Telangana

News September 8, 2024

నల్గొండ: ఐదు రోజుల బాలుడి మృతి

image

ఐదు రోజుల బాలుడు మృతిచెందిన ఘటన నల్గొండ జిల్లా దేవరకొండ మండలంలోని ఓ పిల్లల ఆసుపత్రిలో జరిగింది. కాగా, వైద్యుల నిర్లక్ష్యంతోనే శిశువు మృతి చెందినట్లు బంధువులు ఆందోళన చేపట్టారు. ఆసుపత్రి అద్దాలు, ఫర్నీచర్ ధ్వంసం చేశారు. పెళ్లైన 8 ఏళ్ల తర్వాత పుట్టిన బాబు మృతితో బాధితులు తీవ్ర రోదనకు గురయ్యారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News September 8, 2024

HYD: నయా మోసం.. నమ్మితే నట్టేట మునిగినట్టే!

image

HYDలో కేటుగాళ్లు నయా మోసాలకు పాల్పడుతున్నారు. టెన్త్ చదివితే చాలు FAKE ఐడీ, ఆధార్ కార్డులు, జాబ్ ఆఫర్ లెటర్లు, ఫేక్ డిగ్రీ, B.Tech మెమోలు, క్వాలిఫికేషన్ సర్టిఫికెట్లు తయారుచేసి అవే ఒరిజినల్ అని నమ్మిస్తున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో జాబ్ వచ్చేలా చేస్తామని రూ.లక్షలు కాజేస్తున్నారు. ప్రతి విషయంపై అప్రమత్తంగా ఉండాలని, ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోవాలని రాచకొండ CP సుధీర్ బాబు సూచించారు.

News September 8, 2024

విద్య ఉజ్వల భవిష్యత్తుకు పునాది: మంత్రి సీతక్క

image

విద్య ఉజ్వల భవిష్యత్తుకు పునాది అని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క అన్నారు. అంతర్జాతీయ అక్షరాస్యతా దినోత్సవం సందర్భంగా నేడు మంత్రి సీతక్క ట్వీట్ చేశారు. చదువు మన తలరాతను మారుస్తుందని, ప్రతి ఒక్కరు కష్టపడి చదివి మన సమాజాభివృద్ధికి కృషి చేయాలని మంత్రి సీతక్క పిలుపునిచ్చారు.

News September 8, 2024

NLG: అద్దె భవనాల్లో అంగన్వాడీలు 

image

NLG జిల్లాలో అంగన్వాడీ కేంద్రాల నిర్వహణకు అవసరమైన సొంత భవనాలు లేక నిర్వాహకులు అవస్థలు పడుతున్నారు. అనేక మండలాల్లో ప్రస్తుతం ఇవి అద్దె గదులు, కమ్యూనిటీ హాళ్లు, పాత గదులలో కొనసాగుతున్నాయి. నల్గొండ పట్టణంలోని చాలా అంగన్వాడీ కేంద్రాలు అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి. ఇరుకుగా, అరకొర వసతులున్న ఆ భవనాల్లో చిన్నారులను ఆడించాలన్నా, వారికి భోజనం పెట్టాలన్న, చదువు చెప్పాలన్నా ఇబ్బందిగా మారింది.

News September 8, 2024

అధికారులు అప్రమత్తంగా ఉండండి: మంత్రి పొంగులేటి

image

KMM: వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించిన నేపథ్యంలో మున్నేరు పరివాహక ప్రాంతవాసులు అందరూ ముందస్తు జాగ్రత్తగా ఉండాలని తెలంగాణ రెవెన్యూ, విపత్తు నిర్వహణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సూచించారు. శనివారం సాయంత్రం నుంచి మళ్లీ ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తున్న నేపథ్యంలో ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల కలెక్టర్లతో మాట్లాడి తాజా పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.

