Telangana

News April 3, 2024

కాంగ్రెస్ అసమర్ధతతో రాష్ట్రంలో కరువు: డీకే అరుణ

image

కాంగ్రెస్ అసమర్ధత పాలన వల్లే రాష్ట్రంలో కరువు వచ్చిందని డీకే అరుణ అన్నారు. బుధవారం షాద్ నగర్‌లో మీడియాతో మాట్లాడారు. ఆర్భాటాలకు పోయి ఆరు గ్యారంటీలు అని చెప్పి అధికారంలోకి వచ్చిందన్నారు. ఒకప్పుడు సస్యశ్యామలంగా ఉన్న తెలంగాణ.. ఇప్పుడు కరువు కోరల్లోకి నెట్టివేయబడుతోందని అన్నారు. కాంగ్రెస్ మాయ మాటలను ప్రజలు గుర్తించాలన్నారు. ఓటుతో బుద్ది చెప్పాలి, లేకపోతే మరోసారి మోసపోతారని అన్నారు.

News April 3, 2024

ఈనెల 6న పీయూలో జాతీయ సదస్సు

image

పాలమూరు విశ్వవిద్యాలయంలో ఈనెల 6న ‘ఎమర్జింగ్ ఇండియన్ ఎకానమీ గ్రోత్ అండ్ ప్రాస్పెక్ట్స్’ అనే అంశంపై జాతీయ సదస్సు నిర్వహిస్తున్నట్లు సదస్సు కన్వీనర్ డా.జి. జిమ్మికార్టన్, కో కన్వీనర్ డా. బి. వెంకట్ రాఘవేందర్ తెలిపారు. పీయూ ఎకనామిక్స్ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించే సదస్సుకు ప్రధాన వక్తగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎకనామిక్స్ డైరెక్టర్ ప్రొ. టీఎల్ఎన్. స్వామి హాజరవుతున్నారని తెలిపారు.

News April 3, 2024

తాటిచెట్టు పైనుంచి పడి గీత కార్మికుడి మృతి 

image

తాటిచెట్టు పైనుంచి పడి గీత కార్మికుడు మృతి చెందాడు. చివ్వెంల మండలం కుడకుడ శివారులో ఈ ప్రమాదం జరిగింది. మోకు జారి కింద పడడంతో గీత కార్మికుడి బిక్షంకు గాయాలయ్యాయి. చికిత్స కోసం హైదారాబాద్ తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. మృతుడి కుమారుని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్ల ఎస్ఐ వెంకటరెడ్డి తెలిపారు. 

News April 3, 2024

వెల్దుర్తి: తోటలో పనికి వచ్చిన వ్యక్తి సూసైడ్

image

వెల్దుర్తి పోలీస్ స్టేషన్ పరిధి శెట్టిపల్లి కలాన్ శివారులో కొబ్బరి తోటలో పనిచేసేందుకు వచ్చిన వెంకటరమణ ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఏపీలోని వడ్లమూరుకు చెందిన వెంకటరమణ, భాగ్యలక్ష్మి దంపతులు 3 నెలల క్రితం తోటలో పని చేసేందుకు వచ్చారు. రాత్రి మద్యం సేవించి రాగా భార్య గొడవ చేయడంతో బయటకు వెళ్లి విషం తాగాడు. ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. ఘటనపై కేసు నమోదు చేశారు.

News April 3, 2024

MBNR: నేతల మధ్య మాటల యుద్ధం.. వేడెక్కిన రాజకీయాలు

image

లోక్ సభ ఎన్నికల్లో విజయం సాధించాలనే వ్యూహంతో ప్రధాన పార్టీల నేతలు మాటల యుద్ధానికి తెరతీశారు. ఒకరిపై మరొకరు చేసే విమర్శలు, ప్రతి విమర్శలతో పాలమూరులో ఉన్న 2 లోక్‌సభ నియోజకవర్గాలు రాజకీయంగా వేడెక్కుతున్నాయి. ఎలాగైనా విజయం సాధించాలనే వ్యూహ రచనతో ఉన్న అభ్యర్థులు మాటల యుద్ధం చేస్తూ రాజకీయ వర్గాల్లో సెగలు పుట్టిస్తున్నారు. ఈ ప్రభావం ఎన్నికలపై చూపే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.

