Telangana

News July 29, 2024

ముఖేష్ గౌడ్ వర్ధంతి వేడుకలకు హాజరైన కేటీఆర్

image

మాజీమంత్రి ముఖేష్ గౌడ్ 5వ వర్ధంతిని సోమవారం నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR, MLAలు తలసాని శ్రీనివాస్ యాదవ్, పద్మారావు గౌడ్, మాగంటి గోపినాధ్, కాలేరు వెంకటేష్‌లు పాల్గొని ముఖేష్ గౌడ్ చిత్రపటం వద్ద నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు నేతలు.

News July 29, 2024

కరీంనగర్: మొదలైన ఎన్నికల సందడి !

image

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో స్థానిక సంస్థల మొదలైంది. సీఎం రేవంత్ రెడ్డి ప్రకటనతో ఆశావహుల్లో జోష్ పెరిగింది. సర్పంచుల పదవీ కాలం పూర్తయి 6 నెలలు అవుతోంది. అంతేకాకుండా ఎంపీటీసీ, జడ్పీటీసీ పదవీ కాలం ఈనెల 4తో ముగిసిన విషయం తెలిసిందే. దీంతో ఉమ్మడి జిల్లాలోని 1,218 పంచాయతీలతో పాటు 64 మండలాల్లో ఎన్నికల టాపిక్ నడుస్తోంది.

News July 29, 2024

మెదక్: జ్వరంతో ఇంటర్ విద్యార్థి మృతి

image

డెంగ్యూతో ఇంటర్ విద్యార్థి మృతి చెందిన ఘటన చిన్నశంకరంపేట మండలంలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. సూరారం గ్రామానికి చెందిన కుమ్మరి నిఖిల్(17) హైదరాబాద్‌లో ఇంటర్ చదువుతున్నారు. 5రోజులుగా జ్వరంతో బాధపడుతుంటగా బంధువులు ప్రైవేట్ ఆస్పత్రిలో వైద్యం చేయించారు. ప్లేట్ లెట్స్ తగ్గిపోవడంతో తీవ్ర అస్వస్థకు గురై చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మృతిచెందాడు. దీంతో గ్రామంలో విషాదం నెలకొంది.

News July 29, 2024

HYD: రోడ్లపై వెళ్లేవారిని అడ్రస్ అడిగి.. చైన్‌స్నాచింగ్

image

గ్రేటర్ HYDలో చైన్ స్నాచర్లు విరుచుకుపడుతున్నారు. నిత్యం ఏదో ఒక చోట చైన్ స్నాచింగ్ ఘటనలు వెలుగుచూస్తూనే ఉన్నాయి. రోడ్లపై వెళ్లే వారిని టార్గెట్ చేస్తున్నారు. బైక్‌లపై తిరుగుతూ ఒంటరిగా వెళ్లేవారికి ఓ చీటీ చూపి అడ్రస్ అడుగుతున్నారు. వారు చెప్పేలోపే గోల్డ్ చైన్ కొట్టేసి పరారవుతున్నారు. తాజాగా పటాన్‌చెరు పరిధి అమీన్‌పూర్ వాసి అశ్విని గొలుసును దుండగులు ఇలాగే కొట్టేశారు. జర జాగ్రత్త! SHARE IT

News July 29, 2024

HYD: రోడ్లపై వెళ్లేవారిని అడ్రస్ అడిగి.. చైన్‌స్నాచింగ్

image

గ్రేటర్ HYDలో చైన్ స్నాచర్లు విరుచుకుపడుతున్నారు. నిత్యం ఏదో ఒక చోట చైన్ స్నాచింగ్ ఘటనలు వెలుగుచూస్తూనే ఉన్నాయి. రోడ్లపై వెళ్లే వారిని టార్గెట్ చేస్తున్నారు. బైక్‌లపై తిరుగుతూ ఒంటరిగా వెళ్లేవారికి ఓ చీటీ చూపి అడ్రస్ అడుగుతున్నారు. వారు చెప్పేలోపే గోల్డ్ చైన్ కొట్టేసి పరారవుతున్నారు. తాజాగా పటాన్‌చెరు పరిధి అమీన్‌పూర్ వాసి అశ్విని గొలుసును దుండగులు ఇలాగే కొట్టేశారు. జర జాగ్రత్త!
SHARE IT