News September 8, 2024

MBNR: అంగన్వాడీలో 65ఏళ్లు దాటితే ఇంటికి

image

అంగన్వాడి కేంద్రాల నిర్వహణ ప్రతిష్టం చేయడానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అంగన్వాడీ కేంద్రాలలో టీచర్లు, ఆయాలు 65 ఏళ్లు దాటితే పదవీ విరమణ చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో 65ఏళ్లు దాటిన టీచర్లు, ఆయాల జాబితాను సిద్ధం చేస్తున్నారు. కొడంగల్ ప్రాజెక్టులో ఆయాలు 65ఏళ్ల పైబడి ఉన్నారని గుర్తించారు. త్వరలో వీరుంతా పదవీ విరమణ చేయనున్నారు.

News September 8, 2024

MBNR: ఉమ్మడి జిల్లాలో భారీ వర్షం..!

image

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తోంది. కాలువలు, వాగులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయా జిల్లాల కలెక్టర్లు అధికారులకు ఆదేశించారు. శనివారం సాయంత్రం నుంచి ప్రారంభమై రాత్రి పలుచోట్ల భారీ వర్షం కురిసింది. భారీ వర్షం కురుస్తుండటంతో వాగులు, కాలువలు నిండి ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయని, ప్రజలు వాటిని దాటే ప్రయత్నం చేయవద్దని తెలిపారు.

News September 8, 2024

వరంగల్: గుండెపోటుతో కానిస్టేబుల్ మృతి

image

గుండెపోటుతో కానిస్టేబుల్ మృతి చెందిన ఘటన WGL జిల్లాలో శనివారం మధ్యాహ్నం జరిగింది. స్థానికుల ప్రకారం.. ములుగు జిల్లా మంగపేట మండలం చింతకుంటకు చెందిన కొమురం జగన్ NSPT పోలీస్ స్టేషన్లో పట్టణ CI గన్‌మెన్‌గా పనిచేస్తున్నాడు. అయితే శనివారం గణపతి ప్రతిష్ఠాపన కార్యక్రమంలో పాల్గొని ఇంటి వెళ్లాడు. వాంతులు చేసుకోగా.. కుటుంబీకులు ఆస్పత్రికి తరలించడతంతో అప్పటికే గుండెపోటుతో మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.

News September 8, 2024

రామగుండం యువతి మృతి

image

పెద్దపల్లి జిల్లాలో విషాదం నెలకొంది. స్థానికలు వివరాల ప్రకారం.. రామగుండం(ఎన్టీపీసీ) సుభాశ్ నగర్‌కు చెందిన బల్ల గంగా భవాని గుజరాత్ సెక్యూరిటీ ఫోర్స్ బార్డర్లో విధులు నిర్వహిస్తున్న గంగా భవాని మృతి శనివారం చెందింది. దీంతో హైదరాబాద్ ఎయిర్పోర్ట్‌లో మృతురాలి డెడ్ బాడీ కోసం కుటుంబ సభ్యులు ఎదురుచూస్తున్నట్లు సమాచారం. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

News September 8, 2024

ఉమ్మడి జిల్లాలో 2 వేలు ఉపాధ్యాయ ఖాళీలు

image

ఉమ్మడి పాలమూరు జిల్లాలోని 3,227 ప్రభుత్వ పాఠశాలల్లో 12,708 మందికి ప్రస్తుతం 10,225 మంది ఉపాధ్యాయులు విధులు నిర్వహిస్తున్నారు. 508 ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి పరీక్ష నిర్వహించారు. ప్రాథమిక పాఠశాలల్లో పని చేస్తున్న 1,975 మంది SGTలకు SAగా విద్యాశాఖ పదోన్నతి కల్పించింది.DSC ద్వారా కొత్త ఉపాధ్యాయులను నియమించినా ఇంకా సుమారు 2 వేల ఉపాధ్యాయ ఖాళీలు ఉన్నాయి. మరో DSCకి ప్రభుత్వం కసరత్తు చేస్తుంది.