Telangana

News July 26, 2024

MBNR: జిల్లా వ్యాప్తంగా 16,913 కిలోల బెల్లం పట్టివేత

image

కర్ణాటక నుంచి పెద్ద మొత్తంలో రాష్ట్రానికి బెల్లం రవాణా అవుతున్న విషయాన్ని ప్రభుత్వం సీరియస్ గా తీసుకొని ఆఫీసర్లను అలర్ట్ చేసిన విషయం తెలిసిందే. దీంతో వారు పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో తనిఖీలు చేస్తున్నారు. అయితే మే 18 నుంచి ఈనెల 11 వరకు ఉమ్మడి జిల్లాలో 16,913 కిలోల బెల్లం పట్టుకున్నట్లు అధికారులు తెలిపారు. 400 కిలోల పటికను పట్టుకోగా, ఈ కేసుల్లో 38 వెహికల్స్ సీజ్ చేశారు.

News July 26, 2024

అందోల్: 317 జీవోపై క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశం

image

317 జీవోపై ఏర్పాటైన క్యాబినెట్ సబ్ కమిటీ వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అధ్యక్షతన సచివాలయంలో సమావేశం అయ్యింది. గతంలో తీసుకున్న నిర్ణయాల మేరకు పూర్తిస్థాయిలో విచారణ చేసి నివేదిక అందజేయాలని కమిటీ నిర్ణయించింది. ఎవరికైతే 317 జీవోలో అన్యాయం జరిగిందో వారికి న్యాయం చేయాలనే సంకల్పంతో వారిని గుర్తించి వారి వివరాలను త్వరలో కమిటీకి అందజేయాలని అధికారులకు సూచించారు.

News July 26, 2024

BREAKING.. KNR: గురుకులంలో విద్యార్థులకు అస్వస్థత

image

పెద్దాపూర్ <<13712552>>గురుకుల విద్యార్థి<<>> నేడు మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే పాఠశాలలో ఒకే రూంలో పడుకున్న ముగ్గురు విద్యార్థులకు పాము కాటు వేసిందని కుటుంబీకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఒక విద్యార్థి గుణాధిత్య మృతి చెందగా.. మరో ఇద్దరు గణేశ్, హర్ష వర్ధన్‌లు అస్వస్థతకుగురై పరిస్థితి విషమించడంతో NZB ప్రభుత్వాసుపత్రికి తరలించారు. విషయాన్ని దాచిపెట్టారంటూ స్కూల్ ప్రిన్సిపల్‌పై పలువురు విమర్శిస్తున్నారు.

News July 26, 2024

లక్ష్యం మేరకు ప్రాపర్టీ ట్యాక్స్ వసూలు చేయాలి: కమిషనర్

image

లక్ష్యం మేరకు ప్రాపర్టీ ట్యాక్స్ వసూలుకు చర్యలు తీసుకోవాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి తెలిపారు. శుక్రవారం జోనల్ అడిషనల్ కమిషనర్లతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. సీఆర్ఎంపీ ద్వారా చేపట్టిన రోడ్లకు సంబంధించిన ఏజెన్సీలతో చేసుకున్న అగ్రిమెంట్ డిసెంబర్ వరకు గడువు ఉన్నందున పెండింగ్‌లో ఉన్న మెయింటెనెన్స్ పనులు వెంటనే పూర్తి చేయించాలని జోనల్ కమిషనర్లను ఆదేశించారు. అవసరమైతే సమీక్షలు నిర్వహించాలన్నారు.

News July 26, 2024

సంగారెడ్డి: 28న ఉమ్మడి జిల్లా క్రికెట్ ఎంపికలు

image

ఉమ్మడి మెదక్ జిల్లా క్రికెట్ అండర్16 ఎంపికలు ఈనెల 28న జూబ్లీ క్లబ్ లో నిర్వహిస్తున్నట్లు జిల్లా కార్యదర్శి రాజేందర్ రెడ్డి శుక్రవారం తెలిపారు. 1-9-2008 నుంచి 31-8-2010 మధ్య జన్మించిన వారు అర్హులని చెప్పారు. ఆధార్ కార్డు, బోనాఫైడ్, జనన ధ్రువీకరణ పత్రం, 2 పాస్ పోర్ట్ సైజ్ ఫోటోలతో ఉదయం 10 గంటలకు హాజరుకావాలని సూచించారు.

