Telangana

News July 30, 2024

KNR: స్థానిక ఎన్నికలు.. ఓటరు జాబితాకు కసరత్తు

image

KNR: గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఓటర్ల జాబితా తయారీకి ఎన్నికల సంఘం కసరత్తు మొదలు పెట్టింది. 2023 నవంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఓటర్ల జాబితా ఆధారంగా పంచాయతీల్లో వార్డుల వారీగా ఓటర్ల జాబితాను తయారు చేయనుంది. అందుకోసం ప్రతి జిల్లా నుంచి ఐదుగురు డేటా ఎంట్రీ ఆపరేటర్లను ఓటర్ల జాబితా తయారీ కోసం ఎంపిక చేసి ఓటర్ల జాబితా తయారీపై హైదరాబాద్‌లో వారికి ఒక రోజు శిక్షణ ఇవ్వనుంది.

News July 30, 2024

NLG: కృష్ణానది పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్

image

జిల్లాలోని కృష్ణా నది పరివాహక ప్రాంత ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ సి. నారాయణరెడ్డి ఒక ప్రకటనలో కోరారు. శ్రీశైలం ప్రాజెక్టుకు పై నుండి వరద ఉద్ధృతి కొనసాగుతుండడంతో పరివాహక ప్రాంతాల వారు అప్రమత్తమవ్వాలని అన్నారు. రిజర్వాయర్ పూర్తి సామర్థ్యానికి చేరువలో ఉన్న దృష్ట్యా శ్రీశైలం ప్రాజెక్టు ఇంజనీరింగ్ అధికారులు రేడియల్ క్రస్ట్ గేట్లను ఎత్తి నీటిని దిగువకు వదిలినట్లు కలెక్టర్ తెలిపారు.

News July 30, 2024

MDK: ‘విజుబుల్ పోలీసింగ్‌తోనే శాంతి భద్రతలపై నమ్మకం’

image

హవేలిఘనపూర్ మండల కేంద్రంలోని పోలీసు స్టేషన్‌ను జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి తనిఖీ చేశారు. ఈసందర్భంగా ఆయన పోలీసు స్టేషన్‌లోని రికార్డులను పరిశీలించారు. నేరాలను నియంత్రించడంతో పాటు, శాంతి భద్రతలపై ప్రజలకు నమ్మకం కలగాలంటే విజుబుల్ పోలీసింగ్‌తోనే సాధ్యపడుతుందన్నారు. పోలీసు సిబ్బంది తరచూ గ్రామాలను పర్యటిస్తూ ప్రజల్లో భద్రత భావాన్ని పెంపొందించాలన్నారు. సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

News July 29, 2024

ఉమ్మడి వరంగల్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

> MLG: కౌశిక్ రెడ్డిపై మంత్రి సీతక్క ఫైర్
> MHBD: పార్లమెంటులో ప్రసంగించిన ఎంపీ బలరాం నాయక్
> MLG: జల కళను సంతరించుకున్న లక్నవరం సరస్సు
> WGL: తండ్రిని పోలీసులు వేధించారని టవర్ ఎక్కిన కొడుకు
> MLG: చత్తీస్ ఘడ్-తెలంగాణా రాకపోకలు ప్రారంభం
> HNK: అనుమతి లేని జల పాతాళ వద్దకు వెళ్తే చర్యలు
> WGL: అసెంబ్లీలో ప్రసంగించిన పశ్చిమ, వర్ధన్నపేట, డోర్నకల్ ఎమ్మెల్యేలు

News July 29, 2024

ఉమ్మడి వరంగల్ జిల్లాలో క్రైమ్ న్యూస్

image

> JN: విద్యుత్ షాక్‌తో వ్యక్తి మృతి
> BHPL: గంజాయి అమ్ముతున్న ముగ్గురి అరెస్టు
> MLG: కారును వెనుక నుంచి ఢీ కొట్టిన మరో వాహనం
> HNK: గుర్తు తెలియని వ్యక్తుల చేతిలో ఇల్లు ధ్వంసం
> MHBD: అతి వేగంతో పొలాల్లోకి దూసుకెళ్లిన కారు
> WGL: బాలుడి మృతి.. కుటుంబీకుల ధర్నా
> WGL: కొడుకు మృతిని తట్టుకోలేక తల్లి సూసైడ్

