Telangana

News July 30, 2024

MBNR: నేడే రెండో విడత పంట రుణమాఫీ

image

పంట రుణమాఫీలో భాగంగా రెండో విడత మాఫీ ఈనెల 30న CM రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారని, రూ.1.50లక్షలలోగా రుణం ఉంటే మాఫీ అవుతుందని ఉమ్మడి జిల్లాలోని ఆయా జిల్లాల కలెక్టర్లు తెలిపారు. వీసీ యూనిట్ ఉన్న రైతు వేదికల్లో రెండో విడత రుణమాఫీ కార్యక్రమం ఏర్పాట్లు చేశారు. HYDలో నిర్వహించే ఈ కార్యక్రమానికి రాష్ట్రంలోని మంత్రులు, MPలు, MLCలు, MLAలు తదితరులు హాజరవుతారని, మ.12గం.కు ఈ కార్యక్రమం ప్రారంభమవుతుందన్నారు.

News July 30, 2024

సంగారెడ్డి: దిగివచ్చిన టమాట ధర.. సామాన్యులకు ఊరట

image

సంగారెడ్డి: టమాట ధర ఎట్టకేలకు దిగి రావడంతో సామాన్యులకు కాస్త ఊరట లభించింది. సంగారెడ్డి, మెదక్, నారాయణఖేడ్, జహీరాబాద్, జోగిపేట, తదితర మార్కెట్లో కిలో టమాటా ధర రూ. 50 నుంచి రూ. 40 పలుకుతుంది. కిలో పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, బెండకాయ, ఆకు కూరగాయల ధరలు అలాగే ఉన్నాయి. ధరల పెరుగుదలను అరికట్టాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

News July 30, 2024

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన డోర్నకల్ ఎమ్మెల్యే

image

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని అసెంబ్లీలో డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్రనాయక్ మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం డోర్నకల్ నియోజకవర్గంలో చేపడుతున్న అభివృద్ధి పనుల వివరాలను సీఎం రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యే వివరించి నియోజకవర్గ అభివృద్ధికి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు పర్ణికరెడ్డి, యశస్వినిరెడ్డి పాల్గొన్నారు.

News July 30, 2024

వికారాబాద్-పరిగి-కృష్ణా రైల్వే లైన్ పనులపై సీఎం సమీక్ష

image

అసెంబ్లీలోని సీఎం ఛాంబర్‌లో సీఎం రేవంత్ రెడ్డి వికారాబాద్-పరిగి-కృష్ణా రైల్వే లైన్ పనులపై రైల్వే అధికారులతో సమావేశం నిర్వహించారు. రైల్వే లైన్ అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాలని ఎంతో కాలంగా నిర్లక్ష్యానికి గురైన ఈ మార్గాన్ని పూర్తి చేయాల్సిన అవసరముందని సీఎం సూచించారు. ఈ కార్యక్రమంలో పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి, నారాయణపేట ఎమ్మెల్యే వర్ణిక రెడ్డి, సంబంధిత శాఖ అధికారులు పాల్గొన్నారు.

News July 30, 2024

వికారాబాద్-పరిగి-కృష్ణా రైల్వే లైన్ పనులపై సీఎం సమీక్ష

image

అసెంబ్లీలోని సీఎం ఛాంబర్‌లో సీఎం రేవంత్ రెడ్డి వికారాబాద్-పరిగి-కృష్ణా రైల్వే లైన్ పనులపై రైల్వే అధికారులతో సమావేశం నిర్వహించారు. రైల్వే లైన్ అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాలని ఎంతో కాలంగా నిర్లక్ష్యానికి గురైన ఈ మార్గాన్ని పూర్తి చేయాల్సిన అవసరముందని సీఎం సూచించారు. ఈ కార్యక్రమంలో పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి, నారాయణపేట ఎమ్మెల్యే వర్ణిక రెడ్డి, సంబంధిత శాఖ అధికారులు పాల్గొన్నారు.

News July 30, 2024

ముఖేశ్ గౌడ్ సేవలు మరువలేనివి: MLA

image

బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి నిరుపేదల పాలిట కల్పతరువు అని MLA ప్రకాష్ గౌడ్ అన్నారు. ఈరోజు ప్రజా నాయకులు మాజీ మంత్రి కీ.శే ముఖేశ్ గౌడ్ 5వ వర్ధంతి సందర్భంగా నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో నిర్వహించిన కార్యక్రమానికి MLA ప్రకాష్ గౌడ్ హాజరై ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా ముఖేశ్ గౌడ్ చేసిన సేవలు మరువలేనివి అని కొనియాడారు.

News July 30, 2024

ఆదిలాబాద్: నేడు రైతు ఖాతాల్లో రుణమాఫీ డబ్బులు

image

ఆదిలాబాద్ జిల్లాలో 2వ విడత రుణమాఫీకి సంబంధించి డబ్బులు ఈనెల 30న రైతుల ఖాతాల్లో జమ చేయడం జరుగుతోందని ఆదిలాబాద్ జిల్లా వ్యవసాయ అధికారి పుల్లయ్య తెలిపారు. జిల్లాలోని 17,647 రైతులకు గాను రూ.201.83 కోట్ల రుణమాఫీ నిధులను రైతుల ఖాతాల్లో జమ చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమం జిల్లా కలెక్టర్ సమావేశ మందిరంతో పాటు 17 మండలాల పరిధిలోని రైతు వేదికల్లో ప్రారంభించనునట్లు వెల్లడించారు.

News July 30, 2024

వెంకటాపురం: రామప్పను సందర్శించిన అడిషనల్ కలెక్టర్

image

రామప్ప దేవాలయాన్ని పెద్దపల్లి అడిషనల్
కలెక్టర్ జీవి శ్యాంప్రసాద్ లాల్ కుటుంబ సమేతంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం రామప్ప ఆలయంలోని శిల్పకళా సంపదలను గైడ్ ద్వారా తెలుసుకున్నారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ముందు తరాల వారికి ఈ చారిత్రాత్మక సంపదను అందివ్వడం మన బాధ్యత అని అన్నారు.

News July 30, 2024

NGKL: ఓపెన్ స్కూల్స్‌ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

image

తెలంగాణా సార్వత్రిక విద్యాపీఠం ఓపెన్ స్కూల్స్‌ (టాస్) ద్వారా ఓపెన్ 10వ తరగతి, ఓపెన్ ఇంటర్మీడియట్‌ ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఆగస్టు 8 నుంచి సెప్టెంబర్ 10 వరకు ఎలాంటి అపరాధ రుసుం లేకుండా దరఖాస్తు చేసుకోవాలని నాగర్ కర్నూల్ జిల్లా ఓపెన్ స్కూల్ కోఆర్డినేటర్ శివప్రసాద్ సోమవారం పేర్కొన్నారు. నోటిఫికేషన్ ప్రకారం 10వ తరగతిలో చేరే విద్యార్థులు 14 సంవత్సరాలు నిండిన వారై ఉండాలని సూచించారు.

News July 30, 2024

కామారెడ్డి: నేడు రైతుల ఖాతాల్లో రుణమాఫీ డబ్బులు

image

కామారెడ్డి జిల్లాలో రెండో విడత రుణమాఫీ 24,816 మంది రైతులకు వర్తించిందని జిల్లా వ్యవసాయ అధికారిని భాగ్యలక్ష్మి తెలిపారు. మంగళవారం రైతుల ఖాతాలో రూ.211.72 కోట్లు జమకానున్నాయని పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు మధ్యాహ్నం రెండో విడత రుణమాఫీ నిధులను విడుదల చేస్తారన్నారు.