Telangana

News July 26, 2024

ADB: కట్నం విషయంలో భార్యను వేధించాడు.. చివరికి

image

అదనపు కట్నం విషయంలో భార్యను వేధించిన కేసులో నిందితుడికి ఆరు నెలల జైలు శిక్ష, రూ.2వేల జరిమానాను విధిస్తూ ఆదిలాబాద్ ఫస్ట్ క్లాస్ న్యాయస్థానం తీర్పునిచ్చింది. 2017 మార్చి నెలలో ఓ బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు తలమడుగు PSలో కేసు నమోదు చేశారు. ఈ కేసులో 7గురు సాక్షులను ప్రవేశపెట్టగా నేరం రుజువైంది. ఈ నేపథ్యంలో తలమడుగు మండలం సుంకిడి గ్రామానికి చెందిన నిందితుడు లచ్చన్నకు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చారు.

News July 26, 2024

పాలమూరుకు వాతావరణ శాఖ అలర్ట్..

image

ఉమ్మడి జిల్లాలోని పలు ప్రాంతాల్లో మరో 3 గంటల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. మహబూబ్‌నగర్, వనపర్తి, నాగర్ కర్నూల్, గద్వాల, నారాయణపేటలో వర్షాలు కురుస్తాయని అధికారులు వివరించారు. కాగా నాగర్ కర్నూల్, వనపర్తి జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇందులో భాగంగా 40కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది.

News July 26, 2024

కొడంగల్: కరెంట్ షాక్‌తో వ్యక్తి మృతి

image

దౌల్తాబాద్ మండలం బిచ్చాల గ్రామానికి చెందిన అంజిలప్ప(47) కరెంట్ షాక్‌తో వ్యక్తి మృతి చెందాడు. స్థానికుల సమాచారం.. అంజప్ప వ్యవసాయంతో పాటు గ్రామంలో మైనర్ కరెంటు రిపేర్లు చేస్తాడు. ఈ క్రమంలో గ్రామానికి చెందిన కిష్టయ్య ఇంట్లో కరెంటు రాకపోవడంతో రిపేరు చేసేందుకు స్తంభం ఎక్కాడు. షాక్‌కు గురై స్తంభం పైనుంచి కిందపడ్డాడు. చికిత్స కోసం అంజిలప్పను ఆసుపత్రికి తరలించగా మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు.

News July 26, 2024

HYD: మద్యం దుకాణాలు బంద్

image

HYD కమిషనరేట్ పరిధి సౌత్ ఈస్ట్ జోన్, సౌత్ వెస్ట్ జోన్‌లో పాతబస్తీ బోనాల సందర్భంగా ఈ నెల 28 ఉ.6 గంటల నుంచి 29 ఉ.6 గంటల వరకు వైన్స్, బార్లు, రెస్టారెంట్లు, కల్లు దుకాణాలు మూసి ఉంటాయని HYD సీపీ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. HYD కోర్ సిటీ సౌత్ జోన్ ప్రాంతంలో మాత్రం ఈ నెల 28 ఉ.6 నుంచి 30 ఉ.6 వరకు బంద్ కొనసాగుతుందని చెప్పారు.

సేంద్రియ వ్యవసాయంతో రైతులు ఆర్థికాభివృద్ధి

image

సేంద్రియ వ్యవసాయంతో రైతులు ఆర్థికాభివృద్ధి చెందే అవకాశం ఉందని వ్యవసాయ శాస్త్రవేత్త అశోక్ పేర్కొన్నారు. స్పీడ్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో జపానీ యూనివర్సిటీ విద్యార్థులు శుక్రవారం నాగర్ దొడ్డి గ్రామాన్ని సందర్శించి పత్తి పంటను పరిశీలించారు. సేంద్రియ సాగు ఉపయోగాలను విద్యార్థులకు వివరించారు. గతంలో ఆవు పేడ మూత్రంతో పైర్లలో స్ప్రే చేసి అధిక దిగుబడితోపాటు రసాయనాలు లేని పంటలు పండించారని ఆయన చెప్పారు.

News July 26, 2024

అమ్మ ఆదర్శ పాఠశాలల పనులు పూర్తి చేయాలి: కలెక్టర్ ప్రావీణ్య

image

జిల్లాలో అమ్మ ఆదర్శ పాఠశాలల పథకంలో భాగంగా మొదటి దశలో పాఠశాలలకు మంజూరైన పనులను ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని అధికారులను హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో మాట్లాడుతూ.. మండల ప్రత్యేక అధికారులు మొదటి దశలో ఏవైనా పనులు పెండింగ్‌లో ఉన్నది లేనిది తెలుసుకొని వాటిని పూర్తి చేయడానికి చర్యలు తీసుకోవాలన్నారు.

News July 26, 2024

HYD: ఓ వైపు కుక్కలు.. మరోవైపు కామాంధులు..!

image

గ్రేటర్ HYDలో చిన్నారుల ప్రాణాలకు భరోసా లేకుండా పోయిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఓ వైపు కుక్కలు దాడి చేస్తుండగా మరోవైపు కామాంధులు అభంశుభం తెలియని చిన్నారులపై అత్యాచారం చేస్తున్నారు. ఇటీవల పిల్లలపై కుక్కల దాడులు, అత్యాచారాల ఘటనలు పెరిగాయని ఆరోపణలు వస్తున్నాయి. తమ పిల్లలను బయటకు పంపాలంటే భయపడాల్సిన పరిస్థితి ఏర్పడిందని తల్లిదండ్రులు వాపోతున్నారు. చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

సిరిసిల్ల: వీటీడీఏ పనుల్లో వేగం పెంచాలి: కలెక్టర్

image

వేములవాడ టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ(వీటీడీఏ) పనుల్లో వేగం పెంచాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. వీటీడీఏ పనులపై జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని కాన్ఫరెన్స్ హాలులో ఆయా శాఖల అధికారులతో కలెక్టర్ శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వీటీడీఏ పనులు ఎప్పుడు మొదలు పెట్టారు? ఎక్కడి వరకు పూర్తి అయ్యాయో వివరాలు అడిగి తెలుసుకున్నారు.