంతంలో బుధవారం కాల్చేసినట్లు అడిషనల్ డీసీపీ నరేష్ కుమార్ తెలిపారు. ఖమ్మం 1 టౌన్, తల్లాడ, వైరా పోలీస్ స్టేషన్ల పరిధిలో నిర్వహించిన వివిధ తనిఖీల్లో ఈ నిషేధిత గంజాయి పట్టుబడిందని చెప్పారు. ఈ అక్రమ గంజాయి రవాణా కేసులో మొత్తం 13 మంది నేరస్థులను అరెస్టు చేశామని వారు చెప్పారు.

News April 3, 2024

సర్వే పూర్తి.. వినిపించనున్న రైలు కూత

image

కనగల్‌, చండూరు, నాంపల్లి మండల వాసులకు రైలు కూత వినిపించనుంది. ఇప్పటికే ఆయా మండలాల మీదుగా సర్వే పూర్తయింది. డోర్నకల్‌ నుంచి కూసుమంచి, పాలేరు, మోతె, సూర్యాపేట, భీమారం, తిప్పర్తి, నల్గొండ, కనగల్‌, చండూరు, నాంపల్లి మీదుగా.. గద్వాల వరకు రైల్వే లైను ఏర్పాటుకు ప్రాథమిక సర్వే పూర్తి అయింది. దీంతో ఖమ్మం, నల్గొండ జిల్లా వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

News April 3, 2024

HYD: 132 కిలోల బంగారం సీజ్.. 31 మంది అరెస్ట్!

image

HYD కస్టమ్స్ అధికారులు 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రిపోర్టు విడుదల చేశారు. ఆర్థిక సంవత్సరంలో 132 కిలోల బంగారాన్ని సీజ్ చేసినట్లుగా పేర్కొన్నారు. చెప్పుల లోపల, శరీర భాగాలలో, లో దుస్తులలో, డబ్బాలు, ప్యాకెట్లలో వివిధ రూపాల్లో బంగారాన్ని అక్రమంగా తరలించడానికి ప్రయత్నించినట్లు గుర్తించారు. 247 కేసులు బుక్ చేయగా.. 31 మందిని అరెస్టు చేసినట్లు తెలిపారు.

రేవంత్ రెడ్డిని కలిసిన జవాన్ యాదయ్య కుటుంబం

image

వంగూరు మండలం కొండారెడ్డిపల్లికి చెందిన జవాన్ యాదయ్య కుటుంబం సీఎం రేవంత్ రెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. యాదయ్య దుండగుల కాల్పులలో మృతిచెందగా ఆయన భార్యకు ఉద్యోగంతో పాటు కుటుంబానికి 5 ఎకరాల వ్యవసాయ భూమిని భూమిని రేవంత్ రెడ్డి కేటాయించారు ఈక్రమంలో నేడు యాదయ్య భార్య పిల్లలతో వెళ్లి సీఎంను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. తన స్వగ్రామం కొండారెడ్డిపల్లికి చెందిన జవాన్ కుటుంబానికి సీఎం అండగా నిలిచారు.