Telangana

News July 28, 2024

వీధి వ్యాపారులకు త్వరలో పీఎం స్వనిధి కార్డుల పంపిణీ

image

మున్సిపాలిటీల్లోని వీధి వ్యాపారులకు ప్రత్యేక గుర్తింపు ఇచ్చేందుకు కేంద్రం చర్యలు తీసుకుంటోంది. వారి వ్యాపార నిర్వహణకు ఇప్పటికే రుణాలు మంజూరు చేసి ఆర్థికంగా ఆదుకుంటున్న ప్రభుత్వం ఇప్పుడు వీధి వ్యాపారానికి గుర్తింపునిచ్చే ప్రయత్నం చేస్తోంది. ఉమ్మడి జిల్లాలోని 19 పురపాలికల్లో 37,784 మంది వీధి వ్యాపారులు ఉన్నారు. తాజాగా ఆయా వ్యాపారాలు చేసే పనికి ప్రత్యేక గుర్తింపు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.

News July 28, 2024

NLG: జిల్లాలో ఇక స్థానిక జోష్

image

జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల సందడి మొదలైంది. సీఎం రేవంత్ రెడ్డి ప్రకటనతో ఆశావహుల్లో జోష్ పెరిగింది. సర్పంచుల పదవీకాలం పూర్తయి 6 నెలలు అవుతుండగా, MPTC, ZPTCల పదవీ కాలం ఈనెల 5న ముగిసిన విషయం తెలిసిందే. పంచాయతీ ఎన్నికలు త్వరలో నిర్ణయిస్తామని, ఆగస్టు మొదటి వారంలోగా ఓటర్ల జాబితా సిద్ధం చేయాలంటూ సీఎం రేవంత్రెడ్డి అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. తొలుత MPTC, ZPTCల ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలుస్తుంది.

News July 28, 2024

భద్రాద్రికి వరదొస్తే దినదిన గండమేనా

image

భద్రాచలం వద్ద ఉన్న గోదావరి ఉప్పొంగిన ప్రతీ ఏడాది ప్రజలు భయాందోళనతో వణికిపోతున్నారు. గోదావరి వరదతో భద్రాచలం, చర్ల, దుమ్ముగూడెం, అశ్వాపురం, మణుగూరు, పినపాక, బూర్గంపాడు మండలాలకు వరద ప్రమాదం పొంచి ఉందా అంటే అవునని సమాధానం వస్తోంది. మరి ఎందుకు అధికారులు శాశ్వత పరిష్కారం చూపలేకపోతున్నారు. వరద తీవ్రమైతే భద్రాచలం పరిస్థితి ఏంటి. లక్షల రూపాయల ఆస్తి నష్టం జరుగుతుంటే ఎందుకు శాశ్వత పరిష్కారం చూపడం లేదు.

News July 28, 2024

శ్రీశైలానికి నీటి మట్టం పెరుగుతుంది

image

శ్రీశైలం జలాశయంలో రోజురోజుకూ నీటి మట్టం పెరుగుతుంది. శనివారం సాయంత్రం వరకు 867.0 అడుగుల వద్ద 130.0724 టీఎంసీల నీరు నిల్వ కొనసాగుతోంది. జూరాల ఆనకట్ట గేట్లు, విద్యుదుత్పత్తి చేస్తూ 3,09,885 క్యూసెక్కుల నీటిని శ్రీశైలానికి వదులుతున్నారు. అలాగే సుంకేసుల నుంచి 99,736క్యూసెక్కులు కలిపి మొత్తం 4,09,621క్యూసెక్కుల ప్రవాహం వస్తుంది. దీంతో వివిధ రూపాల్లో 18,480 క్యూసెక్కుల నీటిని సాగర్‌కు వదులుతున్నారు.

