Telangana

News July 28, 2024

కల్వకుర్తి: సీఎం రేవంత్ రెడ్డి హామీలపై ఆశలు..!

image

సీఎం హోదాలో రేవంత్ రెడ్డి ఈరోజు మొదటిసారి కల్వకుర్తికి వస్తుండటంతో నియోజకవర్గ ప్రజలు అభివృద్ధిపై ఆశలు పెంచుకుంటున్నారు. కొన్ని ఏళ్లుగా నియోజకవర్గంలో పేరుకుపోయిన సమస్యలు తీరుతాయని ప్రజలు ఆశలకు హద్దులు లేకుండా పోయింది. కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్‌లో భూములు కోల్పోయి నేటికి పైసలు రాని భూ నిర్వాసితులకు న్యాయం జరుగుతుందని భావిస్తున్నారు. పర్యటనలో CM ఎలాంటి హామీలు ఇస్తారో అని ఆశగా ఎదురుచూస్తున్నారు.

News July 28, 2024

జడ్చర్ల: తమ్ముడు కనిపించడం లేదని అన్న ఫిర్యాదు

image

పెట్రోల్ తీసుకురావడానికి వెళ్లిన వ్యక్తి ఇంటికి రాలేదని కేసు నమోదైన ఘటన జడ్చర్ల మండలం ఆలూరు గ్రామంలో శనివారం చోటు చేసుకుంది. సీఐ ఆదిరెడ్డి తెలిపిన వివరాలు.. విజయ్ కుమార్(27) అనే వ్యక్తి ఆటో డ్రైవింగ్ చేస్తూ భార్య లావణ్యతో జడ్చర్లలో జీవనం సాగిస్తూ ఉండేవారని, బైక్‌కు పెట్రోల్ తీసుకురావడానికి వెళ్తానని తెలిపి రాకపోవడంతో ఆమె బావ నరసింహకు తెలుపగా వారు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశామని తెలిపారు.

News July 28, 2024

ఎస్సీ సబ్ ప్లాన్ నిధులను BRS సరిగా ఖర్చు చేయలేదు: డిప్యూటీ సీఎం

image

BRS ప్రభుత్వం ఎస్సీ సబ్ ప్లాన్ నిధులను సరిగా ఖర్చు చేయలేదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. తమ ప్రభుత్వంలో అన్ని వర్గాలకు చేయూత ఇవ్వాలనే ఉద్దేశంతో ఎస్సీ సబ్ ప్లాన్ రూ.33,124 కోట్లు, ఎస్టీ సబ్ ప్లాన్ రూ.17,056 కోట్లు, బీసీ సబ్ ప్లాన్‌కు రూ.10,028 కోట్లు, మైనార్టీల సబ్ ప్లాన్‌కు రూ.3,002 కోట్లు కేటాయించామని తెలిపారు.

News July 28, 2024

చాపకింద నీరులా డయాలసిస్: వైద్యులు

image

ఉమ్మడి జిల్లాలో చాలా మంది డయాలసిస్ వ్యాధి బారిన పడుతున్నారని, అందులో కొందరిని మాత్రమే గుర్తిస్తున్నామని వైద్యులు తెలిపారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం ఉమ్మడి జిల్లాలో 327 మంది డయాలసిస్(రక్త శుద్ది) సేవలు పొందుతుంటే అందులో MBNR:09, WNPT:16, GDWL :23, NRPT:8, NGKL:12 మంది చొప్పున మొత్తం 68 మంది హెపటైటిస్ బాధితులే కావటం గమనార్హం. ఈ వ్యాధి ఎయిడ్స్ కంటే డేంజర్ అని వైద్యులు శనివారం తెలిపారు.

News July 28, 2024

BRS ప్రభుత్వం 2 నెలలు పింఛన్లు ఎగ్గొట్టింది: డిప్యూటీ సీఎం భట్టి

image

BRS ప్రభుత్వం 2 నెలలు ఆసరా పింఛన్లు ఎగ్గొట్టిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ‘ORRపై 30 ఏళ్లపాటు వచ్చే ఆదాయాన్ని ఒక్క ఏడాదిలోనే తీసుకున్నారు. ప్రభుత్వం దిగిపోయే ముందు ఓఆర్ఆర్ వేలం వేసుకుని భవిష్యత్లో ఆదాయం లేకుండా చేశారు. పదేళ్లుగా టీచర్లకు పదోన్నతులు, బదిలీలు లేవు. ఈ ప్రభుత్వం 16 వేల మంది టీచర్లకు పదోన్నతులు, బదిలీలు కల్పించింది’ అని అన్నారు.