News April 3, 2024

కొమురవెల్లిలో 7న అగ్నిగుండాల కార్యక్రమం

image

కొమురవెల్లి శ్రీమల్లికార్జున స్వామి బ్రహోత్సవాల్లో భాగంగా ఈ నెల 7న అగ్నిగుండాల కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో బాలాజీ శర్మ, ఆలయ ఛైర్మన్ లక్ష్మారెడ్డి బుధవారం ప్రకటనలో తెలిపారు. 7న రాత్రి 12 గంటలకు అగ్నిప్రజ్వలన , 8న ఉదయం 6 గంటలకు అగ్నిగుండ ప్రవేశం ఉంటుందని పేర్కొన్నారు. కావున భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు.

News April 3, 2024

UPDATE.. KNR: కొడుక్కి విషమిచ్చి తల్లి ఆత్మహత్య

image

వరకట్న వేధింపులతో కొడుక్కి విషమిచ్చి <<12973114>>తల్లి ఆత్మహత్య<<>> చేసుకున్న విషయం తెలిసిందే. పోలీసుల ప్రకారం.. ఈ ఘటనలో తల్లి శ్రీజ(27), కొడుకు రేయాన్ష్(11నెలలు) మృతిచెందగా.. కూతురి మృతి తట్టుకోలేక శ్రీజ తల్లి జయప్రద విషగుళికలు తిని మరణించింది. WGLకు చెందిన నరేశ్‌తో 2021లో శ్రీజ పెళ్లయింది. గొడవలతో తల్లి ఇంటికి వెళ్లిన శ్రీజ.. కొడుకు ఫస్ట్ బర్త్ డేకు పిలవగా రానని దూషించాడు. మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకుంది.

News April 3, 2024

హైదరాబాద్‌లో మరో మర్డర్

image

HYDలో మరో దారుణ ఘటన జరిగింది. బహదూర్‌పుర PS పరిధి నందిముస్లాయిగూడలో మహమ్మద్​ రషీద్​ హత్యకు గురయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. షకీల్​ అహ్మద్​ సోదరిని రషీద్ వివాహం చేసుకున్నాడు. భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరిగేవి. బుధవారం మరోసారి వివాదం తలెత్తింది. ఈ విషయం తెలుసుకొన్న షకీల్ హుటాహుటిన సోదరి ఇంటికి వచ్చాడు. మాటామాటాపెరగడంతో రషీద్‌‌‌ను కత్తితో పొడిచి చంపేశాడు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

News April 3, 2024

ఫోన్ ట్యాపింగ్ కేసులో మహబూబ్ నగర్ ఎమ్మెల్యే

image

ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి బీఆర్ఎస్ మాజీ మంత్రి లీగల్ యాక్షన్‌లోకి దిగారు. తనపై తప్పుడు ఆరోపణలు చేశారంటూ మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి‌పై కేటీఆర్ పరువు నష్టం దావా వేశారు. మరి మాజీ మంత్రి కేటీఆర్ పరువు నష్టం దావా వేయడంతో మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి ఎలా స్పందిస్తారో చూడాలి.

News April 3, 2024

హైదరాబాద్‌లో మరో మర్డర్

image

HYDలో మరో దారుణ ఘటన జరిగింది. బహదూర్‌పుర PS పరిధి నందిముస్లాయిగూడలో మహమ్మద్​ రషీద్​ హత్యకు గురయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. షకీల్​ అహ్మద్​ సోదరిని రషీద్ వివాహం చేసుకున్నాడు. భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరిగేవి. బుధవారం మరోసారి వివాదం తలెత్తింది. ఈ విషయం తెలుసుకొన్న షకీల్ హుటాహుటిన సోదరి ఇంటికి వచ్చాడు. మాటామాటాపెరగడంతో రషీద్‌‌‌ను కత్తితో పొడిచి చంపేశాడు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.