Telangana

News July 28, 2024

HYD: అక్రమ నల్లా కనెక్షన్లకు చెక్ పెట్టడంపై కసరత్తు!

image

HYD జలమండలి సేవలు ఔటర్ రింగ్ రోడ్డు వరకు విస్తరించాయి. సుమారుగా 1400 చ.కి.మీ. పరిధిలో 80 లక్షల మందికి తాగునీటిని అందిస్తోంది. గ్రేటర్ HYD వరకు నెలకు 20 వేల లీటర్లు ఉచితంగా ఇస్తోంది. అయినా చాలామంది అధికారికంగా నల్లా కనెక్షన్ లేకుండా, అక్రమాలకు పాల్పడుతున్నారు. వీటన్నింటికీ చెక్ పెట్టేందుకు ప్రత్యేక టెక్నాలజీని ఉపయోగించేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు.

News July 28, 2024

అమ్మవారి ఆశీర్వాదం ప్రజలందరిపై ఉండాలి: మంత్రి పొన్నం

image

లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారి బోనాల ఉత్సవాల సందర్భంగా ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతో కలిసి అమ్మవారిని మంత్రి పొన్నం ప్రభాకర్ దర్శించుకున్నారు. మంత్రి పొన్నం మాట్లాడుతూ.. అమ్మవారి ఆశీర్వాదం ప్రజలందరి మీద ఉండాలనీ కోరుకుంటున్నానని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత మొదటిసారి జరుగుతున్న దశాబ్ది బోనాల ఉత్సవాలకు ప్రభుత్వం తరపున అన్ని రకాల చర్యలు తీసుకున్నామని తెలిపారు.

News July 28, 2024

అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించిన జూపల్లి

image

హైదారాబాద్లోని మీరాలం మండి శ్రీ మహాకాళేశ్వర అమ్మవారికి మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు సమర్పించారు. అనంతరం అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అంతకుముందు దేవాదాయ శాఖ అధికారులు, అర్చకులు, ఆలయ కమిటీ సభ్యులు జూపల్లికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అమ్మవారి ఆశీస్సులు అందరిపై ఉండాలని, ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని మంత్రి జూపల్లి ఆకాక్షించారు.

News July 28, 2024

NZB: అనర్హులు.. దర్జాగా పింఛన్లు పొందుతున్నారు!

image

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కొందరు అనర్హులు మాత్రం దర్జాగా పింఛన్లు పొందుతున్నారు. సర్వీస్ పింఛన్‌తో పాటు ఆసరా పింఛన్లను ఏళ్లుగా తీసుకుంటున్న 555 మందిని అధికారులు ఇటీవల గుర్తించారు. వీరికి పింఛన్లను నిలిపివేయించి, నోటీసులు జారి చేశారు. కొందరి నుంచి డబ్బులు రికవరీ చేశారు. కాగా.. ఈ వ్యవహారంలో ప్రభుత్వం రూ. 3.63 కోట్లు నష్టపోయింది.

News July 28, 2024

నల్గొండలో రోడ్డుప్రమాదం.. మహిళ మృతి

image

నల్గొండ చర్లపల్లి సప్తగిరి విల్లాస్ ఎదురుగా రోడ్డు దాటుతున్న మహిళని నల్గొండ నుంచి నార్కెట్ పల్లి వైపు వేగంగా వస్తున్న కారు ఢీ కొట్టడంతో మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. ప్రమాదానికి కారణమైన కారు ఆగకుండా వెళ్లింది. దామరచర్ల మండలానికి చెందిన వీరి కుటుంబం చర్లపల్లి గ్రామంలో నివసిస్తూ రోజు వారి కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నట్లు స్థానికులు తెలిపారు.