News July 28, 2024

KNR: శవపరీక్షకు రూ.6 వేలు డిమాండ్

image

చిగురుమామిడి మండలం రేగొండలో శుక్రవారం గొర్రెల కాపరి బొందయ్య బావిలో పడి మృతిచెందిన విషయం తెలిసిందే. శవపరీక్షకు హుస్నాబాద్ ప్రభుత్వాసుపత్రిలో వైద్యసిబ్బంది రూ.6వేలు డిమాండ్ చేశారని సీపీఐ రాష్ట్ర సమితి సభ్యడు ఆరోపించారు. బాధిత కుటుంబీకులు రూ.4 వేలు ఇచ్చినా.. ఒప్పుకోకపోలేదని ఆయన తెలిపారు. ఆయన ఆసుపత్రి సూపరింటెండెంట్ రమేశ్‌రెడ్డితో ఫోన్లో మాట్లాడగా డబ్బులు తిరిగి ఇప్పించారన్నారు.

News July 28, 2024

వరంగల్: బోడ కాకరకాయకు భలే డిమాండ్

image

బోడ కాకర కు మార్కెట్లో మంచి గిరాకీ ఉంది. ఏడాదిలో కేవలం నెల నెలన్నర రోజులు మాత్రమే ఇది మార్కెట్‌కు వస్తోంది. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే వీటిని సీజన్‌లో కనీసం ఒక్కసారైనా తినాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. అన్ని మార్కెట్లలో బోడ కాకర విక్రయానికి వస్తుంది. కిలో రూ.380 నుంచి రూ.400 వరకు విక్రయించారు. రసాయనాలు లేకుండా పండే ఈ బోడ కాకర ధర కోడి మాంసం కన్నా ఎక్కువ ఉన్నా ప్రజలు ఆసక్తి చూపుతున్నారు.

News July 28, 2024

శ్రీశైలం గేట్లు ఎత్తే అవకాశం!

image

రెండు మూడు రోజుల్లో శ్రీశైలం డ్యామ్ నిండే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. అదే జరిగితే డ్యామ్ గేట్లు ఎత్తే అవకాశం ఉంది. ఇప్పటికే రిజర్వాయర్‌లో 120 టీఎంసీలకుపైగా నీటి నిల్వ ఉంది. మరో 90కిపైగా టీఎంసీలు వస్తే ప్రాజెక్టు పూర్తిగా నిండుతుంది. ఆ తర్వాత గేట్లు ఎత్తి దిగువన ఉన్న నాగార్జున సాగర్‌కు నీటిని వదలనున్నట్లు సమాచారం.

News July 28, 2024

HYD: బోనాల పండుగకు డాన్స్ చేసేవాణ్ని: హీరో

image

HYD పాతబస్తీలో చిన్నప్పటి నుంచి లాల్ దర్వాజా బోనాలు చూస్తూ పెరిగానని హీరో ప్రియదర్శి అన్నారు. పోతరాజు వేషంలో డాన్స్ చేసేవాళ్లని చూస్తుంటే సంతోషంగా ఉంటుందన్నారు. డ్రమ్స్, మ్యూజిక్, డాన్స్ చూస్తుంటే బాడీలో ఒక వైబ్రేషన్ వస్తుందన్నారు. తన బాల్యంలో బోనాల పండుగకు డాన్స్ చేసేవాణ్ని అని చెప్పారు. HYD బోనాల పండుగను తిలకిస్తుంటే చెప్పలేని సంతోషం కలుగుతుందన్నారు.

News July 28, 2024

HYD: బోనాల పండుగకు డాన్స్ చేసేవాణ్ని : హీరో

image

HYD పాతబస్తీలో చిన్నప్పటి నుంచి లాల్ దర్వాజా బోనాలు చూస్తూ పెరిగానని హీరో ప్రియదర్శి అన్నారు. పోతరాజు వేషంలో డాన్స్ చేసేవాళ్లని చూస్తుంటే సంతోషంగా ఉంటుందన్నారు. డ్రమ్స్, మ్యూజిక్, డాన్స్ చూస్తుంటే బాడీలో ఒక వైబ్రేషన్ వస్తుందన్నారు. తన బాల్యంలో బోనాల పండుగకు డాన్స్ చేసేవాణ్ని అని చెప్పారు. HYD బోనాల పండుగను తిలకిస్తుంటే చెప్పలేని సంతోషం కలుగుతుందన్నారు.