Telangana

News April 2, 2024

HYD: రైతుల రుణమాఫీ కాకపోవడం దురదృష్టకరం: KTR

image

రాష్ట్రాన్ని అభివృద్ధి చేసింది KCR, మాయ మాటలు చెప్పి గెలిచింది రేవంత్ రెడ్డి అని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR ధ్వజమెత్తారు. శామీర్‌పేట్‌లో MLA మల్లారెడ్డి ఆధ్వర్యంలో నియోజకవర్గ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. రూ.2లక్షల రుణ మాఫీ చేస్తామని రేవంత్.. ఎన్నికల్లో చెప్పారని ఏప్రిల్ వచ్చినా రుణమాఫీ కాకపోవడం దురదృష్టకరమన్నారు. BRS నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ మహేందర్ రెడ్డి, సుదర్శన్ ఉన్నారు.

News April 2, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

@ వేములవాడ రూరల్ మండలంలో కల్తీకల్లు తాగి ఆరుగురికి అస్వస్థత. @ కరీంనగర్ లో కొడుకుకు విషమిచ్చి తల్లి ఆత్మహత్య. @ రాయికల్ మండలంలో పెళ్లి చేసుకుంటానని మోసం చేసిన వ్యక్తిపై కేసు. @ కథలాపూర్ మండలంలో ఏడుగురు పేకాటరాయుళ్ల పట్టివేత. @ జగిత్యాలలో ఆరోగ్య కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్. @ కొండగట్టు అంజన్న ఆలయంలో భక్తుల రద్దీ. @ మల్యాల ఎంపీపీపై నెగ్గిన అవిశ్వాసం. @ జగిత్యాల మండలంలో చెరువుల మునిగి బాలుడి మృతి

News April 2, 2024

హైదరాబాద్‌లో నేటి TOP NEWS

image

> ఓల్డ్ సిటీలో గంజాయి.. నిందితుడి తల్లి, యువతి అరెస్ట్
> కుత్బుల్లాపూర్‌‌లో BJP బూత్ స్థాయి కార్యకర్తల సమావేశం
> కాచిగూడలో రైలు కిందపడి వ్యక్తి ఆత్మహత్య
> హస్తినాపురంలో ఈటల రాజేందర్ రోడ్ షో
> OU డిగ్రీ కోర్సుల రివాల్యుయేషన్ ఫలితాలు విడుదల
> మియాపూర్ మెట్రో స్టేషన్‌ డిపోలో ఫైర్ యాక్సిడెంట్
> మేడ్చల్‌లో BRS విస్తృత స్థాయి సమావేశం
> జిన్నారం ORRపై యాక్సిడెంట్.. వ్యక్తి మృతి

News April 2, 2024

ఉమ్మడి జిల్లాలో నేటి ముఖ్యంశాలు..!

image

✒GDWL: ఈతకు వెళ్లి బాలిక మృతి
✒BRSకు ఓటేస్తే.. మీ ఓటు వృథా అయినట్లే: డీకే అరుణ
✒అలంపూర్ లో యాక్సిడెంట్.. ఒకరి మృతి
✒కాంగ్రెస్ వచ్చాకే రైతులకు కన్నీళ్లు: గువ్వల బాలరాజు
✒MBNR&NGKL:’ఎండిన పంటలు.. ఎకరాకు రూ.25 వేలు ఇవ్వాలి’
✒WNPT:చిన్నారెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరికలు
✒ఆరెంజ్ అలర్ట్.. అత్యవసరమైతేనే బయటకు రండి: కలెక్టర్లు
✒పలుచోట్ల ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు
✒పలుచోట్ల ఇస్తారు విందు!

