India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
గ్రేటర్ హైదరాబాద్‌లో ఇప్పుడున్న ఛార్జింగ్ స్టేషన్లకు అదనంగా మరో 100 స్టేషన్లను ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. వాహనాల ఛార్జింగ్ స్టేషన్ వివరాలు, వాటి వినియోగం కోసం ప్రత్యేక మొబైల్ యాప్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. సంప్రదాయేతర, కాలుష్య రహిత విద్యుదుత్పత్తికి ప్రాధాన్యమిస్తూ నూతన విద్యుత్ విధానాన్ని తీసుకురానున్నట్లు బడ్జెట్‌లో ప్రభుత్వం వెల్లడించింది.

అనారోగ్యంతో ఐటీడీఏ ఏవో మృతి చెందిన ఘటన భద్రాచలంలో చోటుచేసుకుంది. భద్రాచలం ఐటిడిఏ కార్యాలయంలో ఏవో విధులు నిర్వహిస్తున్న పెందుర్ బీమ్ గత కొన్ని రోజుల నుంచి అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆరోగ్యం విషమించడంతో హైదరాబాదులోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఏవో మృతి పట్ల ఐటిడిఏ ఉద్యోగులు, ఐటిడిఏ పిఓ సంతాపం తెలిపారు.
HYDలోని మెట్రో రైలు రెండోదశలో దూరం, అంచనా వ్యయాలు పెరిగాయి. 5 కారిడార్లలో 70 కి.మీ. దూరం గతంలో ప్రతిపాదించగా ఇప్పుడు అది 8.4 కి.మీ. పెరిగి, 78.4 కి.మీ. అయింది. అంచనా వ్యయం రూ.24,042 కోట్లకు పెరిగింది. ప్రభుత్వం రెండోదశ ప్రతిపాదనలను సమీక్షించి వాటిని సవరించి కొత్త ప్రతిపాదనలను రూపొందించినట్లు ఆర్థిక మంత్రి భట్టి తన బడ్జెట్‌లో ప్రసంగంలో పేర్కొన్నారు.
విధి నిర్వహణలో చర్యలు తీసుకోవడమే కాదు.. ఆపద వస్తే చలించిపోతామని అల్వాల్ ట్రాఫిక్ ACP వెంకటరెడ్డి నిరూపించారు. ఇటీవల సుచిత్ర వద్ద రాంగ్ రూట్‌లో వచ్చే ప్రయాణికులకు ట్రాఫిక్ సిబ్బంది చలానాలు వేస్తున్నారు. ఓ డెలివరీ బాయ్ తప్పించుకునేందుకు హడావుడిగా వెళ్తూ మరో వాహనాన్ని ఢీ కొట్టాడు. ఈ ప్రమాదంలో ఇతర వాహనదారుడు కింద పడిపోయాడు. క్షతగాత్రుడికి ACP సపర్యలు చేశారు. ఆయన సేవల పట్ల ప్రశంసలు వెల్లువెత్తాయి.

ఎకో టూరిజంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఆరు స్పాట్లను ఎంపిక చేయగా అందులో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కవ్వాల్ ఫారెస్ట్‌తో పాటు కుంటాల జలపాతానికి చోటుదక్కింది. కుంటాల జలపాతం వద్ద ట్రైబల్ ఎకో టూరిజం కింద రిసార్ట్ నిర్మాణం, టూరిస్టుల విడిది కోసం వసతి, ఎకో ఫ్రెండ్లీ కార్టెజ్‌లు నిర్మించేందుకు అధికారులు ప్రణాళికలు రూపొందించారు. ITDA PO ద్వారా రూ.3.81లక్షలతో వివిధ పనులు చేపట్టనున్నారు.
HYDలోని మెట్రోరైలు రెండోదశలో దూరం, అంచనా వ్యయాలు పెరిగాయి. 5 కారిడార్లలో 70 కి.మీ. దూరం గతంలో ప్రతిపాదించగా ఇప్పుడు అది 8.4 కి.మీ. పెరిగి, 78.4 కి.మీ. అయింది. అంచనా వ్యయం రూ.24,042 కోట్లకు పెరిగింది. ప్రభుత్వం రెండోదశ ప్రతిపాదనలను సమీక్షించి వాటిని సవరించి కొత్త ప్రతిపాదనలను రూపొందించినట్లు ఆర్థిక మంత్రి భట్టి తన బడ్జెట్‌లో ప్రసంగంలో పేర్కొన్నారు.
గత ప్రభుత్వం NLG, SRPT, యాదాద్రిలో వైద్య కళాశాలలు ఏర్పాటు చేసింది. SRPTలో భవనం పూర్తైనా NLG, యాదాద్రి జిల్లాలో పూర్తి చేయలేదు. ఈ బడ్జెట్‌లో వైద్య రంగానికి రూ.11,468 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. ఈ నిధులతో నల్గొండతో పాటు యాదాద్రిలో వైద్య కళాశాల భవనాల నిర్మాణం పూర్తి చేయనుంది. మరోవైపు జిల్లాలో ప్రతి ఒక్కరికి ప్రత్యేక గుర్తింపు సంఖ్యతో డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ కార్డును జారీ చేయనుంది.
రైతు రుణమాఫీ అంశంపై MLA హరీశ్‌రావు X వేదికగా స్పందించారు. ‘DEC 9న రుణమాఫీ చేస్తామని 7నెలల తర్వాత ప్రక్రియను ప్రారంభించడంతో రైతులకు కొత్త సమస్యలు వస్తున్నాయి. 7నెలల వడ్డీ చెల్లించాకే, రుణ మాఫీ చేస్తామని బ్యాంకర్లు రైతులను వేధిస్తున్నారు. వడ్డీ చెల్లించేందుకు కొత్తగా అప్పులు చేయాల్సి వస్తుంది. శివంపేట్ మం. చెందిన ఓ రైతు క్రాప్ లోన్‌ను, రూ.9వేలు మిత్తి కట్టించుకున్నాకే క్లోజ్ చేశారు’అని అన్నారు.
Sorry, no posts matched your criteria.