Telangana

News July 26, 2024

BREAKING: జగిత్యాల: గురుకుల విద్యార్థి మృతి

image

పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో విషాదం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండలంలోని పెద్దాపూర్ గురుకులంలో ఎనిమిదో తరగతి విద్యార్థి ఈరోజు తెల్లవారుజామున అస్వస్థతకు గురైంది. దీంతో సిబ్బంది ఆసుపత్రి తరలిస్తుండగా మృతి చెందింది. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News July 26, 2024

నిర్మల్: బాలిక పై అత్యాచారయత్నం.. నిందితుడికి 5ఏళ్ల జైలు శిక్ష

image

బాలికపై అత్యాచారయత్నం చేసిన నిందితుడికి నిర్మల్ కోర్టు 5ఏళ్ల జైలు శిక్ష విధించినట్లు CI ప్రవీణ్ కుమార్ తెలిపారు. 7మార్చి2020న ఓ తల్లి 11ఏళ్ల కూతురిని తీసుకొని హోటల్‌కి వెళ్లింది. తన కూతురిని ఇంట్లో దింపమని బెస్తవార్ పేటకు చెందిన మహమ్మద్ రఫి అనే ఆటో డ్రైవర్‌‌తో పంపించింది. డ్రైవర్ తనను ఇంట్లో దింపి ఆమెపై అత్యాచారయత్నం చేశాడు. ఈ ఘటనపై అప్పటి SI కేసు నమోదు చేయగా కోర్టు అతడికి జైలు శిక్ష విధించింది.

News July 26, 2024

ఖమ్మం: పెరట్లో గంజాయి మొక్కల పెంపకం

image

ఇంటి పెరట్లో గంజాయి మొక్కలు పెంపకం చేస్తూ పోలీసులకు పట్టుపడ్డ ఘటన శుక్రవారం చింతకాని మండల పరిధిలోని నాగులవంచలో జరిగింది. పోలీసుల సమాచారం ప్రకారం.. గ్రామానికి చెందిన కందిమల్ల వెంకటేశ్వర్లు, ఆయన కుమారుడు శ్రీహరి గంజాయి మొక్కలను పెంచుతూ యువకులకు సరఫరా చేస్తున్నారు. గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకుని.. నిందితులపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై నాగుల్ మీరా తెలిపారు.

News July 26, 2024

ఉమ్మడి జిల్లాల్లో నేటి వర్షపాత వివరాలివే..

image

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా శుక్రవారం నమోదైన వర్షపాత వివరాలు ఇలా.. అత్యధికంగా మహబూబ్‌నగర్ జిల్లా నవాబుపేటలో 6.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. నారాయణపేట జిల్లా మొగల్ మట్కాలో 3.0 మి.మీ, నాగర్ కర్నూలు జిల్లా వెల్దండలో 1.8 మి.మీ, వనపర్తి జిల్లా సోలిపూర్ లో 0.8 మి.మీ, గద్వాల జిల్లా అలవలపాడులో 0.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది.

News July 26, 2024

గ్రేట్ ట్రైనింగ్: ఒలింపిక్స్‌కు తీసుకెళ్లిన హైదరాబాద్‌!

image

ట్యాలెంట్ ఉన్న ఎందరికో ‘హైదరాబాద్’ లైఫ్ ఇచ్చింది. ఇక్కడ శిక్షణ తీసుకొని నేడు ఏడుగురు ఒలింపిక్స్‌‌కు ఎంపికయ్యారు. AP, TGలో 8 మంది సెలక్ట్ అవగా అందులో ఏడుగురు‌ HYDలో శిక్షణ తీసుకున్నవారే . PV సింధు, నిఖత్ జరీన్ లాంటి అంతర్జాతీయ‌ క్రీడాకారులకూ నగరంతో అనుబంధం ఉంది. సాత్విక్ సాయిరాజ్, శ్రీజ, ఇషా సింగ్, జ్యోతి, దండిజ్యోతిక శ్రీ‌‌ కూడా ఈ ఒలింపిక్స్‌లో అదరగొట్టి ఇంకా గొప్ప స్థాయికి చేరాలని ఆశిద్దాం.