News July 28, 2024

కేటీఆర్ పర్యటనపై చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ విమర్శలు

image

కేటీఆర్ ఇటీవల మేడిగడ్డ బ్యారేజీ సందర్శించడంపై చెన్నూర్ ఎమ్మెల్యే డాక్టర్ వివేక్ వెంకటస్వామి తీవ్రంగా విమర్శించారు. ఆదివారం మంచిర్యాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అధికారంలో ఉన్నప్పుడు చేసిన తప్పులు క్షమించమని కాళేశ్వరంలో పూజలు చేసేందుకు వచ్చినట్లు ఉందన్నారు. మాజీ సీఎం కేసీఆర్ కమీషన్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారని ఆరోపించారు.

News July 28, 2024

జైపాల్‌రెడ్డి కాంస్య విగ్రహావిష్కరణ.. ప్రస్థానం ఇదే

image

మాడ్గులలో జన్మించిన దివంగత జైపాల్‌రెడ్డి కల్వకుర్తి నుంచి 4సార్లు MLAగా పని చేశారు. 1984లో MBNR ఎంపీ(జనతా పార్టీ)గా లోక్‌సభకు వెళ్లారు. కాంగ్రెస్ నుంచి 1999, 2004, 09లో MPగా గెలిచి కేంద్రమంత్రిగా పనిచేశారు. దక్షిణాది నుంచే తొలి ఉత్తమ పార్లమెంటేరియన్‌గా ఎన్నికయ్యారు. ప్రత్యేక రాష్ట్ర సాధనలో కీలక పాత్ర వహించారు. 2019లో చనిపోగా ఆయన వర్ధంతి రోజు జులై 28న కాంస్య విగ్రహావిష్కరణకు ఏర్పాట్లు చేశారు.

News July 28, 2024

వరంగల్ : చింతచిగురు @కిలో రూ.500

image

వానాకాలంలో చింతచిగురు లభిస్తోంది. దీంట్లో పొషకాలు అధికంగా ఉండటంతో జనాలు దీన్ని తినేందుకు ఆసక్తి కనబరుస్తారు. నగరంలో చింతచిగురు తక్కువ దొరకడంతో ఆదివారం మట్టెవాడ, మండిబజార్ తదితర ప్రాంతంలో ‌రూ.500 రేటు పలుకుతోంది. ఎలాంటి రసాయనాలు లేకపోవడం, ప్రకృతి సిద్ధంగా లభించడంతో దీనికి ఇంతలా డిమాండ్ ఉంది.

News July 28, 2024

HYD: జర్మనీలో నర్సింగ్ ఉద్యోగాలు..!

image

జర్మనీలో నర్సింగ్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రభుత్వ ఆధ్వర్యంలోని TG ఓవర్సీస్ మ్యాన్ పవర్ సంస్థ HYD జనరల్ మేనేజర్ నాగభారతి తెలిపారు. గుర్తింపు పొందిన ఆసుపత్రుల్లో నర్సింగ్, ఐసీయూ, జెరియాట్రిక్స్, ఆర్థోపెడిక్స్, సైకియాట్రీ, కార్డియాలజీ, నియోనాటల్,సర్జికల్ తదితర విభాగాల్లో 1-3 ఏళ్ల అనుభవం, జర్మనీ భాష తెలిసి ఉండాలి. https://tomcom.telangana.gov.in/ ద్వారా దరఖాస్తు చేసుకోండి.

News July 28, 2024

HYD: జర్మనీలో నర్సింగ్ ఉద్యోగాలు..!

image

జర్మనీలో నర్సింగ్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రభుత్వ ఆధ్వర్యంలోని TG ఓవర్సీస్ మ్యాన్ పవర్ సంస్థ HYD జనరల్ మేనేజర్ నాగభారతి తెలిపారు. గుర్తింపు పొందిన ఆసుపత్రుల్లో నర్సింగ్, ఐసీయూ, జెరియాట్రిక్స్, ఆర్థోపెడిక్స్, సైకియాట్రీ, కార్డియాలజీ, నియోనాటల్,సర్జికల్ తదితర విభాగాల్లో 1-3 ఏళ్ల అనుభవం, జర్మనీ భాష తెలిసి ఉండాలి. https://tomcom.telangana.gov.in/ ద్వారా దరఖాస్తు చేసుకోండి.