Telangana

News July 26, 2024

రూ.3065 కోట్లు కేటాయించడం హర్షనీయం: మేయర్

image

రాష్ట్ర బడ్జెట్‌లో  జీహెచ్ఎంసీ సమగ్ర అభివృద్దికి ప్రభుత్వం రూ. 3,065 కోట్లు కేటాయించడం హర్షనీయమని మేయర్ గద్వాల విజయ లక్ష్మి ఓ ప్రకటనలో తెలిపారు. ప్రజా ప్రభుత్వంలో రాష్ట్ర ప్రజలకు అభివృద్ధి, సంక్షేమం రెండు సమానంగా కేటాయించడం మంచి పరిణామం అన్నారు. మెరుగైన రవాణా వ్యవస్థ, మెట్రో రైలు విస్తరణ, మూసీ పరివాహక ప్రాంతాల్లో అభివృద్ధికి దోహద పడేవిధంగా నిధుల కేటాయింపు జరిగిందన్నారు.

News July 26, 2024

ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు వరుస సెలవులు

image

ఖమ్మం వ్యవసాయ మార్కెట్ మూడు రోజులు బంద్ ఉంటుందని మార్కెట్ కార్యదర్శి ఓ ప్రకటనలో తెలిపారు. 27 శనివారం వారంతపు యార్డు, 28 ఆదివారం వారంతపు సెలవు, 29 సోమవారం బోనాల పండుగ సందర్భంగా బంద్ ఉంటుందన్నారు. ఈనెల 30న మంగళవారం రోజున
మార్కెట్ పునఃప్రారంభం అవుతుందన్నారు.

News July 26, 2024

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

image

✓ఖమ్మం, భద్రాద్రి జిల్లా కలెక్టర్ సమీక్షా సమావేశం
✓ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ నేతల సంబరాలు
✓పాల్వంచ పెద్దమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు
✓కొత్తగూడెంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం
✓ఎమ్మెల్యే జారే ఆదినారాయణ పర్యటన
✓ఎమ్మెల్యే కోరం కనకయ్య పర్యటన

News July 26, 2024

కేయూ పీజీ 2వ సెమిస్టర్ టైం టేబుల్‌ విడుదల

image

కేయూ పీజీ (MA/M.Com/M.Sc) రెండవ సెమిస్టర్ పరీక్షా టైం టేబుల్‌ను పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య ఎస్. నరసింహచారి, అదనపు పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ బీఎస్‌ఎల్. సౌజన్య విడుదల చేశారు. ఆగస్టు 7న మొదటి పేపర్, 9న రెండవ పేపర్, 12న మూడవ పేపర్, 14న నాల్గవ పేపర్, 16న ఐదవ పేపర్, 19న ఆరవ పేపర్ పరీక్ష ఉన్నట్లు పేర్కొన్నారు. పరీక్షలు మధ్యాహ్నం 2.00 – 5 గంటల వరకు జరుగుతాయన్నారు.

News July 26, 2024

సాగర్‌కు వరద పెరుగుతోంది

image

ఉమ్మడి నల్గొండ రైతులకు నాగార్జున సాగర్ ప్రాజెక్టు కీలకం. పంటల సాగు ఎక్కువగా సాగర్ ఆయకట్టు పరిధిలోనే జరుగుతోంది. కొన్ని రోజులుగా సాగర్ నీటిమట్టం డెడ్ స్టోరేజీకి చేరడంతో రైతుల్లో ఆందోళన మొదలైంది. ఇక ఎగువన కురుస్తోన్న వర్షాలతో శ్రీశైలం డ్యామ్‌కు వరద పోటేత్తుతుండగా దిగువన ఉన్న నాగార్జున సాగర్‌కు 31,784 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చి చేరుతోంది. దీంతో రైతుల్లో హర్షం వ్యక్తమవుతోంది.