News July 26, 2024

గ్రేట్ ట్రైనింగ్: ఒలింపిక్స్‌కు తీసుకెళ్లిన హైదరాబాద్‌!

image

ట్యాలెంట్ ఉన్న ఎందరికో ‘హైదరాబాద్’ లైఫ్ ఇచ్చింది. ఇక్కడ శిక్షణ తీసుకొని నేడు ఏడుగురు ఒలింపిక్స్‌‌కు ఎంపికయ్యారు. AP, TGలో 8 మంది సెలక్ట్ అవగా అందులో ఏడుగురు‌ HYDలో శిక్షణ తీసుకున్నవారే . PV సింధు, నిఖత్ జరీన్ లాంటి అంతర్జాతీయ‌ క్రీడాకారులకూ నగరంతో అనుబంధం ఉంది. సాత్విక్ సాయిరాజ్, శ్రీజ, ఇషా సింగ్, జ్యోతి, దండిజ్యోతిక శ్రీ‌‌ కూడా ఈ ఒలింపిక్స్‌లో అదరగొట్టి ఇంకా గొప్ప స్థాయికి చేరాలని ఆశిద్దాం.

News July 26, 2024

ఉమ్మడి జిల్లాలో ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం నిధులు విడుదల

image

ఉమ్మడి జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో ఏడాదికి 42 వేల ఇళ్లను నిర్మించనున్నారు. మరోవైపు పూర్తయిన రెండు పడక గదుల ఇళ్లను త్వరలోనే లబ్ధిదారులకు అందజేస్తామని, అసంపూర్తిగా ఉన్నవాటిని పూర్తి చేస్తామని గురువారం శాసనసభలో బడ్జెట్ సమావేశంలో ప్రభుత్వం వెల్లడించింది. ఉమ్మడి జిల్లాలో రెండు పడకగదుల ఇళ్లు 16,254 మంజూరుకాగా.. అందులో 6,391 పూర్తయ్యాయి.

News July 26, 2024

NLG: ముసురుతో ముప్పే..! పంటలకు నష్టం

image

ఎప్పుడెప్పుడా అని నింగి వైపు చూసిన రైతన్నకు ఆశించిన స్థాయిలో వర్షాలు కురుస్తున్నాయి. అయితే ఏకధాటిగా కురుస్తున్న ముసురు వానతో వివిధ పంటలకు నష్టం వాటిల్లే ప్రమాదముంది. అల్పపీడన ప్రభావం వల్ల ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఏకధాటిగా కురుస్తున్న ముసురు వాన వల్ల పంటల్లో తేమ శాతం అధికమవుతోంది. చేన్లలో నీరు నిల్వ ఉండటంతో.. చేలు జాలువారి పంటను దెబ్బతీసే ప్రమాదముంది.

News July 26, 2024

ఆగస్టు 6,7 తేదీల్లో సింగరేణి ఉద్యోగుల రాత పరీక్షలు

image

సింగరేణిలో 327 ఖాళీల భర్తీకి ఏప్రిల్ 24న నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే. అభ్యర్థులకు ఆగస్టు 6, 7 తేదీల్లో రాత పరీక్షలను నిర్వహించనున్నారు. అసిస్టెంట్ ఫోర్ మెన్ ట్రైని, జూనియర్ మైనింగ్ ఇంజనీర్, ఎలక్ట్రీషియన్ ట్రైనీ, ఫిట్టర్ ట్రైనీ అభ్యర్థులకు 6న, మేనేజ్మెంట్ ట్రైనీ (సిస్టమ్స్), అసిస్టెంట్ ఫోర్ మెం ట్రైనీ, వారికి 7న కంప్యూటర్ ఆధారిత పరీక్షలను నిర్వహించనున్నారు.

News July 26, 2024

డోర్నకల్: భర్త మరణాన్ని తట్టుకోలేక భార్య మృతి

image

ముల్కలపల్లి గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన సత్తి ముత్తయ్య(86) కొద్ది కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ బుధవారం రాత్రి మరణించాడు. గురువారం ముత్తయ్య అంత్యక్రియలు చేసేందుకు సిద్ధమవుతుండగా ఆయన మరణాన్ని తట్టుకోలేక భార్య యశోదమ్మ(80) గుండెపోటుతో కుప్పకూలిపోయారు. వెంటనే స్థానికులు ఖమ్మం ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందింది. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.