India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
మహిళలపై కత్తితో దాడి చేసిన ఘటన నవీపేట్‌లో జరిగింది. జలాల్‌పూర్‌కి చెందిన గంగవ్వ అదే గ్రామానికి చెందిన సావిత్రి వద్ద నెల కిందట కుక్కర్ కొనుగోలు చేసింది. అది సరిగ్గా పనిచేయకపోవడంతో పలుమార్లు వారికి గొడవ జరిగింది. కాగా గురువారం సావిత్రి.. గంగవ్వను డబ్బులు ఇవ్వాలని అడగ్గా దానికి గంగవ్వ నిరాకరించింది. దీంతో కోపగించుకున్న సావిత్రి ఆమె తలపై కత్తితో నరికింది. ఈ ఘటనపై SI యాదగిరి గౌడ్ కేసు నమోదు చేశారు.
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని లాడ్జిలో ముగ్గురు మహిళలతో వ్యభిచారం చేస్తున్న విటులను పట్టుకున్నట్లు సీఐ బన్సీలాల్ తెలిపారు. సీఐ మాట్లాడుతూ.. వారిలో లాడ్జి నిర్వాహకుడు శ్రీనివాస్‌తో పాటు అఖిల్, అరుణ్ ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. పట్టుబడిన మహిళలను పోలీసులు స్థానిక సఖీ కేంద్రానికి తరలించినట్లు సీఐ వివరించారు.
మహబూబ్ నగర్‌లో డీఎస్సీ పరీక్షలు కొనసాగుతున్నాయి. డీఎస్సీ రాత పరీక్షకు 665 మంది అభ్యర్థులు హాజరయ్యారు. గురువారం జిల్లా కేంద్రంలోని రెండు పరీక్ష కేంద్రాల్లో నిర్వహించిన ఈ పరీక్ష లకు 728 మంది అభ్యర్థులు రావాల్సి ఉండగా, 63 మంది హాజరుకాలేదు. ఉదయం, మధ్యాహ్నం రెండు పూటలా ప్రశాంతంగా పరీక్షలు జరిగాయని మహబూబ్ నగర్ జిల్లా విద్యాశాఖ వర్గాలు వెల్లడించాయి.
పర్యాటకరంగంలోనూ ఖమ్మం జిల్లాకు ప్రత్యేక స్థానం దక్కింది. ఎకో- టూరిజం (పర్యావరణ పర్యాటకం)ను పెంపొందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. తద్వారా పెనుబల్లి, కల్లూరు, ఏన్కూరు, తల్లాడ, చండ్రుగొండ, జూలూరుపాడు, సుజాతనగర్ మండలాల మధ్య విస్తరించిన కనకగిరి గుట్టలు, ఇక్కడి ఆలయాలు, ప్రాజెక్టులు అభివృద్ధికి నోచుకుంటాయి. అనువైన ప్రాంతాల్లో కాటేజీలు నిర్మించడం ద్వారా పర్యాటకులను ఆకర్షించనున్నారు.
డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క బడ్జెట్ కేటాయింపుల్లో ఖమ్మం జిల్లాపై ప్రత్యేక శ్రద్ధ కనబరిచారు. నీటిపారుదల, అటవీ, రోడ్లు, పంచాయతీరాజ్ శాఖల్లో పెండింగ్ పనులకు నిధులు కేటాయించారు. తద్వారా జిల్లాలోని సీతారామ, వైరా, లంకాసాగర్ ప్రాజెక్టుల పనులు ఊపందుకోనున్నాయి. అలాగే, ఎర్రుపాలెం మండలంలో ప్రత్యేకంగా ఎత్తిపోతలకు నిధులు కేటాయించనున్నట్లు ప్రకటించారు.
సీఎం రేవంత్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గ అభివృద్ధికి ఏర్పాటు చేసిన కొడంగల్ ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీకి బడ్జెట్‌లో రూ.120కోట్లు కేటాయించారు. దీంతో పాటు కొడంగల్‌లో ఏర్పాటు చేయనున్న కొత్త వెటర్నరీ కళాశాలకు రూ.6.50 కోట్లను కేటాయించారు. పరిశోధన- అభివృద్ధి కోసం రూ. 100 కోట్లు, ఎమ్మెల్యేలు, ఎంపీల నియోజకవర్గ అభివృద్ధి కోసం రూ. 5 కోట్ల చొప్పున్న రూ. 603.76 కోట్లు ప్రతిపాదించారు.
ఉమ్మడి జిల్లాలకు చెందిన జూనియర్ లైన్మెన్ల ఎంపికకు ఈనెల 27న శనివారం ఖమ్మం విద్యుత్ సర్కిల్ కార్యాలయంలో నిర్వహిస్తున్నట్లు ఎస్ఈ ఎ.సురేందర్ తెలిపారు. ఎన్పీడీసీఎల్ విడుదల చేసిన 9వ జాబితాలోని అభ్యర్థులకు ఈ పరీక్ష ఉంటుందని వెల్లడించారు. ధ్రువపత్రాల పరిశీలన అనంతరం స్తంభం ఎక్కే పరీక్ష నిర్వహిస్తామని, ఇప్పటికే పోస్ట్ ద్వారా సమాచారం అందుకున్న అభ్యర్థులు హాజరుకావాలని ఆయన తెలిపారు.
2024-25లో మైనార్టీ విద్యార్థులకు UPSC నిర్వహించే సివిల్ సర్వీస్ పరీక్షలకు ప్రభుత్వం ఉచిత శిక్షణ కార్యక్రమం చేపట్టిందని డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. ఇందులో భాగంగా లోకల్ అభ్యర్థులకు నెలకు రూ.2500, నాన్ లోకల్ అభ్యర్థులకు రూ.5,000 చొప్పున స్టైఫండ్ ఇవ్వనున్నట్టు తెలిపారు. అటు ఈ ఏడాది రంజాన్ పండుగ వేడుకలకు రూ.33కోట్లు రిలీజ్ చేశామన్నారు.
శాతవాహన యూనివర్సిటీ పరిధిలో నిర్వహించిన LLB ఆరో సెమిస్టర్ పరీక్ష ఫలితాలను గురువారం పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ ఎన్‌వి శ్రీరంగ ప్రసాద్ విడుదల చేశారు. ఫలితాలను www.satavahana.ac.in వెబ్ సైట్‌లో చూసుకోవచ్చు అని వర్సిటీ పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ శ్రీరంగ ప్రసాద్ ఓ ప్రకటనలో తెలిపారు.
బార్డర్‌లో నల్గొండ జిల్లాకు చెందిన ఆర్మీ జవాన్ అసువులు బాశారు. గ్రామస్థుల వివరాల ప్రకారం.. అనుముల మం. మదారిగూడెనికి చెందిన ఈరేటి మహేశ్ (24). సూర్యాపేట ఆర్మీ రిక్రూట్‌మెంట్-2022లో సైన్యంలో చేరారు. అస్సాంలోని మంచుకొండల్లో గస్తీ కాస్తుండగా వాతావరణ పరిస్థితుల అనుకూలించక అనారోగ్యానికి గురయ్యారు. చికిత్స పొందుతూ అక్కడే చనిపోయారు. నేడు భౌతికకాయం స్వగ్రామానికి చేరనుంది.
Sorry, no posts matched your criteria.