News July 29, 2024

MDK: చోరీ చేసిన GOVT ఉద్యోగి 

image

ఆన్‌లైన్ బెట్టింగ్‌లకు అలవాటు పడిన ఓ ప్రభుత్వ ఉద్యోగి చోరీ చేసిన ఘటన మెదక్ జిల్లా రేగోడ్ మండలం మక్త వెంకటాపురంలో ఈరోజు వెలుగు చూసింది. సీఐ రేణుకారెడ్డి తెలిపిన వివరాలు.. మక్త వెంకటాపురానికి చెందిన రైతు సంగప్ప పంట పెట్టుబడి డబ్బును అప్పు చేసి ఇంట్లో పెట్టాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో అదే గ్రామానికి చెందిన ప్రభుత్వ ఉద్యోగి జ్ఞానేశ్వర్ ఆ డబ్బును చోరీ చేశాడు. పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు.  

News July 29, 2024

వ్యక్తిగత దూషణలు సరికాదు: కామారెడ్డి ఎమ్మెల్యే

image

శాసనసభలో వ్యక్తిగత దూషణలు చేయడం సరికాదని కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి అన్నారు. శాసనసభలో ఆయన మాట్లాడుతూ.. ప్రజా సమస్యలను పక్కనపెట్టి ఒకరిపై ఒకరు ఆరోపణ చేసుకోవడం ఎంతవరకు సమంజసం అన్నారు. గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను ఈ ప్రభుత్వం సరి చేయవలసిన అవసరం ఎంతైనా ఉందని ఆయన సూచించారు. గ్రామాలలో ప్రజలు ఎన్నో సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని ఆయన స్పీకర్ దృష్టికి తీసుకువచ్చారు.

News July 29, 2024

KMM: ఓటరు జాబితా తయారీపై కసరత్తు

image

గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఓటర్ల జాబితా తయారికి ఎన్నికల సంఘం కసరత్తు మొదలు పెట్టింది. 2023 నవంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఓటర్ల జాబితా ఆధారంగా పంచాయతీల్లో వార్డుల వారీగా ఓటర్ల జాబితాను తయారు చేయనుంది. అందుకోసం ప్రతి జిల్లా నుంచి ఐదుగురు డేటా ఎంట్రీ ఆపరేటర్లను ఓటర్ల జాబితా తయారీ కోసం ఎంపిక చేసి ఓటర్ల జాబితా తయారీపై హైదరాబాద్లో వారికి ఒక రోజు శిక్షణ ఇవ్వనుంది.

News July 29, 2024

కార్గో వివరాల కోసం కాల్ చేయండి: RM KMM

image

లాజిస్టిక్స్(కార్గో) సేవల ప్రజలకు మరింత అందుబాటులో ఉండేలా చూడాలని ఖమ్మం RM సరిరామ్ కార్గో అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇటీవల వస్తున్న ఫిర్యాదుల దృష్ట్యా రీజనల్ మేనేజర్ డిపో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ నెంబర్లను ఇవ్వడం జరిగింది. KMM-9154298583, మధిర &సత్తుపల్లి-9154298585, భద్రాచలం-9154298586, KTDM-9154298587, మణుగూరు- 9154298588. కావున కార్గో సంబంధిత వివరాల కోసం పైన నెంబర్లకు సంప్రదించగలరు.

News July 29, 2024

వ్యవసాయ పనుల్లో రైతన్నలు బిజీ.. బిజీ

image

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా రైతన్నలు వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు. గత వారం రోజులుగా కురిసిన వర్షాలకు నాట్లు వేయడంలో రైతన్నలు వ్యవసాయ పొలంలో బిజీ.. బిజీగా గడుపుతున్నారు. దుక్కులు సిద్ధం చేయడంతో పాటు కంది, జొన్న పంటలకు రైతులు కలుపుతీత, ఎరువులు వేస్తున్నారు. విత్తనాల కోసం రైతులు ఫర్టిలైజర్‌ దుకాణాలకు పరుగులు తీస్తున్నారు. విత్తనాలు కొనేటప్పుడు రసీదు తీసుకోవాలని వ్యవసాయ అధికారులు తెలిపారు.