News July 29, 2024

NZB: జిల్లాలో ఈరోజు TOP NEWS

image

* నిజామాబాద్: డయల్ 100 పై నిర్లక్ష్యం.. ఎస్ఐ అశోక్ పై వేటు
* పెద్దకొడప్గల్: 2018 నుంచి కాటేపల్లి తండాకు సర్పంచ్ లేరు
* పిట్లం: పాము కాటుకు గురై మహిళ రైతు మృతి
* నిజామాబాద్: 14.5 కిలోల వెండి ఆభరణాల చోరీ కేసులో నిందితుడి అరెస్ట్
* నిజాంసాగర్: మంత్రి తుమ్మలకు జుక్కల్ ఎమ్మెల్యే లేఖ
* బిచ్కుందలో రోడ్ల కోసం మోకాళ్లపై కూర్చొని నిరసన

News July 29, 2024

మందమర్రిలో పాముకాటుతో యువతి మృతి

image

మందమర్రి పట్టణంలోని మూడో జోన్‌కు చెందిన దురిశెట్టి సాధన పాముకాటుకు గురై మృతి చెందింది. సోమవారం సాయంత్రం ఇంట్లో అన్నం తింటుండగా పాము కాటు వేసినట్లు ఆమె కుటుంబీకులు తెలిపారు. వెంటనే మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వెల్లడించారు.

News July 29, 2024

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఎస్సైల బదిలీలు

image

ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని స్టేషన్లలో పనిచేస్తున్న ఎస్సైలను బదిలీ చేస్తూ సోమవారం డీజీపీ కార్యాలయం నుంచి ఉత్తర్వులు జారీ చేశారు. నార్కెట్ పల్లి ఎస్సైగా క్రాంతి కుమార్, చిట్యాల ఎస్సైగా ధర్మ, నాగారం ఎస్సైగా ఐలయ్య, నూతనకల్ ఎస్సైగా మహేంద్ర నాథ్, తిరుమలగిరి ఎస్సైగా సురేశ్, అర్వపల్లి ఎస్సైగా బాలకృష్ణ బదిలీ అయ్యారు.

News July 29, 2024

ఉమ్మడి జిల్లా నేటి టాప్ న్యూస్

image

✓ శ్రీశైలం ప్రాజెక్టు 3 గేట్లు ఎత్తి నీటి విడుదల.
✓ జూరాల 46 గేట్లు ఎత్తి నీటి విడుదల.
✓రేపు రెండో విడత రుణమాఫీ: నాగర్ కర్నూల్ కలెక్టర్.
✓ ఉమ్మడి జిల్లాలో ముగిసిన కౌడి పీర్ల ఉత్సవాలు.
✓ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సినారే జయంతి వేడుకలు.
✓ అచ్చంపేట: ఘనంగా అంతర్జాతీయ పులుల దినోత్సవం.
✓ రాజోలి: సుంకేసులకు పోటెత్తిన వరద.
✓ వికారాబాద్ కృష్ణా రైల్వే లైన్ రూట్ మ్యాప్ పై సీఎంతో రైల్వే శాఖ అధికారుల చర్చలు.

News July 29, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

@ పెద్దాపూర్ గురుకులం ఎదుట ఏబీవీపీ ధర్నా
@ ఓదెల మండల కేంద్రంలో నాగదేవత విగ్రహంపై నాగుపాము
@ కమాన్పూర్ మండలంలో కోడిపందాలు ఆడుతున్న ఏడుగురిపై కేసు
@ సిరిసిల్లలో భార్యను చంపి ఆత్మహత్య చేసుకున్న భర్త
@ ఎలిగేడు మండలంలో యువకుడి ఆత్మహత్య
@ ధర్మారం మండలంలో గుండెపోటుతో మహిళ మృతి
@ హుజూరాబాద్ మండలంలో తాటి చెట్టు పై నుంచి పడి గీత కార్మికుడికి గాయాలు