News July 28, 2024

MBNR: జూరాలకు పోటెత్తిన వరద.. 3.02 లక్షల క్యూసెక్కుల వరద

image

జూరాల ప్రాజెక్టుకు వరద పోటెత్తింది శనివారం సాయంత్రానికి జలాశయంలోకి 3.02 లక్షల క్యూసెక్కుల వరద చేరుతుంది జలాశయంలోకి ఇప్పటివరకు వచ్చిన వరద 125 టీఎంసీలకు చేరింది జలాశయం నుంచి దిగువకు 44 గేట్లు ఎత్తి 2.92 లక్షల క్యూసెక్కులు, జల విద్యుత్ ద్వారా 19 వేలు కలిపి 3.11 లక్షల క్యూసెక్కుల వరదను దిగువకు వదులుతున్నారు. సోమవారం దాకా జూరాలకు వరద నిలకడగా కొనసాగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

News July 28, 2024

కల్వకుర్తికి సీఎం.. 157మందితో భారీ బందోబస్తు

image

వెల్దండ మండలం కొట్రతండాలో నేడు కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి విగ్రహావిష్కరణకు సీఎం రేవంత్ రెడ్డి హాజరవుతున్నారు. CM పర్యటన సందర్భంగా వెల్దండ పోలీస్ సర్కిల్ పరిధిలో 157మందితో పటిష్ఠ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఇప్పటికే భద్రత ఏర్పాట్లను HYD రేంజ్ ఐజీ సత్యనారాయణ డివిజన్ అధికారులతో పరిశీలించారు. సీఎంగా రేవంత్‌రెడ్డి మొదటిసారి కల్వకుర్తికి రానున్నారు. కల్వకుర్తిలో సభ ఏర్పాటు చేశారు. 

News July 28, 2024

MNCL: అనుమానాస్పదస్థితిలో మహిళ దుర్మరణం

image

మంచిర్యాల పట్టణంలోని గోదావరి నది తీరంలో అనుమానాస్పదస్థితిలో ఒక మహిళ దుర్మరణం పాలైనట్లు సీఐ బన్సీలాల్ తెలిపారు. మృతురాలు గోదావరి నీటిలో పూర్తిగా మునిగిపోవడంతో ముఖం గుర్తుపట్టకుండా ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. స్థానిక పాత మంచిర్యాలకు చెందిన ధరణి పద్మ అనే మహిళ ఈనెల 25 నుంచి కనిపించకుండా పోయింది. మృతురాలు పద్మ అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.

News July 28, 2024

KTDM: భూత వైద్యుడిపై కేసు నమోదు

image

భూత వైద్యం పేరుతో అమాయక ప్రజలను మోసం చేస్తున్న దమ్మపేటకు చెందిన రేపల్లె తిరుపతిపై ఎస్సై గణేశ్ శనివారం బైండోవర్ కేసు నమోదు చేశారు. నిందితుడు దుమ్ముగూడెం మండలంలోని గ్రామాల్లో తిరుగుతూ అమాయక ప్రజలను అనారోగ్య సమస్యలు ఉన్నాయని, దెయ్యం పట్టిందని వదిలిస్తానని నమ్మించి వేలాది రూపాయలు వసూలు చేశాడు. అతనిపై అనుమానంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సీఐ అశోక్ కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

News July 28, 2024

కామారెడ్డి: కొడుకు చనిపోయాడని తండ్రి సూసైడ్

image

కామారెడ్డి మండలం గర్గుల్ గ్రామానికి చెందిన శ్రీనివాస్(46) తన కొడుకు ఇటీవల మృతి చెందడంతో మానసిక వేదనకు గురై శనివారం ఆత్మహత్యకు పాల్పడినట్లు పట్టణ సీఐ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. భార్య మాధవి మూడు రోజుల క్రితం పుట్టింటికి వెళ్ళిపోయింది. కాగా, ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకున్నాడు. కొడుకు విశాల్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

News July 28, 2024

నల్గొండ: పరీక్ష పెట్టారు.. ప్రైజులు మరిచారు

image

రాజీవ్ గాంధీ క్విజ్ కాంపిటీషన్ పేరిట జూన్ 2023లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో క్విజ్ పోటీలు నిర్వహించింది. ప్రతీ నియోజకవర్గంలో మొదటి 40 స్థానాల్లో ఉన్నవారికి ప్రైజులు ఇస్తామని ప్రకటించగా పెద్ద ఎత్తున యువత పాల్గొన్నారు. పరీక్ష ముగిసి ఏడాది దాటినా ఫలితాల ఊసే లేదు. పరీక్ష రాసిన అభ్యర్థులు ఫలితాలు, ప్రైజుల కోసం ఎదురు చూస్తున్నారు. అధికారంలోకి వచ్చారు కదా ఇప్పటికైనా ఇస్తారేమో అని యువత చర్చించుకుంటున్నారు.