News July 26, 2024

కామారెడ్డి: ఉరేసుకొని తల్లి, కుమార్తె ఆత్మహత్య.. వివరాలు ఇవే.!

image

తల్లి, కూతురు <<13707442>>ఆత్మహత్య<<>>కు పాల్పడ్డ విషయం తెలిసిందే. మాలన్ బాయి, కుమార్తె మనీషా, కుమారుడు మంగళ్ దీప్తోతో కలిసి డోంగ్లిలో నివాసముంటుంది. కొద్ది రోజులుగా మాలన్ బాయి అనారోగ్యంగా ఉండటంతో పాటు కుమార్తె మనీషా మానసిక స్థితి బాగలేకపోవడంతో ఆత్మహత్య చేసుకొని ఉండవచ్చని జుక్కల్ SI సత్యనారాయణ అనుమానం వ్యక్తం చేశారు. కాగా ఈ ఏడాది మార్చిలో ఆమె భర్తను హత్య చేసిన కేసులో మాలన్ A1గా ఉంది.

News July 26, 2024

MDK: సింగూరు ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద

image

ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు సింగూరు ప్రాజెక్టులోకి వరద వస్తోంది. గతేడాది ఇదే సమయంలో ప్రాజెక్టులో 21.272 టీఎంసీల నీరు నిల్వ ఉండగా, ప్రస్తుతం ప్రాజెక్టులో 13.899 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 29.917 టీఎంసీలు కాగా 1444 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉందని అధికారులు అధికారులు తెలిపారు. ఈ సీజన్‌లో జూన్‌ నుంచి అర టీఎంసీ నీరు వచ్చినట్లు ఏఈ తెలిపారు.

News July 26, 2024

సిర్పూర్ (టి): వరదలో చిక్కుకున్న వ్యక్తిని రక్షించిన పోలీసులు

image

కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో పెనుగంగా వరద ఉద్ధృతిలో చిక్కుకున్న వ్యక్తిని పోలీసులు రక్షించారు. వివరాలు.. సిర్పూర్ (టి) మండలం హుడ్కిలి గ్రామం వద్ద పెనుగంగా నది బ్యాక్ వాటర్ రావడంతో లిఫ్ట్ ఇరిగేషన్ ట్యాంక్ పైన గోపాల్ అనే వ్యక్తి చిక్కుకున్నాడు. విషయం తెలుసుకున్న ఎస్ఐ దీకొండ రమేశ్ తన సిబ్బందితో వెళ్లి అతడిని రక్షించి ఒడ్డుకు తీసుకువచ్చారు.

News July 26, 2024

హైదరాబాద్‌‌లో అభివృద్ధి జరిగిందా?

image

HYD అభివృద్ధిపై కాంగ్రెస్‌, బీఆర్ఎస్‌ నేత‌లు వాదోపవాదాలు చేస్తున్నారు. నగరంలో‌ ఫ్లై ఓవర్లు తప్ప గత ప్రభుత్వం చేసిందేమీ లేదని‌ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క‌ అన్నారు. అభివృద్ధి జరగలేదని‌ తేల్చి చెప్పారు. దీనిపై హరీశ్‌ రావు ఘాటుగా బదులిచ్చారు. లోకం అంతా హైదరాబాద్‌ను మెచ్చుకుందన్నారు. కాంగ్రెస్ గజినీలకు ఇది కనిపించదని ఎద్దేవా చేశారు. మరి గత 10 ఏళ్లలో నగర అభివృద్ధిపై హైదరాబాదీగా మీ కామెంట్?

News July 26, 2024

హైదరాబాద్‌‌లో అభివృద్ధి జరిగిందా?

image

HYD అభివృద్ధిపై కాంగ్రెస్‌, బీఆర్ఎస్‌ నేత‌లు వాదోపవాదాలు చేస్తున్నారు. నగరంలో‌ ఫ్లై ఓవర్లు తప్ప గత ప్రభుత్వం చేసిందేమీ లేదని‌ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క‌ అన్నారు. అభివృద్ధి జరగలేదని‌ తేల్చి చెప్పారు. దీనిపై హరీశ్‌ రావు ఘాటుగా బదులిచ్చారు. లోకం అంతా హైదరాబాద్‌ను మెచ్చుకుందన్నారు. కాంగ్రెస్ గజినీలకు ఇది కనిపించదని ఎద్దేవా చేశారు. మరి గత 10 ఏళ్లలో నగర అభివృద్ధిపై హైదరాబాదీగా మీ కామెంట్?