News July 26, 2024

ఉమ్మడి జిల్లాలో నేటి ముఖ్య వార్తలు

image

✏ప్రజలే బీఆర్ఎస్ పార్టీని చీల్చి చెండాడారు: మంత్రి జూపల్లి
✏జూరాలలో కొనసాగుతున్న వరద.. 47 గేట్లు ఎత్తివేత
✏CM సభా స్థలిని పరిశీలించిన ఎమ్మెల్యే కసిరెడ్డి,కలెక్టర్
✏NGKL: ట్రాక్టర్ బోల్తా పడి రైతు మృతి
✏రేపు గురుకులాల్లో ఇంటర్ ప్రవేశాలకు స్పాట్ అడ్మిషన్స్
✏దౌల్తాబాద్: కరెంట్ షాక్‌తో వ్యక్తి మృతి
✏NGKL,WNPT జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ
✏ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించండి: హర్షవర్ధన్ రెడ్డి

News July 26, 2024

MHBD: మంత్రిని కలిసిన ఎమ్మెల్యేలు

image

తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డిని డోర్నకల్, వర్ధన్నపేట ఎమ్మెల్యేలు రామచంద్రనాయక్, నాగరాజు మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయా నియోజకవర్గాల్లో ప్రాజెక్టులు, చెక్ డ్యాములు, ఆనకట్టల నిర్మాణానికి సంబంధించిన అంశాలపై మంత్రితో ఎమ్మెల్యేలు చర్చించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు.

News July 26, 2024

మా మీద కోపం రైతుల మీద చూపించకండి: కౌశిక్ రెడ్డి

image

కాంగ్రెస్ ప్రభుత్వానికి కేసిఆర్, కేటీఆర్, మా అందరిపై కోపం ఉంటే మా మీదే చూపించాలి తప్ప.. రైతుల మీద కాదని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. మేడిగడ్డ బ్యారేజీని ఎమ్మెల్యే సందర్శించి మాట్లాడారు. కాళేశ్వరంలోని లక్ష్మి పంప్ హౌస్ ఆన్ చేసి రైతులకు నీళ్లు అందించాలని.. లేనట్లయితే రైతులతో కలిసివచ్చి మేమే ఆన్ చేస్తామన్నారు. రైతుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

News July 26, 2024

మాజీ మంత్రి ఎర్రబెల్లి సన్నిహితుడు BRSకు రాజీనామా

image

మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు అత్యంత సన్నిహితుడు, దళిత రత్న అవార్డు గ్రహీత, రూరల్ డెవలప్‌మెంట్ స్టేట్ డైరెక్టర్ అందె యాకయ్య నేడు BRSకు రాజీనామా చేశారు. త్వరలో సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్‌లో చేరబోతున్నట్లు వారు తెలిపారు. గత పదేళ్లలో బీఆర్ఎస్ తన కష్టాన్ని గుర్తించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అగ్రకులాలకు మాత్రమే బీఆర్ఎస్ పెద్దపీట వేసిందని ఆరోపించారు.

News July 26, 2024

ప్రజలే బీఆర్ఎస్ పార్టీని చీల్చి చెండాడారు: మంత్రి జూపల్లి

image

బడ్జెట్‌ను చీల్చి చెండాడుతామంటూ మాజీ సీఎం కేసీఆర్ వ్యాఖ్యలకు మంత్రి జూపల్లి కృష్ణారావు శుక్రవారం ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలే బీఆర్ఎస్ పార్టీని చీల్చి చెండాడారని.. పార్లమెంటు ఎన్నికల్లో గుండు సున్నాకే పరిమితమయ్యారని ధ్వజమెత్తారు. అంబేడ్కర్ రాసిన రాజ్యాంగం అంటే కేసీఆర్‌కు గౌరవం లేదని, ప్రజాస్వామ్యాన్ని చులకనగా చూస్తున్నారని విమర్శించారు.