Telangana

News July 27, 2024

HYD: ప్రజావాణికి 681 దరఖాస్తులు

image

HYD ప్రజాభవన్‌లో శుక్రవారం నిర్వహించిన ప్రజావాణికి 681 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. రెవెన్యూకు సంబంధించినవి 69, పౌరసరఫరాల శాఖవి 132, విద్యుత్‌ 87, హౌసింగ్‌ 232, పంచాయతీరాజ్‌ గ్రామీణాభివృద్ధి 31, ఇతర శాఖలకు సంబంధించినవి 130 దరఖాస్తులు అందినట్లు అధికారులు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు డా.చిన్నారెడ్డి, ప్రజావాణి ప్రత్యేక అధికారి దివ్య దరఖాస్తులు స్వీకరించారు.

News July 27, 2024

HYD: ప్రజావాణికి 681 దరఖాస్తులు

image

HYD ప్రజాభవన్‌లో శుక్రవారం నిర్వహించిన ప్రజావాణికి 681 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. రెవెన్యూకు సంబంధించినవి 69, పౌరసరఫరాల శాఖవి 132, విద్యుత్‌ 87, హౌసింగ్‌ 232, పంచాయతీరాజ్‌ గ్రామీణాభివృద్ధి 31, ఇతర శాఖలకు సంబంధించినవి 130 దరఖాస్తులు అందినట్లు అధికారులు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు డా.చిన్నారెడ్డి, ప్రజావాణి ప్రత్యేక అధికారి దివ్య దరఖాస్తులు స్వీకరించారు.

News July 27, 2024

సుంకేసుల బ్యారేజ్ రెండు గేట్లు ఎత్తివేత

image

గద్వాల జిల్లా రాజోలి మండల కేంద్ర సమీపంలో ఉన్న సుంకేసుల బ్యారేజ్ 2 గేట్లు శుక్రవారం సాయంత్రం ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. బ్యారేజీ పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 292 మీటర్లు ఉండగా ప్రస్తుతం 289.70 మీటర్లుగా ఉంది. రెండు గేట్ల ద్వారా 7286 క్యూసెక్కులు, కేసీ కెనాల్‌కు 1.540 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. రేపటికి వరద పెరిగితే మరిన్ని గేట్లు తెరిచే అవకాశం ఉంది.

News July 27, 2024

ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

image

∆} వివిధ శాఖల అధికారులతో ఖమ్మం జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం
∆} ఎర్రుపాలెం వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు
∆} ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కి సెలవు
∆} వైరా నియోజకవర్గంలో ఎమ్మెల్యే రాందాస్ నాయక్ పర్యటన
∆} తల్లాడ మండలంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం
∆} సత్తుపల్లిలో జిల్లా కాంగ్రెస్ నాయకులు మట్టా దయానంద్ పర్యటన

News July 27, 2024

మెదక్: పెరిగిన వరి నాటు కూలీ ధరలు!

image

MDK: వర్షాకాలం పంటలు ప్రారంభం అయ్యాయి. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో నాటు వేసే కూలీలు కూలీ రేట్లు పెంచారు. గతంలో రూ.400 ఉన్న కూలీలు ఇప్పుడు రూ.500 లేదా రూ.550 కూలీకి వస్తున్నారన్నారు. ఇప్పటికే గ్రామాల్లో 50% నాట్లు పూర్తయ్యాయి. కూలీల కొరత ఎక్కువగా ఉండటంతో ఎక్కువ రేట్లతో కూలీలను తీసుకుపోతున్నారు. నిత్యావసర వస్తువుల ధరలు పెరగడమే దీనికి ముఖ్య కారణం అని వారు చెబుతున్నారు.

News July 27, 2024

పిట్లం: దిగొచ్చిన టమాట ధర @ రూ.25

image

మొన్నటి వరకు కిలో రూ.100 ఉండి సామాన్యుడికి భారంగా మారిన టమాటా ధర ఒక్కసారిగా పడిపోయింది. పిట్లంలో శుక్రవారం జరిగిన వారాంతపు సంతలో టమాటా ధర కిలో రూ.25 పలికింది. దీంతో ప్రజలకు కాస్త ఊరట లభించింది. టమాటతో పాటు ఇతర కూరగాయల ధరలు కూడా కాస్త తగ్గుముఖం పట్టాయి.

News July 27, 2024

నీరు లేక బోసిపోతున్న LMD

image

ఏఎండీలో 24 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యానికి కేవలం 5 టీఎంసీల నీటి నిల్వే ఉంది. గతేడాది ఇదే నెలలో ఎల్ఎండీ పరిధిలో భారీ వర్షాలు పడ్డాయి. ఎగువ ప్రాంతాల నుంచి మిడ్ మానేరు ప్రాజెక్టుకు కూడా భారీగా వరద రావడంతో మిడ్ మానేరు నుంచి 1.10 లక్షల క్యూసెక్కులు, నదీ పరివాహక ప్రాంతం నుంచి దాదాపు 90 వేల క్యూసెక్కుల నీరు చేరింది. ప్రస్తుతం డ్యాంలో నీరు లేక రైతులు ఆందోళన చెందుతున్నారు.

News July 27, 2024

HYD: RRR ఉత్తర భాగానికి NH-161AA నంబర్!

image

HYD నగర శివారు RRR ఉత్తర భాగానికి రాష్ట్రంలోని NHAI సంస్థ NH-161AA నంబరును తాత్కాలికంగా కేటాయించినట్లు తెలిపింది. RRR ఉత్తరభాగం సంగారెడ్డి, నర్సాపూర్, తూప్రాన్, జగదేవ్‌పూర్, ప్రజ్ఞాపూర్, గజ్వేల్, భువనగిరి మీదుగా చౌటుప్పల్ వరకు ఆరు ప్యాకేజీల్లో 161KM మేర కొనసాగునుంది. దక్షిణ భాగం చౌటుప్పల్ నుంచి ఆమనగల్, షాద్‌నగర్, చేవెళ్ల మీదుగా సంగారెడ్డి వరకు 189KM నిర్మాణం కానుంది.

News July 27, 2024

NLG: ఆయకట్టులో చిగురిస్తున్న ఆశలు!

image

నాగార్జునసాగర్ ఆయకట్టు రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. మహారాష్ట్ర, కర్ణాటకలో కురుస్తున్న వర్షాలతో కృష్ణానది జలకళను సంతరించుకుంది. సాగర్ ఎగువన ఉన్న ఆల్మట్టి, తుంగభద్ర జలాశయాల నుంచి శ్రీశైలానికి వరద వస్తోంది. శ్రీశైలం గరిష్ఠ నీటిమట్టం 885.00 అడుగులు కాగా ప్రస్తుతం 860.40 అడుగులుగా ఉంది. రెండు రోజుల్లో శ్రీశైలం జలాశయం గేట్లు ఎత్తే అవకాశం ఉంటుందని అధికారులు తెలిపారు.

News July 27, 2024

పెరుగుతున్న గోదావరి వరద.. రాకపోకలు బంద్

image

వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుడడంతో వెంకటాపురం మండలంలో గోదావరి వరద పెరుగుతోంది. శుక్రవారం రాత్రి మండల పరిధిలోని బోధాపురం బ్రిడ్జి పైకి, వీరభద్రవరం గ్రామ సమీపంలోని కుక్కతోగు వాగు వద్ద గోదావరి వరద నీరు రోడ్లపైకి చేరాయి. దీంతో చర్ల, వెంకటాపురం మండలాల మధ్య రాకపోకలు నిలిచిపోయినట్లు స్థానికులు తెలిపారు.