News April 2, 2024

HYD: ORRపై యాక్సిడెంట్.. వ్యక్తి మృతి

image

HYD శివారు జిన్నారం మండలం కాజిపల్లి శివారులోని ఓఆర్ఆర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మంగళవారం ఓ వ్యక్తి మృతిచెందాడు. ఐడీఐ బొల్లారం పోలీసులు తెలిపిన వివరాలు.. ఖైరతాబాద్ వాసి ఏసీ గాడ్ షేక్ ఇసాక్(54) ఓఆర్ఆర్‌పై నడుచుకుంటూ వెళ్తుండగా ఓ షిఫ్ట్ కార్ డ్రైవర్ అజాగ్రత్తగా నడుపుతూ వేగంగా అతడిని ఢీకొట్టడంతో షేక్ ఇసాక్ అక్కడికక్కడే మృతిచెందాడు. సీఐ గంగాధర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News April 2, 2024

HYD: ORRపై యాక్సిడెంట్.. వ్యక్తి మృతి

image

HYD శివారు జిన్నారం మండలం కాజిపల్లి శివారులోని ఓఆర్ఆర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మంగళవారం ఓ వ్యక్తి మృతిచెందాడు. ఐడీఐ బొల్లారం పోలీసులు తెలిపిన వివరాలు.. ఖైరతాబాద్ వాసి ఏసీ గాడ్ షేక్ ఇసాక్(54) ఓఆర్ఆర్‌పై నడుచుకుంటూ వెళ్తుండగా ఓ షిఫ్ట్ కార్ డ్రైవర్ అజాగ్రత్తగా నడుపుతూ వేగంగా అతడిని ఢీకొట్టడంతో షేక్ ఇసాక్ అక్కడికక్కడే మృతిచెందాడు. సీఐ గంగాధర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News April 2, 2024

MDK: ఆ ఇంట్లో విషాదం..

image

మెదక్ జిల్లాలో ఓ వ్యక్తి గుండెపోటుతో మరణించారు. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు.. నిజాంపేట మండల కేంద్రానికి చెందిన జీడీ రామకృష్ణ(38) గుండెపోటుతో మంగళవారం మరణించారు.ఛాతిలో నొప్పి వస్తుందని కుటుంబ సభ్యులకు తెలపగా హుటాహుటిన HYDలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మరణించారు. కాగా నెల రోజుల క్రితం అతడి తండ్రి చనిపోయాడు. వరుసగా తండ్రి కొడుకుల మరణంతో ఆ ఇంట్లో విషాదం నెలకొంది.

News April 2, 2024

వడదెబ్బ నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకోండి: కలెక్టర్

image

రోజూరోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతున్న దృష్ట్యా ప్రజలు వడదెబ్బ బారిన పడకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కలెక్టర్ పమేలా సత్పతి వైద్యాధికారులకు సూచించారు. ఎవరైనా వడదెబ్బ బారిన పడితే వెంటనే హాస్పిటల్ కు తరలించి వైద్య సేవలు అందించాలని పేర్కొన్నారు. మంగళవారం కరీంనగర్ రూరల్ మండలం తీగలగుట్టపల్లిలోని బస్తీ దవాఖానను కలెక్టర్ సందర్శించారు.

News April 2, 2024

NZB:పసుపు బోర్డు ఎక్కడ.. అరవింద్?: జీవన్‌రెడ్డి

image

ప్రధాని మోదీ పసుపు బోర్డు ప్రకటన చేసి ఆరునెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు ఎందుకు ఏర్పాటు చేయలేదని నిజామాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి ప్రశ్నించారు. బోర్డును నిజామాబాద్‌లో ఏర్పాటు చేస్తారా? లేక అహ్మదాబాద్లో పెడతారా? అని ఎద్దేవా చేశారు. జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ ‌భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

News April 2, 2024

వడదెబ్బకు గురికాకుండా జాగ్రత్తలు తీసుకోండి: ప్రియాంక అలా

image

భద్రాద్రి కొత్తగూడెం ఎండ తీవ్రతతో వడదెబ్బకు గురికాకుండా రక్షణ చర్యలు పాటించాలని ప్రజలకు కలెక్టర్ ప్రియాంక అలా సూచించారు. మంగళవారం ఐడిఓసి కార్యాలయం సమావేశం మందిరంలో వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో జిల్లా టాస్క్ ఫోర్స్ మీటింగ్ అన్ని మండలాల్లోని వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజలకు అవగాహన సదస్సులు నిర్వహించాలని చెప్పారు.