India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందాడు. అంతర్గాం ఎస్సె వెంకటస్వామి కథనం ప్రకారం.. పాలకుర్తి మండలం ఈసాలతక్కళ్లపల్లికి చెందిన శివ కుమార్ కూలీ పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. బుధవారం అర్ధరాత్రి మిత్రులతో కలిసి బైక్‌పై గోదావరిఖని వైపు వెళ్తుండగా కుందనపల్లి ఐఓసీఎస్ డిపో సమీపంలో యూ టర్న్ తీసుకుంటున్న లారీని వెనుక నుంచి ఢీకొన్నారు. దీంతో శివకుమార్(18) అక్కడికక్కడే మృతి చెందాడు. కేసు నమోదైంది.
ఖమ్మం జిల్లాలో వ్యవసాయానికి బడ్జెట్లో పెద్దపీట వేశారు. జిల్లా రైతంగానికి రైతు భరోసా, రైతు రుణమాఫీ అమలుతో పాటు సన్నరకం ధాన్యం క్వింటాకు రూ.500 బోనస్ ఇవ్వనున్నారు. అలాగే పంటల బీమా పథకం అమలుకు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకంలో చేరుతామని మంత్రి తెలిపిన నేపథ్యాన ఖమ్మం జిల్లాలో సుమారు 3.45 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరనుంది. వీటికి తోడు ఆరు గ్యారంటీల అమలుకు బడ్జెట్లో ప్రాధాన్యత ఇచ్చారు.
33 రకాల సన్నరకాల వంగడాలకు క్వింటాకు రూ.500 బోనస్ ఇస్తామని ప్రభుత్వం బడ్జెట్లో ప్రకటించడంతో ఉమ్మడి జిల్లాలో లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరనుంది. మిర్యాలగూడ, గరిడేపల్లి, నేరేడుచర్ల, హుజూర్‌నగర్, కోదాడ, చిలుకూరు ప్రాంతాల్లో లక్షల మంది రైతులు ఏటా సాగర్ ఎడమ కాల్వ కింద సన్నరకాలనే సాగు చేస్తున్నారు. ప్రభుత్వం తాజా నిర్ణయంతో సుమారు 4 లక్షల ఎకరాల్లో పండే సన్నరకాలకు బోనస్ రానుంది.
ప్రతి గ్రామపంచాయతీలో 500 జనాభా కలిగిన తండాలను పంచాయతీలుగా మార్చి ఆరేళ్లు గడిచినా కనీస వసతులు లేవు. మరోవైపు పంచాయతీలకు పక్కా భవనాలు లేకపోవడంతో అద్దె గదుల్లోనే కార్యకలాపాలు సాగుతున్నాయి. వీటన్నింటికీ ఈ ఏడాదిలో పక్కా నిర్మాణాలను నిర్మిస్తామని తెలంగాణ ప్రభుత్వం గురువారం బడ్జెట్‌లో ప్రకటించింది. ప్రభుత్వ నిర్ణయం పట్ల ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు.
పెండింగ్లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యం ఇచ్చి పూర్తి చేస్తామని ప్రభుత్వం చెప్పడంతో జిల్లా ప్రజల్లో ఆశలు రేకెత్తాయి. ప్రాజెక్టులకు బడ్జెట్లో ఈసారి కేటాయింపులు భారీగా పెరిగాయి. అయినా జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టు పనులకు అవి సరిపోని పరిస్థితి నెలకొంది. నల్గొండ జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులకు మొత్తంగా రూ. 8598 కోట్లు అవసరం కాగా ప్రభుత్వం ఈ బడ్జెట్లో రూ.1699.90 కోట్లు కేటాయించింది.
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని నీటి ప్రాజెక్టులపై అసెంబ్లీలో గురువారం ఆర్థిక మంత్రి మల్లు భట్టివిక్రమార్క రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టారు. వివరాలు ఇలా(కోట్లలో).. ✒పాలమూరు-రంగారెడ్డి:రూ.1,285 ✒కల్వకుర్తి: రూ.715 ✒జూరాల-పాకాల కాలువ: రూ.0.15 ✒భీమా జూరాల-పాకాల: రూ.32 ✒జూరాల రాజీవ్:రూ.8 ✒నెట్టెంపాడు: రూ.105 ✒ఆర్డీఎస్: రూ.29.50 ✒సంగంబండ: రూ.188.07 ✒కోయిలసాగర్: రూ.429.86 కోట్లు కేటాయించారు.
సిద్దిపేట జిల్లా <<13707142>>లింగారెడ్డిపల్లిలో <<>>ట్రాక్టర్ కిందపడి రైతు మృతి చెందిన విషయం తెలిసిందే. అతడి మృతిని తట్టుకోలేక ప్రియురాలు సూసైడ్ చేసుకుందని పోలీసులు తెలిపారు. వారి వివరాలు.. గ్రామానికి చెందిన యువతి(22) HYDలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో పని చేస్తోంది. రైతు సత్యంతో ఏడాదిన్నర నుంచి వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. సత్యం మృతి చెందిన కాసేపటికే మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడింది.
నాగార్జునసాగర్ పరిధిలోని ఎత్తిపోతల పథకానికి బడ్జెట్లో ప్రభుత్వం రూ.500 కోట్లు కేటాయించింది. దేవరకొండతో పాటు సాగర్ ఎడమ కాలవ పరిధిలోని నాగార్జునసాగర్, మిర్యాలగూడ, HNR నియోజకవర్గాలలో సుమారు రూ.3 వేల కోట్లతో గతంలో KCR ఎత్తిపోతల నిర్మాణం ప్రారంభించారు. కానీ నిధులు కేటాయించకపోవడంతో పునాది దశలోనే ఉన్నాయి. ప్రభుత్వం బడ్జెట్లో నిధులు కేటాయించడంతో ఎత్తిపోతల పథకాల నిర్మాణం ముందుకు సాగనుంది.
రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో ప్రవేశపెట్టిన 2024-25 బడ్జెట్లో సీతారామ ప్రాజెక్టుకు రూ.799 కోట్లు కేటాయించారు. ఇందులో పంప్ హౌస్లు, డిస్ట్రిబ్యూటరీ కెనాళ్లు తదితర పనుల కోసం రూ.687 కోట్లు కేటాయించగా.. సీతమ్మసాగర్ బ్యారేజీ, దాని అనుబంధ పనుల కోసం రూ.111 కోట్లు బడ్జెట్ పద్దుగా మంత్రి మల్లు భట్టివిక్రమార్క చూపించారు. ఈ నిధులను అత్యవసరంగా చేపట్టాల్సిన పనులకు వినియోగించనున్నారు.
పరీక్షలో ఫెయిల్ కావడంతో మనస్తాపానికి గురై విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మానవపాడు ఎస్ఐ చంద్రకాంత్ తెలిపిన వివరాలు.. అమరవాయికి చెందిన కౌశిక్(21) బీఎస్సీ చదువుతున్నాడు. మొదటి సం.లో ఫెయిల్ కావడంతో మంగళవారం గడ్డి మందు తాగాడు. కుటుంబ సభ్యులు కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రి తరలించగా, చికిత్స పొందుతూ గురువారం మృతి చెందారు. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.
Sorry, no posts matched your criteria.