Telangana

News April 1, 2024

HYD: దూకుడు పెంచిన మజ్లిస్‌ పార్టీ

image

పార్లమెంట్‌ ఎన్నికల కోసం మజ్లిస్‌ పార్టీ దూకుడు పెంచింది. ఇప్పటికే పాదయాత్రలతో ముందస్తు ప్రచారానికి శ్రీకారం చుట్టిన మజ్లిస్‌ పార్టీ.. రంజాన్‌ మాసం ఇఫ్తార్‌ విందులను సైతం సద్వినియోగం చేసుకుంటోంది. రోజుకో డివిజన్‌లో ఏర్పాటు చేసే ఇఫ్తార్‌ విందులో ఆ పార్టీ అధినేత అసదుద్దీన్‌, ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు హాజరుకావడం మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈసారి సైతం పోలింగ్‌ పెంపుపై దృష్టి సారించింది.

News April 1, 2024

ఎల్లారెడ్డిలో బైక్‌ను ఢీకొన్న ఆర్టీసీ బస్సు

image

ఎల్లారెడ్డి మండలం తిమ్మారెడ్డి వద్ద ఆదివారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో చిలుక సత్యనారాయణ మృతి చెందగా, అతడి కుమారుడు మధు గాయపడినట్లు ఎస్ఐ మహేశ్ తెలిపారు. బోధన్ వైపు వెళ్తున్న బైక్ అదుపు తప్పి బస్సు ఢీకొన్నట్లు పేర్కన్నారు. ఘటనపై సోమవారం కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.

News April 1, 2024

HYD: నోరూరిస్తున్న చీమ చింతకాయలు..!

image

గతంలో చీమచింత కాయలు గ్రామాల్లో విరివిగా దొరికేవి. చెట్టుకున్న చీమచింత కాయలను రాళ్లతో కొట్టి మరీ తినేవాళ్లు. నాటి తీపి జ్ఞాపకాలే వేరు. ఇప్పుడు గ్రామాల్లోనూ కనిపించడం లేదు. కానీ HYDలోని ఉస్మానియా యూనివర్సిటీ రహదారి, ఉప్పల్ చెరువు కట్ట, ఎల్బీనగర్ ప్రధాన రహదారుల్లో తోపుడు బండ్లపై చీమచింత కాయలు చూస్తుంటే నోరూరుతుందని, చీమ చింతకాయలు కొనుక్కొని మరీ పలువురు రుచి చూస్తున్నారు.

మహబూబ్‌నగర్ జిల్లాలో భానుడి ప్రతాపం

image

ఉమ్మడి జిల్లాలో మార్చి నెలాఖరు నాటికే ఎండలు తీవ్రమయ్యాయి. ఉదయం 9 దాటితే బయటికి రాలేని పరిస్థితులు ఉన్నాయి. ఉమ్మడి జిల్లాలో వారం రోజులుగా 41.8 డిగ్రీల వరకు ఎండ తీవ్రత రికార్డు అయింది. కాగా ఏప్రిల్, మే నెలల్లో ఎండల తీవ్రత మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈనేపథ్యంలో ప్రజలు జాగ్రత్తలు పాటించాలని జిల్లా వైద్యశాఖ పేర్కొంది.

News April 1, 2024

ADB: ఎన్నికల తర్వాత ఉమ్మడి జిల్లాకు రాహుల్ గాంధీ: సీతక్క

image

ఆదిలాబాద్ జిల్లాను అభివృద్ధి చేసే బాధ్యత తనదేనని మంత్రి సీతక్క అన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి ఆత్రం సుగుణక్కను భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. గాంధీని చంపిన గాడ్సేకు మద్దతు తెలిపి పూజించే పార్టీ బీజేపీ అని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్‌కు ఓటు వేస్తే దండగ.. బీజేపీకి ఓట్లు వేస్తే అభివృద్ధి రాదన్నారు. ఎన్నికల తర్వాత ఉమ్మడి జిల్లాలో రాహుల్ గాంధీ పర్యటిస్తారని తెలిపారు.

News April 1, 2024

నల్గొండ: రూ.3లక్షల నగదు పట్టివేత

image

పెద్దవూర మండలంలో కొండమల్లేపల్లి వైపు నుంచి వచ్చిన వాహనాలను పోలీసులు తనిఖీలు చేశారు. తనిఖీల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కాకినాడ జిల్లాకు చెందిన తాతారావు రూ.1.50 లక్షలు, కృష్ణ జిల్లాకు చెందిన ఎర్రగడ్డ నవీన్ రూ.50వేలు, అనకాపల్లి జిల్లాకు చెందిన కొండల దుర్గారావు రూ.1లక్షల నగదుకు ఎలాంటి పత్రాలు లేకపోవడంతో స్వాధీనం చేసుకుని సీజ్ చేసినట్లు ఎస్సై వీరబాబు తెలిపారు.

News April 1, 2024

జగిత్యాల: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మహిళలకు గాయాలు

image

మెట్‌పల్లి మండల శివారులో ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మహిళలు తీవ్రంగా గాయపడ్డారు. వివరాల్లోకి వెళితే గ్రామానికి చెందిన ఇద్దరు మహిళలు రాత్రి పదిన్నర గంటల సమయంలో రోడ్డు దాటే క్రమంలో గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో ఇరువురి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వారిని చికిత్స నిమిత్తం మెట్‌పల్లి ఆసుపత్రికి తరలించారు.

News April 1, 2024

HYD: రంబుల్ స్ట్రిప్స్‌పై మీ అభిప్రాయం ఏంటి..?

image

HYD ఎల్బీనగర్, రాజేంద్రనగర్, అత్తాపూర్, గచ్చిబౌలి, నాగోల్, చాంద్రాయణగుట్ట, హయత్‌నగర్ తదితర చోట్ల రోడ్లపై వాహనాల వేగాన్ని కంట్రోల్ చేసేందుకు ఇలా రంబుల్ స్ట్రిప్స్ ఏర్పాటు చేశారు. అయితే తక్కువ దూరంలో రెండు, మూడు చోట్ల ఏర్పాటు చేయడంతో పాటు అధిక మందంతో ఉండడంతో ఇబ్బందులు కలుగుతున్నాయని పలువురు వాహనదారులు వాపోతున్నారు. వయసు పెరిగేకొద్దీ వెన్నుపూస సమస్యలు వస్తున్నాయంటున్నారు. దీనిపై మీ అభిప్రాయం ఏంటి..?