Telangana

News July 29, 2024

రంగారెడ్డి: ఈ-ఆఫీస్‌ సేవలన్నీ ఇక ఆన్‌లైన్‌లోనే

image

RR కలెక్టరేట్‌లో త్వరలోనే ఈ-ఆఫీస్‌ కార్యకలాపాలు అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటివరకు కాగితాలపై కొనసాగుతున్న సేవలు.. ఇకపై ఆన్‌లైన్‌ ద్వారా సాగనున్నాయి. పాలనలో పారదర్శకత, కచ్చితత్వం, జవాబుదారీతనాన్ని పెంచేందుకు ప్రత్యేక చొరవ చూపుతున్న కలెక్టర్‌ శశాంక వీలైనంత త్వరగా ఈ-ఆఫీస్‌ సేవలను అందుబాటులోకి తేవాలని సంకల్పించారు. అంతేకాకుండా అధికారులు, సిబ్బందికి సాంకేతిక నైపుణ్యంపై ప్రస్తుతం శిక్షణ ఇస్తున్నారు.

News July 29, 2024

ఖమ్మం: పనిచేస్తూ పొలంలో ప్రాణాలు విడిచాడు

image

వరి పొలంలో నారు కట్టలు పంచేందుకు వెళ్లి ఓ వ్యక్తి మూర్చతో పొలంలోనే ప్రాణాలు కోల్పోయిన ఘటన తిరుమలాయపాలెం మండలంలో ఆదివారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. బచ్చోడుకి చెందిన సైదులు (42) ఆదివారం గ్రామంలోని ఓ రైతు వరి పొలంలో నారు కట్టలు పంచేందుకు వెళ్లాడు. సైదులుకు మూర్చ రావడంతో బురదలో పడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

News July 29, 2024

సాగర్ నీళ్లొస్తే ఫుల్ బిజీ

image

సాగర్‌కు వరద కొనసాగుతుండడంతో రైతుల్లో హర్షం వ్యక్తమవుతోంది. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో వ్యవసాయ పనులు మొదలయ్యాయని సాగర్ నిండితే జోరందుకుంటాయని వారు చెబుతున్నారు. తమకు చేతినిండా పని దొరుకుతుందని రైతు కూలీలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో సాగు దాదాపు సాగర్ ఆయకట్టు కిందే ఉంది.

News July 29, 2024

కరీంనగర్: రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

image

కరీంనగర్ బొమ్మకల్ బైపాస్ మార్గంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందాడు. సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం లింగన్నపేటకు చెందిన దొంతినేని అభినయ్(26) కరీంనగర్ కాపువాడలో ఉంటూ ఓ షోరూంలో టెక్నీషియన్‌గా పని చేస్తున్నాడు. కరీంనగర్ నుంచి పెద్దపల్లి బైపాస్ మార్గంలో బైక్‌పై వెళ్తుండగా అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొన్నాడు. తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.

News July 29, 2024

ఢిల్లీలో మంచిర్యాల జిల్లా యువతి మృతి

image

ఢిల్లీ రాజేంద్రనగర్‌లోని ఓ సివిల్స్ కోచింగ్ సెంటర్‌లో వరదల కారణంగా మంచిర్యాల జిల్లాకు చెందిన తానియాసోని (25) మృతిచెందింది. ఆమె తండ్రి శ్రీరాంపూర్-1 భూగర్భ గని డీజీఎంగా పని చేస్తున్నారు. ఈ ఘటనపై కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తానియాసోని తండ్రి విజయ్ కుమార్‌ను కిషన్ రెడ్డి ఫోన్లో పరామర్శించారు. భౌతికకాయం వీలైనంత త్వరగా అప్పగించేందుకు సంపూర్ణంగా సహకరిస్తామని హామీ ఇచ్చారు.

News July 29, 2024

మద్నూర్: వివాహిత ఆత్మహత్య

image

కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం పెద్దతడ్గూర్‌కి చెందిన వివాహిత ఆత్మహత్య చేసుకున్నట్లు ఇన్‌ఛార్జ్ ఎస్ఐ సాయిలు తెలిపారు. గ్రామానికి చెందిన చంద్రకళ(25) కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతోంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు చెప్పారు. తండ్రి విఠల్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. 

News July 29, 2024

WGL: నవోదయ నోటిఫికేషన్.. అందుబాటులో 80 సీట్లు

image

జవహర్‌ నవోదయ విద్యాలయంలో ప్రవేశం లభిస్తే విద్యార్థులకు మంచి భవిష్యత్ ఉంటుంది. ఉమ్మడి వరంగల్‌ జిల్లా మొత్తానికి మాముమూరులో ఉన్న ఈ ఏకైక పాఠశాలలో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. 6వ తరగతిలో ప్రవేశాలకు 80 సీట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో గ్రామీణ ప్రాంత విద్యార్థులకు 75 శాతం, పట్టణ ప్రాంత విద్యార్థులకు 25 శాతం కేటాయిస్తారు. 6వ తరగతిలో ప్రవేశం లభిస్తే.. 12వ తరగతి వరకు వారి చదువు ఇక్కడ కొనసాగనుంది.

News July 29, 2024

అమెరికాలో పాలమూరు యువకుడు మృతి

image

పాలమూరుకు చెందిన యువకుడు అమెరికాలో ఈతకు వెళ్లి మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే, MBNR జిల్లా అడ్డాకులకు చెందిన అక్షిత్‌రెడ్డి చికాగోలోని లేక్‌మిశిగన్‌లో స్నేహితుడితో కలిసి ఈతకు వెళ్లాడు. ఓరాయి వద్దకు వెళ్లాలని నిర్ణయించుకునే క్రమంలో మధ్యలోనే ఆగి తిరిగి వస్తుండగా మునిగిపోయాడు. పోలీసులు గాలించి మృతదేహాన్ని వెలికి తీశారు. ఆదివారం అడ్డాకులలో అంత్యక్రియలు పూర్తిచేశారు.

News July 29, 2024

నాగార్జున‌సాగర్‌కు పెరుగుతున్న వరద ప్రవాహం

image

నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. ప్రస్తుతం 53,774 క్యూసెక్కులు వస్తోంది. పూర్తి స్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా, ప్రస్తుతం నీటి నిల్వ 510.2 అడుగులుగా ఉంది. 312.05 టీఎంసీలకు గాను 131.01 టీఎంసీల నీరు నిల్వ ఉంది. శ్రీశైలం నిండుకుండను తలపిస్తోండగా రేపు గేట్లు అవకాశముంది. అదే జరిగితే సాగర్ త్వరలోనే నిండనుంది.

News July 29, 2024

RR: ఆగస్టు 1న స్కిల్ యూనివర్సిటీకి శంకుస్థాపన

image

RR జిల్లా మహేశ్వరం అసెంబ్లీ ప్రాంతాన్ని మరో మహానగరంగా చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇక్కడ దాదాపు 12 వేల ఎకరాల్లో ప్రభుత్వ భూములు ఉండగా వారి కంపెనీలను ఏర్పాటు చేయాలని భావిస్తుంది. ఇందులో భాగంగానే స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయనుండగా.. ఆగస్టు 1న సీఎం శంకుస్థాపన చేయనున్నారు. కందుకూరు మండలం మీరాఖాన్ పేట్ ప్రాంతంలో 57 ఎకరాలు కేటాయించగా.. సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించారు.