Telangana

News July 25, 2024

బడ్జెట్ విందు సమావేశంలో ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు, మంత్రులు

image

రాష్ట్ర డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క నివాసంలో గురువారం బడ్జెట్ విందును ఏర్పాటు చేశారు. విందుకు సీఎం రేవంత్ రెడ్డి‌తో పాటు ఉమ్మడి కరీంనగర్ జిల్లా మంత్రులు ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్, మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

News July 25, 2024

నిజామాబాద్: నేటి వార్తల్లోని ముఖ్యంశాలు

image

* కామారెడ్డి జిల్లాలో ఉరేసుకొని తల్లి, కుతూరు సూసైడ్*VIDEO: మంజీరా నదిలో చిక్కుకున్న ముగ్గురు పశువుల కాపరులు*భట్టి మాటలన్నీ ఉత్త మాటలే: ఎమ్మెల్యే ధన్పాల్*NZB: బడ్జెట్ అభూత కల్పన, అబద్దాల పుట్ట: వేముల*బోధన్ నిజాం షుగర్స్ ను తిరిగి తెరిపిస్తాం: డిప్యూటీ CM *అంకాపూర్ పచ్చి బుట్టలకు భారీ డిమాండ్*శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్.. @61 ఇయర్స్..!

News July 25, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

@ సారంగాపూర్ మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన జగిత్యాల కలెక్టర్. @ దుర్షేడులోని బాలుర వసతి గృహాన్ని తనిఖీ చేసిన కరీంనగర్ కలెక్టర్. @ రాజన్న సిరిసిల్ల జిల్లా వైద్యాధికారిగా వసంతరావు బాధ్యతలు స్వీకరణ. @ జగిత్యాల జిల్లా కేంద్రంలో మూడు ఇండ్లలో చోరీ. @ వేములవాడ ప్రభుత్వ జూనియర్ కళాశాలను తనిఖీ చేసిన సిరిసిల్ల కలెక్టర్. @ కరీంనగర్ ఎల్ఎండి నీ పరిశీలించిన కేటీఆర్.

News July 25, 2024

ఈ నెల27న ఇంటర్ స్పాట్ ఆడ్మిషన్ కౌన్సిలింగ్

image

ఉమ్మడి కరీంనగర్ సాంఘీక సంక్షేమ శాఖ గురుకుల విద్యాలయాల్లో ప్రవేశాల కోసం ఈ నెల 27న స్పాట్ కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నట్లు జిల్లా గురుకుల విద్యాలయం ప్రిన్సిపాల్ దేవేందర్ రెడ్డి తెలిపారు. పెద్దపల్లి, మంథని, గొల్లపల్లి, మేడిపల్లి, కోరుట్ల, ముస్తాబాద్, బోయిన్ పల్లి, జమ్మికుంట, బాలుర కళాశాలలో అడ్మిషన్ల కౌన్సిలింగ్‌కు సుల్తానాబాద్ శాస్త్రినగర్‌లో ఉన్న గురుకుల కళాశాల వద్ద ఉ.9 గంటలకు హాజరుకావాలని కోరారు.

News July 25, 2024

భట్టి బడ్జెట్ కేవలం ఉట్టి బడ్జెట్: పాల్వాయి హరీశ్ బాబు

image

రాష్ట్ర శాసనసభలో ప్రవేశపెట్టిన బడ్జెట్ కేవలం ఉట్టి బడ్జెట్‌గా ఉందని సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్ బాబు విమర్శించారు. హైదరాబాద్ అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఎమ్మెల్యే మాట్లాడుతూ..కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వడం లేదని గగ్గోలు పెడుతూనే రూ.30వేల కోట్లు రీజనల్ రింగురోడ్డు ఇచ్చిందని, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ (IIHT) మంజూరు చేసిందని ప్రసంగంలో తెలపడం విచిత్రంగా ఉందన్నారు.

News July 25, 2024

త్వరలో నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరుస్తాం: భట్టి

image

తెలంగాణకు గర్వకారణమైన నిజాం షుగర్ ఫ్యాక్టరీని తిరిగి తెరిపిస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బడ్జెట్ సమావేశాల్లో ప్రకటించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఫ్యాక్టరీ పునరుద్ధరణ కోసం కమిటీని ఏర్పాటు చేశామన్నారు. గత ప్రభుత్వం పరిశ్రమను తెరిపించేందుకు కనీస శ్రద్ధ చూపించలేదన్నారు. తాము త్వరలోనే ఫ్యాక్టరీని తిరిగి ప్రారంభిస్తామని స్పష్టం చేశారు.

News July 25, 2024

కామారెడ్డి జిల్లాలో విషాదం.. ఉరేసుకొని తల్లి, కూమార్తె SUICIDE

image

కామారెడ్డి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. డోంగ్లి మండల కేంద్రానికి చెందిన మలన్ బాయి (46), ఆమె కుమార్తె మనీషా (23) ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. అనారోగ్య కారణాలతో ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని ఆత్మహత్యకు గల కారణాలను తెలుసుకునే పనిలో ఉన్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News July 25, 2024

మక్తల్: ఏసీబీకి చిక్కిన సర్వేయర్

image

మక్తల్ తహశీల్దార్ కార్యాలయంలో సర్వేయర్‌గా పని చేస్తున్న బాలరాజు ఏసీబీకి చిక్కాడు. గురువారం ఓ వ్యక్తి నుంచి లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. మక్తల్‌కు చెందిన శ్రవణ్ కుమార్ అనే వ్యక్తికి అనుకూలంగా సర్వే రిపోర్ట్ ఇచ్చేందుకు లంచం అడిగాడు. దీంతో శ్రవణ్ కుమార్ ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. నేడు సర్వేయర్ రూ.9వేలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

News July 25, 2024

మాచారెడ్డి: కరెంట్ షాక్‌తో మహిళ మృతి

image

కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలంలో విషాదం చోటుచేసుకుంది. కరెంట్ షాక్ తగిలి ఓ మహిళ మృతి చెందినట్లు మాచారెడ్డి ఎస్సై అనిల్ కుమార్ తెలిపారు. అంకిరెడ్డిపల్లి గ్రామ పరిధిలోగల మఠం రాళ్ల తండాకు చెందిన ప్రమీల తన పొలానికి సద్ది గంప తీసుకొని వెళ్తుండగా ప్రమాదం జరిగిందన్నారు. గంపపై ఉన్న గొడుగుకు విద్యుత్ వైర్లు తగలడంతో ప్రమీల విద్యాదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందినట్లు వివరించారు.

News July 25, 2024

ఉట్నూర్: ప్రత్యేకత చాటుకున్న ఇప్ప పువ్వు లడ్డు

image

ఉట్నూర్ మండలంలోని అడవుల్లో సమృద్ధిగా లభించే ఇప్ప పువ్వును ఆదివాసీలు వేసవికాలంలో సేకరించి నిలువ ఉంచుతారు. ఇలా నిలువ ఉంచిన ఇప్ప పువ్వుతో CCD స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ITDA సహకారంతో ఆదివాసీ ఆహారం పేరుతో సహజ సిద్ధంగా ఇప్ప పువ్వు లడ్డును తయారు చేసి కిలో రూ. 400 చొప్పున అమ్మకాలు చేపడుతున్నట్లు ఆదివాసీలు తెలిపారు. సహజ సిద్ధంగా ఉన్న లడ్డు రుచి జిల్లాలోనే ప్రత్యేకతను చాటుకుంది.