India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
జాతీయ స్థాయి ఫుట్‌బాల్ టోర్నీలో అద్భుతంగా ఆడి తెలంగాణ పేరు నిలబెట్టాలని రాష్ట్ర ఫుట్బాల్ అసోసియేషన్ కార్యదర్శి ఫాల్గుణ సూచించారు. 15 రోజులుగా సిద్దిపేటలో నిర్వహిస్తున్న ఫుట్‌బాల్ ఎంపిక, శిక్షణ శిభిరం ముగింపు కార్యక్రమంలో శుక్రవారం ఆయన పాల్గొని మాట్లాడారు. సిద్దిపేట ఫుట్‌బాల్ అసోసియేషన్‌కు అభినందనలు తెలిపారు.
వికారాబాద్ రైతుబజార్ దగ్గర ఓ రైతు పరిస్థితి కన్నీరు తెప్పిస్తోంది. కొత్తిమీర మూట తీసుకొని రోడ్డు మీద కూర్చొన్న ఆ పెద్దాయన.. నాలుగు రూపాయలు వస్తాయేమోనని ఆశతో వర్షంలోనే ఉండిపోయాడు. తాను పండించి, తెంపుకొచ్చిన ఆకు కూర వృథా అయితే నష్టపోతానని కష్టమైనా భరించాడు. ఓ వైపు తడుస్తూనే తన చిరు వ్యాపారం కొనసాగించాడు. సదరు రైతుకు కనీసం గొడుగు కూడా లేదు. అతడి కష్టం చూసిన స్థానికులు చలించిపోయారు.
DOST ద్వారా డిగ్రీలో ప్రవేశాలు పొందేందుకు స్పెషల్ ఫేజ్ షెడ్యూల్ విడుదలైంది. స్పెషల్ విడత ద్వారా జులై 25 నుంచి ఆగస్టు 2 వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. జులై 27 నుంచి ఆగస్టు 3వరకు వెబ్ ఆప్షన్లు పెట్టుకోవాలి. ఈ ప్రక్రియ పూర్తి చేసిన వారికి ఆగస్టు 6న సీట్ల కేటాయింపు జరుగుతుంది. సీట్ అలాట్ అయిన వారు ఆగస్టు 7 నుంచి 9 వరకు సెల్ఫ్ రిపోర్ట్ ఇవ్వడానికి అవకాశం కల్పించారు.
>>SHARE IT
మెండోరా మండలం పోచంపాడ్‌లోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతాల నుంచి వరద కొనసాగుతోంది. నేడు మధ్యాహ్నం 3 గంటలకు అందిన సమాచారం మేరకు ప్రాజెక్టులోకి 25,150 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తోందని అధికారులు తెలిపారు. క్రమక్రమంగా శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ నీటిమట్టం పెరుగుతోంది. ప్రస్తుతం ప్రాజెక్టులో 1072.8 అడుగులకు నీటిమట్టం చేరుకోగా.. ప్రాజెక్టులో 28.389 టీఎంసీల వరకు నీరు నిల్వ ఉంది.
నిద్రమాత్రలు మింగి 9వ తరగతి విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన శుక్రవారం ఖమ్మంలో చోటు చేసుకుంది. ముస్తఫానగర్‌లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో 9వ తరగతి చదువుతుంది. పాఠశాల టీచర్స్ వేధింపుల వల్లే విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను పరిష్కరించాలని టిపిసిసి అధికార ప్రతినిధి హర్షవర్ధన్ రెడ్డి.. సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక సలహాదారు వేం నరేందర్ రెడ్డిని కలిసి వినతి పత్రం సమర్పించారు. ఉమ్మడి సర్వీస్ రూల్స్ లేని కారణంగా ఉపాధ్యాయులు పదోన్నతులకు నోచుకోలేక పోతున్నారని వెల్లడించారు. గత ప్రభుత్వం 10 సంవత్సరాల పాటు సర్వీస్ రూల్స్ పట్టించుకోలేదని వెల్లడించారు.
కాళేశ్వరం ప్రాజెక్టులోని లక్ష్మీ పంప్ హౌస్ విద్యుత్ బిల్లుల బకాయిలు రూ.వందల కోట్ల మేర పేరుకుపోయాయి. 2019లో జూన్ 21న లక్ష్మీ పంప్ హౌస్‌లో ఎత్తిపోతలు ప్రారంభించగా.. అప్పటినుంచి ఇప్పటివరకు రూ.492 కోట్లకు పైగా బిల్లు బకాయిలు ఉన్నట్లు విద్యుత్ అధికారులు వెల్లడించారు. లక్ష్మీ పంప్ హౌస్ ప్రారంభం నాటి నుంచి ఇప్పటివరకు 163 టీఎంసీల నీటిని మోటార్ల ద్వారా ఎత్తిపోశారు.
నాగర్‌కర్నూల్ మండలం శ్రీపురం గ్రామంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. అదే గ్రామానికి చెందిన రైతు సింగారపు స్వామి(33) ట్రాక్టర్‌తో తన వ్యవసాయ పొలంలో పనిచేస్తుండగా ప్రమాదవశాత్తూ ట్రాక్టర్ బోల్తాపడింది. ఈ ప్రమాదంలో స్వామి అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇంటి పెద్ద మృతితో ఆ కుటుంబీకులు కన్నీరుమున్నీరువుతున్నారు.
HYD శంషాబాద్‌లో విషాదం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. వెస్ట్ బెంగాల్‌కు చెందిన నారాయణ్, రిమి దంపతులకు 8 నెలల కుమారుడు ఉన్నాడు. అనారోగ్యంతో ఆ శిశువు బాధపడుతుండడంతో మెరుగైన వైద్యం కోసం పట్నా నుంచి బెంగళూరుకు విమానంలో వెళ్తున్నారు. శిశువు అస్వస్థతకు గురికాగా శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో అత్యవసర ల్యాండింగ్ చేశారు. వైద్యులు పరీక్షించి, అప్పటికే చనిపోయాడని చెప్పడంతో తల్లి బోరున విలపించింది.
HYD శంషాబాద్‌లో విషాదం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. వెస్ట్ బెంగాల్‌కు చెందిన నారాయణ్, రిమి దంపతులకు 8 నెలల కుమారుడు ఉన్నాడు. అనారోగ్యంతో ఆ శిశువు బాధపడుతుండడంతో మెరుగైన వైద్యం కోసం పట్నా నుంచి బెంగళూరుకు విమానంలో వెళ్తున్నారు. శిశువు అస్వస్థతకు గురికాగా శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో అత్యవసర ల్యాండింగ్ చేశారు. వైద్యులు పరీక్షించి, అప్పటికే చనిపోయాడని చెప్పడంతో తల్లి బోరున విలపించింది.
Sorry, no posts matched your criteria.