Telangana

News April 2, 2024

ఉమ్మడి పాలమూరుకు ఆరెంజ్ అలర్ట్

image

ఉమ్మడి జిల్లాలో వాతావరణం రోజురోజుకూ పెరుగుతుంది. అధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో ఈ నెల 1 నుంచి 5 వరకు ఉమ్మడి పాలమూరులోని వనపర్తి, నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్, గద్వాల, నారాయణపేట జిల్లాల్లో 44 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఉమ్మడి జిల్లా ప్రజలకు వడదెబ్బ ముప్పు పొంచి ఉందని, పలు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

News April 2, 2024

వరంగల్ ఎంపీగా పోటీ చేస్తా: రసమయి

image

మానుకొండూరు మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై మండిపడ్డ ఆయన.. బీఆర్ఎస్‌ను వీడిన వారు KCRపై బురద చల్లడం సరికాదని మండి పడ్డారు. కడియం దళితులపై లేని పోని కుట్రలు చేశారని ఆరోపించారు. బీఆర్ఎస్ ఆదేశిస్తే వరంగల్ ఎంపీగా పోటీ చేస్తానని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కడియం పార్టీ మారడం సరికాదన్నారు.

News April 2, 2024

మహబూబ్‌నగర్ జిల్లాకు ఆరెంజ్ అలర్ట్

image

ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా ఎండలు దంచికొడుతున్నాయి. ఉదయం నుంచే ఉక్కపోత మొదలవుతుంది. రాబోయే 5 రోజుల పాటు మరింత తీవ్రంగా ఉష్ణోగ్రతలు ఉంటాయని ఐఎండీ తెలిపింది. నేటి నుంచి పలు జిల్లాలకు ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఉమ్మడి జిల్లాలో మహబూబ్ నగర్, నారాయణపేట, వనపర్తి, గద్వాల, నాగర్ కర్నూల్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది.

News April 2, 2024

హైదరాబాద్ నగరానికి గండిపేట నీళ్లు..!

image

HYDలో తాగునీటి సమస్య తీర్చేందుకు హిమాయత్ సాగర్, గండిపేట జంట జలాశయాల నుంచి నీటి సరఫరాకు ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు కృష్ణా, గోదావరి జలాలను మాత్రమే నగరంలో సరఫరా చేశారు. జంట జలాశయాల నుంచి తరలించిన నీటిని శుద్ధి చేసి సరఫరా చేయడానికి ఏర్పాట్లు చేయాలని పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దానకిశోర్ జలమండలి అధికారులను ఆదేశించారు.

News April 2, 2024

హైదరాబాద్ నగరానికి గండిపేట నీళ్లు..!

image

HYDలో తాగునీటి సమస్య తీర్చేందుకు హిమాయత్ సాగర్, గండిపేట జంట జలాశయాల నుంచి నీటి సరఫరాకు ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు కృష్ణా, గోదావరి జలాలను మాత్రమే నగరంలో సరఫరా చేశారు. జంట జలాశయాల నుంచి తరలించిన నీటిని శుద్ధి చేసి సరఫరా చేయడానికి ఏర్పాట్లు చేయాలని పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దానకిశోర్ జలమండలి అధికారులను ఆదేశించారు.

News April 2, 2024

ఆర్మూర్ డివిజన్ పరిధిలోని చెక్ పోస్టుల వద్ద తనిఖీలు

image

నిజామాబాద్ లోక్ సభ నియోజకవర్గ పరిధిలోని ఆర్మూర్ డివిజన్లో పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఆర్మూర్ డివిజన్లోని కమ్మర్ పల్లి – అంతర్ జిల్లా చెక్ పోస్ట్, దూద్గాం – అంతర్ జిల్లా చెక్ పోస్ట్, తల్వేదా – అంతర్ జిల్లా చెక్ పోస్ట్, భీంగల్ – SST చెక్ పోస్ట్ పరిధిలో SST& పోలీస్ సిబ్బంది విస్తృతంగా వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ తనిఖీలలో సిబ్బంది పాల్గొన్నారు.

News April 2, 2024

దళిత బంధు యూనిట్లు అమ్మితే కఠిన చర్యలు: కలెక్టర్

image

చింతకాని మండలం నందు 25 గ్రామ పంచాయతీలకు దళిత బంధు పథకం ద్వారా మంజూరైన యూనిట్లు వివిధ వాహనాలు ఇతరులకు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ గౌతమ్ అన్నారు. లబ్ధిదారుని వివరాలను సేకరించి సంబంధితులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ గౌతం సోమవారం ఒక ప్రకటనలో తెలియజేశారు.

News April 2, 2024

మంచిర్యాల: ఆల్ టైం రికార్డ్ సాధించిన సింగరేణి

image

సింగరేణి సంస్థ నిర్దేశించిన ఉత్పత్తి లక్ష్యం సాధించి ఆల్ టైం రికార్డ్ ఆర్థిక సంవత్సరానికి బొగ్గు ఉత్పత్తి లక్ష్యం 70.02 మిలియన్ టన్నులు సాధించడంతోపాటు అదే స్థాయిలో 69.86లక్షల టన్నుల బొగ్గు రవాణా చేసి రికార్డు సృష్టించింది. ఈ సందర్భంగా INTUC సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్ సంస్థ C&MD బలరాం నాయక్ ను శాలువాతో సన్మానించి అభినందనలు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమర్థవంతమైన అధికారిని నియమించారన్నారు.

News April 2, 2024

NLG: 3 నుంచి ‘ పది ‘ జవాబుపత్రాల మూల్యాంకనం

image

ఉమ్మడి నల్గొండ జిల్లాలో పదో తరగతి ప్రధాన పరీక్షలు ముగిశాయి. దీంతో జవాబు పత్రాల మూల్యాంకనానికి చకచకా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఏప్రిల్ 3 నుంచి 11వ తేదీ వరకు జవాబు పత్రాల మూల్యాంకనం చేసేందుకు విద్యా శాఖ సన్నద్ధమవుతుంది. ఇందు కోసం నల్గొండ జిల్లా కేంద్రంలోని లిటిల్ ఫ్లవర్ ఉన్నత పాఠశాలలో మూల్యాంకన కేంద్రం ఏర్పాటు చేశారు. అందుకు అవసరమైన చర్యలు చేపట్టారు.

News April 1, 2024

తాండూరులో బాల్యవివాహం.. అడ్డుకున్న పోలీసులు

image

వయస్సు నిండకుండా చేస్తున్న బాల్య వివాహాన్ని అడ్డుకున్నట్టు ఎస్ఐ విఠల్ రెడ్డి సోమవారం తెలిపారు. తాండూరు మండలంలోని కోటబాస్పల్లికి చెందిన అబ్బాయితో కర్ణాటకలోని మిర్యాన్ గ్రామానికి చెందిన అమ్మాయితో సోమవారం వివాహం జరిపించేందుకు నిర్ణయించారు. బాల్య వివాహాం కావడంతో పోలీసులకు సమాచారం అందింది. ఈ మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఇరుకుటుంబ సభ్యులకు కౌన్సిలింగ్ ఇచ్చారు.