Telangana

News July 29, 2024

జపాన్‌లో జరిగే పోటీలకు ఎంపికైన బోథ్ విద్యార్థిని

image

రాష్ట్ర స్థాయి సకురా సైన్స్ ప్రొగ్రామ్ పోటీలకు బోథ్ ఆదర్శ పాఠశాల విద్యార్థిని రసజ్ఞ ఎంపికయ్యారు. గత సంవత్సరం పదోతరగతి ఫలితాల్లో ఉత్తమ మార్కులు సాధించిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు జిల్లా స్థాయిలో రాత పరీక్ష, ఇంటర్వ్యూలు, ఇంగ్లిష్‌లో ప్రావీణ్య పోటీలను నిర్వహించారు. రసజ్ఞ రాష్ట్ర స్థాయిలో తన ప్రతిభను చాటింది. రాష్ట్ర స్థాయిలో ఐదుగురు విద్యార్థులను ఎంపిక చేసి జపాన్ పర్యటనకు పంపనున్నారు.

News July 29, 2024

రేవంత్ పీసీసీ అయినా.. సీఎం అయినా అది కేసీఆర్ పుణ్య‌మే: హరీష్ రావు

image

రేవంత్ రెడ్డి పీసీసీ అధ్య‌క్షుడు అయినా, ఇప్పుడు సీఎం అయినా అది కేసీఆర్ పుణ్య‌మే అని మాజీ మంత్రి హ‌రీశ్‌రావు స్ప‌ష్టం చేశారు. అసెంబ్లీ ప్రాంగ‌ణంలో హ‌రీశ్‌రావు మీడియాతో చిట్ చాట్ చేశారు. తెలంగాణ ప్రకటన వెనక్కి పోతే మేము రాజీనామా చేశాం. రేవంత్ రెడ్డి కనీసం డూప్లికేట్ రాజీనామా కూడా చేయలేదు. రేవంత్ లాంటి వాళ్ళు రాజీనామా చేయలేదనే ఆనాడు బలిదానాలు జ‌రిగాయని అన్నారు.

News July 29, 2024

మెదక్: ఫైనాన్స్ రుణం ఇస్తామని.. డబ్బులు కాజేశారు

image

మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం చెట్లగౌరారం గ్రామానికి చెందిన రావెల్లి నరసింహులుకు ఓ ఫైనాన్స్ నుంచి రుణం ఇస్తామని ఫోన్ చేసి రూ. 42,500 కాజేశారు. మీ సిబిల్ స్కోర్ బాగుందని రుణమిస్తామని ఫోన్ చేశారు. వారి మాటలు నమ్మి ఇన్సూరెన్స్ కోసం, డాక్యుమెంట్లు, ఆర్బీఐ అనుమతి కోసం అంటూ పలు దఫాలుగా డబ్బులు పంపారు. రుణం చెల్లించకపోవడంతో మోసపోయినట్లు గ్రహించిన బాధితుడు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు.

News July 29, 2024

ఖమ్మం: ఢిల్లీ కోచింగ్ సెంటర్‌లో జరిగిన ఘటన బాధాకరం

image

ఢిల్లీ సివిల్స్ కోచింగ్ సెంటర్లో వరద నీటిలో పడి ముగ్గురు నిరుద్యోగులు మృతి చెందడం బాధాకరమని, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర సోమవారం రాజ్యసభలో ప్రస్తావించారు. కోచింగ్ సెంటర్ నిర్వాహకులకు ముందస్తు ఆలోచన లేకపోవడం వల్లే ఈ ఘటన జరిగిందని చెప్పారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కేంద్ర ప్రభుత్వాన్ని రాజ్యసభ సభ్యుడు కోరారు.

News July 29, 2024

నల్గొండ: జిల్లాలో స్థానిక ఎన్నికల జోష్

image

నల్గొండ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల సందడి మొదలైంది. CM రేవంత్ ప్రకటనతో ఆశావహుల్లో జోష్ పెరిగింది. సర్పంచుల పదవీకాలం పూర్తయి 6 నెలలు అవుతుండగా, MPTC, ZPTCల పదవీ కాలం ఈనెల 5న ముగిసిన విషయం తెలిసిందే. పంచాయతీ ఎన్నికలు త్వరలో నిర్ణయిస్తామని, ఆగస్టు మొదటి వారంలోగా ఓటర్ల జాబితా సిద్ధం చేయాలంటూCMరేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. తొలుత MPTC,ZPTCల ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.

