Telangana

News July 27, 2024

షాద్‌నగర్: విద్యుత్ శాఖ ఉన్నతాధికారిపై వేటు

image

షాద్‌నగర్ ట్రాన్స్ కో డిపార్ట్‌మెంట్‌లో గ్రేడ్ 2 ఉద్యోగి ఆర్టిజన్ ప్రభాకర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు పడింది. ఫరూక్ నగర్ మండలం వెలిజర్ల యూనిట్‌లో పనిచేస్తున్న ప్రభాకర్ రెడ్డి విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. వినియోగదారుల వద్ద డబ్బులు తీసుకుని వాటిని శాఖకు చెల్లించకపోవడం, నిధులు దుర్వినియోగం చేయడంపై చర్యలు తీసుకున్నారు.

News July 27, 2024

98% చర్లపల్లి రైల్వే స్టేషన్ పనులు పూర్తి: కిషన్ రెడ్డి

image

HYD చర్లపల్లి రైల్వే స్టేషన్ నిర్మాణ పనులు 98 శాతం పూర్తయ్యాయని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. రూ.434 కోట్ల వ్యయంతో నిర్మితమవుతున్న ఈ స్టేషన్ రాష్ట్రంలోనే నాలుగో అతి పెద్ద రైల్వే స్టేషన్‌గా అవతరించబోతుందని వెల్లడించారు. కానీ.. ఎప్పుడు ప్రారంభిస్తారో చెప్పలేదు. దీంతో ఈ విషయం మరోసారి చర్చనీయాంశంగా మారింది.

HYD: RRR ఉత్తర భాగానికి NH-161AA నంబర్!

image

HYD నగర శివారు RRR ఉత్తర భాగానికి రాష్ట్రంలోని NHAI సంస్థ NH-161AA నంబరును తాత్కాలికంగా కేటాయించినట్లు తెలిపింది. RRR ఉత్తరభాగం సంగారెడ్డి, నర్సాపూర్, తూప్రాన్, జగదేవ్‌పూర్, ప్రజ్ఞాపూర్, గజ్వేల్, భువనగిరి మీదుగా చౌటుప్పల్ వరకు ఆరు ప్యాకేజీల్లో 161KM మేర కొనసాగునుంది. దక్షిణ భాగం చౌటుప్పల్ నుంచి ఆమనగల్, షాద్‌నగర్, చేవెళ్ల మీదుగా సంగారెడ్డి వరకు 189KM నిర్మాణం కానుంది.

News July 27, 2024

గ్రేటర్ HYD పరిధిలో మ్యాన్ హోల్ లెక్కలు

image

గ్రేటర్ లోతైన మ్యాన్ హోల్స్ 63 వేలకు పైచిలుకు ఉన్నట్లు అధికారిక యంత్రాంగం వెల్లడించింది.HYD పరిధిలో మొత్తం సీవరేజ్ లైన్ వ్యవస్థ 5,767 కిలోమీటర్ల మేర ఉంది. నగర శివారు మున్సిపాలిటీల్లో సుమారుగా 4,200 కిలోమీటర్ల వ్యవస్థ ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా మొత్తంగా 6,34,919 మాన్ హోల్స్ ఉన్నాయి.

News July 27, 2024

HYD: జీరో అవర్‌లో ఫిర్యాదు చేస్తే.. డబ్బు సేఫ్

image

సైబర్ నేరాన్ని గుర్తించి వెంటనే జీరో అవర్‌లో ఫిర్యాదు చేస్తే డబ్బులు సేఫ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని HYD సైబర్ క్రైమ్ పోలీసులు తెలిపారు. ఇటీవల జీరో అవర్‌లో అందిన ఫిర్యాదుల్లో మొత్తం 5 కేసుల్లో రూ. 46 లక్షలకు పైగా వాపస్ చేశారు. 1930, సైబర్ క్రైమ్ పోర్టల్, సైబర్ PSకు ఫిర్యాదు చేస్తే వెంటనే బ్యాంకుల్లో డబ్బులు సీజ్ చేసి, తగిన చర్యలు తీసుకుంటారని తెలిపారు.

News July 27, 2024

గ్రేటర్ HYD పరిధిలో మ్యాన్ హోల్ లెక్కలు

image

గ్రేటర్ లోతైన మ్యాన్ హోల్స్ 63 వేలకు పైచిలుకు ఉన్నట్లు అధికారిక యంత్రాంగం వెల్లడించింది.HYD పరిధిలో మొత్తం సీవరేజ్ లైన్ వ్యవస్థ 5,767 కిలోమీటర్ల మేర ఉంది. నగర శివారు మున్సిపాలిటీల్లో సుమారుగా 4,200 కిలోమీటర్ల వ్యవస్థ ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా మొత్తంగా 6,34,919 మాన్ హోల్స్ ఉన్నాయి.

News July 27, 2024

MBNR: స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు ఊరట

image

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ZPTCలు, MPTCలు, సర్పంచులుగా పనిచేసిన వారికి గౌరవ వేతనాలు కొన్ని నెలల పాటు అందలేదు. గౌరవ వేతనాల కోసం ప్రభుత్వం బడ్జెట్‌లో నిధులను కేటాయించడంతో ఇటీవలనే పదవీ విరమణ చేసిన స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులకు ఉపశమనం కలగనుంది. గతంలో వివిధ అభివృద్ధి పనులు చేసినప్పటికీ వారికి బిల్లులు అందక తీవ్ర ఇబ్బందులు పడుతూ వచ్చారు. ప్రస్తుతం బడ్జెట్‌లో ఆ నిధులు కేటాయించడంతో వారికి ఊరట లభించింది.

News July 27, 2024

HYD: త్వరలో రెడ్ కేటగిరీ పరిశ్రమల PCB రిపోర్ట్!

image

రాష్ట్ర పొల్యూషన్ కంట్రోల్ బోర్డు(PCB) పరిశ్రమల్లో విడుదలయ్యే కాలుష్య ఉద్గారాలకు చెక్ పెట్టటం కోసం ప్రతినెలా రెడ్ కేటగిరీ పరిశ్రమల్లో తనిఖీలు చేస్తోంది. జులైకి సంబంధించి తనిఖీ చేయాల్సిన 26 పరిశ్రమలు రాజధాని పరిధిలోనే ఉండగా..వాటిల్లో ప్రభుత్వ పరిశ్రమలు కూడా ఉన్నాయి. మల్కాజ్గిరి-15, HYD-5, RR-6 పరిశ్రమల్లో తనిఖీ జరగనుంది. త్వరలోనే రిపోర్టు విడుదల చేయనున్నట్లుగా అధికారులు తెలిపారు.