Telangana

News July 27, 2024

నేరస్థులు తప్పు చేయాలంటే భయపడాలి: ఎస్పీ ఉదయ్

image

పాపన్నపేట: నేరస్థులు తప్పు చేయాలంటే భయపడాలని జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి అన్నారు. శుక్రవారం పాపన్నపేట పోలీస్ స్టేషన్ తనిఖీ చేసిన ఆయన సిబ్బందికి పలు సూచనలు చేశారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి ధైర్యం నింపాలన్నారు. ముఖ్యంగా డయల్ 100 వ్యవస్థపై ప్రజలకు క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించాలని సూచించారు.

News July 27, 2024

MBNR: ‘ఆర్టీసీ అభ్యున్నతికి ఉద్యోగులు కృషి చేయాలి’

image

ఆర్టీసీ అభ్యున్నతి కోసం ఉద్యోగులు కృషి చేయాలని TGSRTC హైదరాబాద్ జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పురుషోత్తం పిలుపునిచ్చారు. శుక్రవారం మహబూబ్‌నగర్ విజయం పరిధిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ఉద్యోగులకు ప్రతిభ ప్రగతి పురస్కారాలు అందజేశారు. రీజియన్ పరిధిలోని దాదాపు 50 మంది ఉద్యోగులకు ప్రశంసా పత్రాలు నగదు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ఆర్ఎం శ్రీదేవి, డీఎం సుజాత పాల్గొన్నారు.

News July 27, 2024

ఉమ్మడి జిల్లాలో గ్యాస్ కనెక్షన్ల వివరాలు..

image

ఉమ్మడి జిల్లాలో మొత్తం 9.37 లక్షల బీపీఎల్ గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. ప్రస్తుతం తెల్లరేషన్ కార్డు ఉన్నవారికే రూ.500కె గ్యాస్ సిలిండర్ పథకం అమలు చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో సుమారు 7 లక్షల మందికిపైగా ఈ పథకం ద్వారా లబ్ధి పొందనున్నారు. జిల్లాల వారీగా బీపీఎల్ గ్యాస్ కనెక్షన్ల వివరాలిలా..
మహబూబ్‌నగర్ – 2,40,693
నారాయణపేట – 1,40,217
నాగర్ కర్నూల్ – 2,38,954
వనపర్తి – 1,57,390
జోగులాంబ గద్వాల – 1,60,654.

News July 27, 2024

100% గర్భిణీ స్త్రీల ఏఎన్సీ రిజిస్ట్రేషన్ చేయాలి: కలెక్టర్

image

పెద్దపల్లి జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రసవాల సంఖ్య పెరిగే విధంగా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు. పెద్దపల్లి పట్టణంలో ఉన్న 100 పడకల మాతా శిశు సంరక్షణ ఆరోగ్య కేంద్రం ద్వారా గర్భిణీ స్త్రీలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించాలన్నారు. ఆసుపత్రిలో ప్రసవాల సంఖ్య పెరగాలని సూచించారు. 100% ఏఎన్సీ రిజిస్ట్రేషన్ చేయాలని తెలిపారు.

News July 27, 2024

సీఈఐఆర్ పోర్టల్ సేవలు వినియోగించుకోండి: ఎస్పీ

image

సెల్ ఫోన్ పోగొట్టుకున్న, దొంగలించబడిన సీఈఐఆర్ పోర్టల్‌లో ఫిర్యాదు చేయాలని సంగారెడ్డి ఎస్పీ రూపేష్ తెలిపారు. సెల్ ఫోన్ రికవరీ కోసం ప్రత్యేక టీంను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఎవరైనా సెకండ్ హ్యాండ్ ఫోన్ కొనుగోలు చేస్తే సంబంధిత దుకాణ యజమాని నుంచి రసీదు తీసుకోవాలని సూచించారు. దొంగలించిన సెల్ ఫోన్లు కొనుగోలు చేస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.

News July 27, 2024

మరికల్: అయిల్ పామ్ తోటలతో అధిక లాభాలు: కలెక్టర్ సిక్తా

image

అయిల్ పామ్ తోటలు పెంచడం ద్వారా రైతులు అధిక లాభాలు పొందవచ్చని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. శుక్రవారం మరికల్ మండలం కన్మనూర్ గ్రామంలో రైతు మోహన్ రెడ్డి సాగు చేస్తున్న అయిల్ పామ్ తోటలను పరిశీలించారు. తోటల యాజమాన్య పద్ధతులు, దిగుబడి రైతును అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో మాట్లాడారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం పొందవచ్చని, తోటలు పెంచేందుకు ముందుకు రావాలన్నారు.

News July 27, 2024

గంట వ్యవధిలో పోగొట్టుకున్న నగదు ఫ్రీజ్: సీపీ

image

ఖమ్మం: సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయినట్లు గుర్తించి గంటలో ఫిర్యాదు చేయడం వల్ల బాధితులకు మరింత మేలు జరుగుతుందని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ అన్నారు. ఖమ్మం నగరానికి చెందిన ఓ యువతి సైబర్ నేరగాళ్ల బారినపడి లక్షల రూపాయల నగదును పోగొట్టుకుందని చెప్పారు. వెంటనే యువతి 1930 కు కాల్ చేయడంతో గంటల వ్యవధిలోనే ఆ నగదును ఫ్రీజ్ చేయడం జరిగిందని పేర్కొన్నారు. సైబర్ నేరస్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు.

News July 27, 2024

నిర్మల్: అంగన్వాడీ కేంద్రాలను సమర్థవంతంగా నిర్వహించాలి: కలెక్టర్

image

అంగన్వాడీ కేంద్రాలను సమర్థవంతంగా నిర్వహించాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్ సమావేశ మందిరంలో మహిళా, శిశు సంక్షేమం, వైద్యారోగ్యశాఖల అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశం ఆమె పాల్గొన్నారు. అంగన్వాడీ కేంద్రాలను సమర్థవంతంగా నిర్వహించాలన్నారు. చిన్నారులకు, బాలింతలకు, గర్భిణులకు నాణ్యమైన పోషకాహారాన్ని అందించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు.

News July 27, 2024

NZB: పారిశుద్ధ్య పనులపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలి: కలెక్టర్

image

వర్షాకాలం కావడంతో సీజనల్ వ్యాధులు ప్రబలేందుకు ఎక్కువ ఆస్కారం ఉందని, అందుకే పారిశుద్ధ్య పనులపై ప్రత్యేక దృష్టి సారించాలని నిజామాబాద్ కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులను శుక్రవారం ఆదేశించారు. అలాగే అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ఆధ్వర్యంలో ఆయా ప్రభుత్వబడుల్లో కొనసాగుతున్న పనులను వేగవంతంగా పూర్తిచేయాలని సూచించారు.

News July 26, 2024

ఉమ్మడి జిల్లాలో నేటి క్రైమ్ న్యూస్

image

> MLG: సారలమ్మ పూజారి మృతి
> MHBD: తోడేళ్లగూడెంలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరికి గాయాలు
> WGL: శతాధిక వృద్ధురాలు మృతి
> WGL: సూసైడ్ చేసుకున్న ఉపాధ్యాయుడు
> MHBD: సైబర్ నేరాల పట్ల విద్యార్థులకు అవగాహన సదస్సు
> MHBD: భర్త మరణాన్ని తట్టుకోలేక భార్య మృతి
> WGL: రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్