News July 29, 2024

KNR: కాంగ్రెస్ లీగల్ సెల్ జిల్లా అధ్యక్షుడిగా లక్ష్మయ్య

image

కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడిగా మొగిలిపాలెం మాజీ సర్పంచ్, సీనియర్ న్యాయవాది కల్లేపల్లి లక్ష్మయ్య నియామకయ్యారు . ఈమేరకు TPCC లీగల్ సెల్ చైర్మన్ పొన్నం అశోక్ గౌడ్ ఉత్తర్వులు జారీచేశారు. వైస్ ఛైర్మన్లుగా వడ్లూరి కృష్ణ , ప్రదీప్ కుమార్ రాజు, కన్వీనర్లుగా శంకర్, శ్రీకాంత్, నవాజ్‌ను నియమించారు. తన నియామకానికి సహకరించిన మంత్రి పొన్నం, MLA కవ్వంపల్లికి కృతజ్ఞతలు చెప్పారు.

News July 29, 2024

NZB: నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఎస్ఐ పై వేటు

image

డయల్ 100 కాల్ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన నిజామాబాద్ ఐదో టౌన్ ఎస్ఐ అశోక్‌ను హెడ్ క్వార్టర్స్‌కు అటాచ్ చేస్తూ సీపీ కల్మేశ్వర్ ఉత్తర్వులు జారీ చేశారు. టౌన్ పరిధిలో జరిగిన ఓ ఘటనకు సంబంధించి 100 కాల్ రాగా నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు సీపీ గుర్తించారు. అనంతరం స్టేషన్ బాధ్యతల నుంచి ఆయన్ను తప్పించినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

News July 29, 2024

భద్రాచలం అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలి: ఎంపీ

image

భద్రాచలం రామాలయ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేయాలని ఎంపీ బలరాం నాయక్ పార్లమెంట్‌లో ప్రస్తావించారు. అనేక సంవత్సరాలు చరిత్ర కలిగిన శ్రీ సీతారామచంద్ర స్వామి వారి రామాలయం అభివృద్ధికి నోచుకోవడం లేదని చెప్పారు. అటు వరద ముంపు నుంచి భద్రాచలం కాపాడేందుకు తెలంగాణ నుంచి ఏపీలో విలీనమైన మండలాలను తిరిగి తెలంగాణలో కలపాలన్నారు.

News July 29, 2024

ఖమ్మం: ఇంటర్నేషనల్ కబడ్డీ పోటీలకు ఎంపికైన విద్యార్థి

image

ఖమ్మం నగరంలోని నయాబజార్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుతున్న బొడ్డుపల్లి గౌతమ్ ఇంటర్నేషనల్ కబడ్డీ పోటీలకు ఎంపికయ్యాడు. నేపాల్‌లో జరిగే అండర్-17 పోటీలకు వెళ్లేందుకు తన వద్ద అంత స్తోమత (నగదు) లేదని విద్యార్థి గౌతమ్ తెలిపారు. ఎవరైనా స్పందించి తాను నేపాల్‌లో జరిగే అండర్ 17 కబడ్డీ పోటీల్లో పాల్గొనేందుకు సహాయం చేయాలని కోరాడు.

News July 29, 2024

ముఖేష్ గౌడ్ వర్ధంతి వేడుకలకు హాజరైన కేటీఆర్

image

మాజీమంత్రి ముఖేష్ గౌడ్ 5వ వర్ధంతిని సోమవారం నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR, MLAలు తలసాని శ్రీనివాస్ యాదవ్, పద్మారావు గౌడ్, మాగంటి గోపినాధ్, కాలేరు వెంకటేష్‌లు పాల్గొని ముఖేష్ గౌడ్ చిత్రపటం వద్ద నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు నేతలు.