India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
రేబిస్ వ్యాధితో ఓ మహిళ మృతి చెందిన ఘటన మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల కేంద్రంలో శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికుల ప్రకారం.. ఏడ్చెర్ల గ్రామానికి చెందిన పూలమ్మ అనే మహిళపై ఇటీవల ఓ వీధి కుక్క దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. మహబూబాబాద్ స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందినా నయం కాకపోవడంతో ఎంజీఎం ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
కులం పేరుతో దూషించి, పొలంలోని పైపులకు నిప్పు పెట్టిన వ్యక్తికి ఎస్సీ, ఎస్టీ కోర్టు జడ్జి శ్రీనివాస్ ఏడేళ్ల జైలు శిక్షతో పాటు రూ.4,700 జరిమానా విధించారు. ఏర్గట్లలోని తొర్తి గ్రామానికి చెందిన చిన్న లింబన్న అదే గ్రామానికి చెందిన చిన్న సాయన్న పొలంలోని పైపులను కాల్చేశాడు. ఎందుకు కాల్చావని సాయన్న అడిగితే అతడిని కులం పేరుతో దూషించాడు. దీంతో సాయన్న పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఉమ్మడి జిల్లాలోని చెరువుల్లో చేప పిల్లలు వదిలేందుకు గుత్తేదారులు ఎవరూ ముందుకు రావటం లేదు. మత్స్యకారుల జీవనోపాధి కోసం గత సర్కారు ఉచిత చేప పిల్లల పంపిణీకి శ్రీకారం పుట్టిన విషయం తెలిసిందే. జిల్లాలోని చెరువుల్లో చేప పిల్లలు వదిలేందుకు మత్స్యశాఖ అధికారులు టెండర్లను ఆహ్వానించారు.. ఈ నెల 10 నుంచి 23 వరకు టెండర్ల ప్రక్రియ ప్రారంభమైంది. కానీ ఉమ్మడి జిల్లాలో ఒక్కరు కూడా టెండర్లు వేసేందుకు ముందుకురాలేదు.
కేయూ పీజీ (MA/M.Com/M.Sc) రెండో సెమిస్టర్ పరీక్షా టైం టేబుల్ను పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య ఎస్.నరసింహచారి, అదనపు పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ బీఎస్ఎల్. సౌజన్య విడుదల చేశారు. ఆగస్టు 7న మొదటి పేపర్, 9న రెండో పేపర్, 12న మూడో పేపర్, 14న నాల్గో పేపర్, 16న ఐదో పేపర్, 19న ఆరో పేపర్ పరీక్ష ఉన్నట్లు పేర్కొన్నారు. పరీక్షలు మధ్యాహ్నం 2 – 5 గంటల వరకు జరుగుతాయన్నారు.
రైలు నుంచి జారి పడి యువకుడు మృతి చెందిన ఘటనపై శుక్రవారం కేసు నమోదైంది. రైల్వే జీఆర్పీ ఎస్ఐ భాస్కరరావు వివరాల ప్రకారం.. బిహార్ మధుబని మండలం బైరాకి చెందిన లలిత్ సదయ్ (22) బంధువులతో కలిసి ఈనెల 24న ప్రయాణిస్తున్నాడు. ఈ క్రమంలో రామన్నపేట రైల్వే గేట్ వద్ద కాలు జారి పడిపోయి మృతిచెందగా పోలీసులు శుక్రవారం మృతదేహాన్ని అన్నం ఫౌండేషన్‌కు అప్పగించారు.
పెళ్లి పేరుతో నమ్మించి యువతిపై అత్యాచారానికి పాల్పడిన నటుడిపై బేగంపేట పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాలు..శ్యామ్‌లాల్ బిల్డింగ్స్ సమీపంలో నివసించే మహిళ(34)కు నటుడు అమన్ సింగ్(27)తో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. 2023OCTలో మహిళను తన ఫ్లాటుకు పిలిచి పెళ్లి చేసుకుంటానని నమ్మించి అత్యాచారానికి పాల్పడ్డాడు. పెళ్లిచేసుకోమనగా తప్పించుకొని తిరగడంతో బాధితురాలు శుక్రవారం PSను ఆశ్రయించింది.
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా జాబ్ కార్డుదారులకు నూరు రోజుల పనిదినాలు కల్పించడంలో యాదాద్రి జిల్లా రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉంది. మరోవైపు NLG, SRPT, యాదాద్రి జిల్లాల్లోని ప్రజల్లో సగటు భూమి యాదాద్రిలోనే అత్యధికం కావడం విశేషం. మూడేళ్లలో ఉమ్మడి జిల్లాలో ప్రజల తలసరి ఆదాయం క్రమంగా పెరుగుతోంది. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం సామాజిక ఆర్థిక ముఖచిత్రం 2024లో వెల్లడించింది.
పెళ్లి పేరుతో నమ్మించి యువతిపై అత్యాచారానికి పాల్పడిన నటుడిపై బేగంపేట పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాలు..శ్యామ్‌లాల్ బిల్డింగ్స్ సమీపంలో నివసించే మహిళ(34)కు నటుడు అమన్ సింగ్(27)తో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. 2023OCTలో మహిళను తన ఫ్లాటుకు పిలిచి పెళ్లి చేసుకుంటానని నమ్మించి అత్యాచారానికి పాల్పడ్డాడు. పెళ్లిచేసుకోమనగా తప్పించుకొని తిరగడంతో బాధితురాలు శుక్రవారం PSను ఆశ్రయించింది.
మహిళా సంఘాల రుణాల ద్వారా పెద్దగా ఉపయోగం లేదని గమనించిన ప్రభుత్వం వారి ఆర్థిక బలోపేతానికి ‘ఇందిరా మహిళా శక్తి’ అనే కొత్త స్కీమ్ తీసుకొచ్చింది. ఆగస్టు 15 వరకు వ్యాపారాలను ప్రారంభించేలా ఆదేశిలిచ్చింది. క్యాంటీన్, ఈవెంట్ మేనేజ్ మెంట్, పెరటి కోళ్లు, మొబైల్ ఫిష్ అవుట్‌లెట్, మిల్క్ పార్లర్, మీ సేవా, ఆహార కేంద్రాలు, కుట్టు మెషీన్ కేంద్రాలు తదితర వ్యాపారాల్లో మహిళలను ప్రభుత్వం ప్రోత్సహించనుంది.
ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఆరు జిల్లాలు విభిన్న రంగాల్లో ప్రగతిపథంలో సాగుతున్నా పలు అంతరాలు కొనసాగుతున్నాయి. ఆరు జిల్లాల్లో తలసరి ఆదాయాన్ని పరిశీలిస్తే వరంగల్ వాసుల ఆదాయం తక్కువగా ఉంది. ఈ విషయంలో హనుమకొండ జిల్లా అట్టడుగునా ఉంది. ఆదాయంలో భూపాలపల్లి, ములుగు కొంత మెరుగ్గా ఉన్నాయి. భూపాలపల్లి జిల్లాలో సగటున నెలకు రూ.22,629 సంపాదిస్తే.. హనుమకొండలో రూ.15,563 మాత్రమే సంపాదిస్తున్నారు.
Sorry, no posts matched your criteria.