Telangana

News April 3, 2024

KU డిగ్రీ విద్యార్థులకు గమనిక

image

కాకతీయ విశ్వవిద్యాలయం పరిధిలోని డిగ్రీ 2, 4, 6వ సెమిస్టర్ పరీక్షల ఫీజు చెల్లింపు తేదీని పొడిగించినట్లు KU అధికారులు పేర్కొన్నారు. ఫీజు గడువును ఎలాంటి అపరాధ రుసుం లేకుండా ఏప్రిల్ 4 వరకు పొడిగించారు. రూ.50 అపరాధ రుసుంతో ఏప్రిల్ 16 వరకు చెల్లించవచ్చన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో డిగ్రీ చదువుతున్న విద్యార్థులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.

News April 3, 2024

రాష్ట్రంలో CAA ఎందుకు అమలు చేయరు: MP అర్వింద్

image

రాష్ట్రంలో CAA ఎందుకు అమలు చేయరో మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి చెప్పాలని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ ప్రశ్నించారు. బుధవారం ఆయన నిజామాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. మంత్రి ఉత్తమ్ వ్యాఖ్యలపై సీఎం రేవంత్ స్పందించాలన్నారు. పార్లమెంటులో ఆమోదం పొందిన చట్టం దేశం మొత్తం అమలు చేయాలి కానీ ఇలా ‘ మేము అమలు చేయం ’ అని అనడానికి ఉత్తమ్‌ ఎవరని నిలదీశారు. ఏ అధికారంతో ఈవ్యాఖ్యలు చేశారో చెప్పాలని MP ప్రశ్నించారు.

News April 3, 2024

ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రత్యేక అధికారిగా సురేంద్రమోహన్

image

ఖమ్మం, కొత్తగూడెం జిల్లాల్లోని కొన్ని గ్రామాల్లో తాగునీటి ఎద్దడి నెలకొంది. దానిని నివారించేందుకు ప్రభుత్వం ప్రత్యేక అధికారిని నియమించింది. స్పెషల్ ఆఫీసర్‌గా ఐఏఎస్ సురేంద్ర మోహన్‌ను నియమిస్తూ బుధవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

News April 3, 2024

MBNR: తాగునీటి పర్యవేక్షణకు ఐఏఎస్‌ నియామకం

image

జిల్లాలో తాగునీటి పర్యవేక్షణకు ఉమ్మడి జిల్లా ప్రత్యేక అధికారిగా ఇంటర్ బోర్డు సెక్రటరీ ఐఏఎస్ శృతి ఓజాను ప్రభుత్వం నియమించింది. పాలమూరు జిల్లాలో వేసవిని దృష్టిలో ఉంచుకొని తాగునీటి సమస్యలు తలెత్తకుండా ప్రభుత్వం ప్రత్యేక అధికారిని నియమించింది. వీరు జిల్లాలో జూలై నెల వరకు తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు, సమస్య ఏర్పడితే పరిష్కారంపై దృష్టి సారించనున్నారు.

News April 3, 2024

HYD: మూసీపై కబ్జాకోరుల కన్ను.. అధికారుల నిఘా..!

image

HYD, RR, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాల పరిధిలో మూసీ నది గర్భంలో 1,585, బఫర్‌ జోన్‌లో 6,890 అక్రమ నిర్మాణాలు ఉన్నట్లుగా రెండేళ్ల కిందట అధికారులు గుర్తించారు. ప్రస్తుతం ప్రత్యేక మాస్టర్ ప్లాన్ ద్వారా మూసీ అభివృద్ధికి ప్రభుత్వం స్వీకారం చుడతోంది. సుందరీకరణ జరగక ముందే.. కబ్జా కోరులు మూసీ పరివాహక ప్రాంతంలో అక్రమాలకు తేరలేపుతున్నారనే ఆరోపణల నేపథ్యంలో అధికారులు డేగ కన్నుతో నిఘా పెట్టారు.

News April 3, 2024

HYD: మూసీపై కబ్జాకోరుల కన్ను.. అధికారుల నిఘా..!

image

HYD, RR, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాల పరిధిలో మూసీ నది గర్భంలో 1,585, బఫర్‌ జోన్‌లో 6,890 అక్రమ నిర్మాణాలు ఉన్నట్లుగా రెండేళ్ల కిందట అధికారులు గుర్తించారు. ప్రస్తుతం ప్రత్యేక మాస్టర్ ప్లాన్ ద్వారా మూసీ అభివృద్ధికి ప్రభుత్వం స్వీకారం చుడతోంది. సుందరీకరణ జరగక ముందే.. కబ్జా కోరులు మూసీ పరివాహక ప్రాంతంలో అక్రమాలకు తేరలేపుతున్నారనే ఆరోపణల నేపథ్యంలో అధికారులు డేగ కన్నుతో నిఘా పెట్టారు.

News April 3, 2024

వరంగల్: తాగునీటి పర్యవేక్షణకు ఐఏఎస్‌ నియామకం

image

ఉమ్మడి వరంగల్ జిల్లాలో తాగునీటిని పర్యవేక్షించేందుకు ఐఏఎస్‌ను ప్రత్యేక అధికారిగా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. వరంగల్, హన్మకొండ, జనగామ, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్ జిల్లాల్లో తాగునీటిని పర్యవేక్షణకు బి.గోపిని ప్రత్యేక అధికారిగా నియమించారు.

News April 3, 2024

హరీశ్‌రావు ఇలాకాలో BRSకు షాక్ 

image

హరీశ్‌రావు ఇలాకా సిద్దిపేటలో BRSకు షాక్ తగిలింది. స్థానిక మున్సిపాలిటీకి చెందిన ముగ్గురు BRS పార్టీ కౌన్సిలర్లు సాకి బాలక్ష్మి ఆనంద్, ముత్యాల శ్రీదేవి బుచ్చిరెడ్డి, మహమ్మద్ రియాజ్ బుధవారం సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. BRS పార్టీకి కేంద్ర బిందువుగా ఉన్న సిద్దిపేటలో కౌన్సిలర్లు కాంగ్రెస్‌లో చేరడంపై స్థానికంగా చర్చనీయాంశమైంది. ఈ కార్యక్రమంలో నీలం మధు కూడా ఉన్నారు.   

News April 3, 2024

సిరిసిల్ల: యువతి ఆత్మహత్య

image

సిరిసిల్ల జిల్లాలో ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. స్థానికుల వివరాల ప్రకారం.. తంగళ్లపల్లి మండల కేంద్రానికి చెందిన ఎత్తరి శైలజ(19) ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News April 3, 2024

NGKL: గద్వాల అసెంబ్లీ సెగ్మెంట్లోనే అత్యధిక మహిళా ఓటర్లు

image

నాగర్ కర్నూల్ పార్లమెంటు పరిదిలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉండగా, మహిళా ఓటర్లు అత్యధికంగా గద్వాల సెగ్మెంట్లోనే ఉన్నారు. గద్వాలలో 1,30,499 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. 1,2,282 మంది మహిళా ఓటర్లతో వనపర్తి 2వ స్థానంలో ఉంది. అచ్చంపేట 1,24,382 ఓట్లతో 3వ స్థానంలో ఉండగా, అలంపూర్లో 1,21,074, కల్వకుర్తిలో 1,20,148, కొల్లాపూర్లో 1,17,942, నాగర్ కర్నూల్‌లో 1,19,366 మంది మహిళా ఓటర్లు ఉన్నారు.