India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
HYD శంషాబాద్‌లో విషాదం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. వెస్ట్ బెంగాల్‌కు చెందిన నారాయణ్, రిమి దంపతులకు 8 నెలల కుమారుడు ఉన్నాడు. అనారోగ్యంతో ఆ శిశువు బాధపడుతుండడంతో మెరుగైన వైద్యం కోసం పట్నా నుంచి బెంగళూరుకు విమానంలో వెళ్తున్నారు. శిశువు అస్వస్థతకు గురికాగా శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో అత్యవసర ల్యాండింగ్ చేశారు. వైద్యులు పరీక్షించి, అప్పటికే చనిపోయాడని చెప్పడంతో తల్లి బోరున విలపించింది.
ఖమ్మం నగరంలోని ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్న దొంగను అరెస్టు చేసినట్లు టౌన్ ఏసీపి రమణమూర్తి తెలిపారు. సారథినగర్‌లో జరిగిన దొంగతనంపై దర్యాప్తు చేస్తున్న నేపథ్యంలో గాంధీ చౌక్ నందు అనుమానాస్పదంగా తిరుగుతున్న ఉమా శంకర్ ను అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. అతడిని విచారించగా దొంగతనం చేసినట్లు ఒప్పుకున్నాడని పేర్కొన్నారు. అతని వద్ద నుంచి 29 తులాల బంగారాన్ని స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేశామన్నారు.
వరంగల్-కాజీపేట స్టేషన్ల మీదుగా ప్రయాణించే పలు రైళ్లను ఆగస్టు 5 -10వ తేదీ వరకు రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. గోల్కొండ, శాతవాహన రైళ్ళను నిర్మాణ, నిర్వహణ పనుల కారణంగా ఐదు రోజులపాటు రద్దు చేసినట్లు చెప్పారు. కావున ప్రయాణికులు విషయాన్ని గమనించి ప్రత్యామ్నాయ ఏర్పాటు చేసుకోవాలని కోరారు.
విమర్శలు, ప్రతీ విమర్శలు, నియోజకవర్గ అభివృద్ధి పనులంటూ బిజీగా ఉండే మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి కూలీలతో మమేకయ్యారు. వారితో కలిసి నాటు వేశారు. రుణమాఫీ అయిందా అని రైతులను అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యే తమతో కలిసి నాట్లు వేయడం సంతోషంగా ఉందని కూలీలు చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందని బీఎల్ఆర్ తెలిపారు.
మెదక్ జిల్లా రామాయంపేట మండలం తొనిగండ్ల గ్రామ శివారులో చిరుతపులి సంచారంతో రైతులు భయాందోళనకు గురవుతున్నారు. గత రాత్రి గ్రామానికి చెందిన కొత్తగారి రమేశ్ తన వ్యవసాయ పొలం వద్ద పశువును కట్టేసి ఇంటికి వెళ్లారు. అర్ధరాత్రి ఆ పశువుపై చిరుతపులి దాడి చేసి చంపేసింది. ఉదయం పొలం వద్దకు వెళ్లిన రమేశ్ గమనించి ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. జిల్లాలో చిరుత సంచారంతో జనం ఆందోళన చెందుతున్నారు.
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో గతవారం రికార్డు ధర పలికిన మొక్కజొన్న ధరలు ఈ వారం క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. గతవారం క్వింటా మక్కలు రూ.2,780 పలకగా.. ఈ వారం మూడు రోజులు రూ.2,750 పలికాయి. నిన్న కాస్త తగ్గి రూ.2,715 అయిన మొక్కజొన్న నేడు రూ.2705కి తగ్గిందని రైతులు తెలిపారు.
టెక్నికల్ టీచర్స్ సర్టిఫికెట్ లోయర్ గ్రేడ్ పరీక్షకు సంబంధించిన హాల్ టికెట్స్ www.bse.telangana.gov.in వెబ్సైట్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవాలని నిజామాబాద్ జిల్లా విద్యాశాఖ అధికారి దుర్గాప్రసాద్ తెలిపారు. 2024 సంవత్సరానికి సంబంధించి ఆగస్టు 4న ఈ పరీక్ష ఉంటుందన్నారు. ఏమైనా సందేహాలు ఉంటే జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో సంప్రదించాలన్నారు.
దేశంలో చిన్నారులపై లైంగిక వేధింపులు పెరిగాయని లోక్‌సభ భువనగిరి MP చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. చిన్నారుల సంక్షేమంలో 176 దేశాల్లో 113వ స్థానంలో భారత్
నిలవడం శోచనీయమని పేర్కొన్నారు. చిన్నారుల సంక్షేమానికి ప్రభుత్వం తీసుకున్న చర్యలేంటని ప్రశ్నించగా, దీనిపై కేంద్రమంత్రి అన్నపూర్ణ
దేవి స్పందిస్తూ మిషన్ వాత్సల్య యోజన ద్వారా దేశంలో చిన్నారుల హక్కుల పరిరక్షణకు కృషి చేస్తున్నామన్నారు.
చెట్టు మీద పడడంతో జహంగీర్ <<13705294>>మృతి <<>>చెందిన విషయం తెలిసిందే. ఎస్సై తాజుద్దీన్ తెలిపిన వివరాల ప్రకారం.. చిన్నబోయినపల్లి గ్రామానికి చెందిన ఎస్కే జహంగీర్ బీటెక్ చదువుకొని గ్రామంలో మెడికల్ షాప్ నిర్వహిస్తున్నారు. మందుల కోసం ఏటూరునాగారం వెళ్తుండగా చెట్టు కూలి అక్కడికక్కడే మరణించారు. కాగా, ఆగస్టులో జహంగీర్‌కు పెళ్లి చేద్దామని తల్లిదండ్రులు అనుకోగా అంతలోగా విధి చెట్టు రూపంలో కాటేసింది.
భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామివారి దేవస్థానంలో స్వామివారికి శుక్రవారం స్వర్ణ కవచాలంకరణ నిర్వహించారు. ముందుగా ఆలయ తలుపులు తెరిచి స్వామివారికి సుప్రభాత సేవ నిర్వహించారు. అనంతరం ఆరాధన, సేవాకాలం, అభిషేకం నిత్య బలిహరణం, తదితర నిత్య పూజా కార్యక్రమాలు యథావిధిగా జరిపారు. అనంతరం మండపంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై రామయ్య నిత్యకల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు.
Sorry, no posts matched your criteria.