India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
మౌలాలి రైల్వే స్టేషన్‌లో ప్రయాణికుడు మృతి చెందాడు. సికింద్రాబాద్ రైల్వే పోలీసుల వివరాల ప్రకారం..భద్రాది జిల్లా పాల్వంచ వాసి షేక్ మహ్మద్ HYDలో ఉంటూ.. ఓ ఆసుపత్రిలో పని చేస్తున్నాడు. అనారోగ్యం కారణంగా సొంతూరికి వెళ్దామని సికింద్రాబాద్ స్టేషన్‌కు వచ్చాడు. కాకతీయ ఎక్స్‌ప్రెస్‌కు బదులు చెన్నై ట్రైన్ ఎక్కాడు. పొరపాటు తెలుసుకొని మౌలాలిలో రైల్ నుంచి దిగబోయాడు. ఒక్కసారిగా కింద పడిపోవడంతో మృతి చెందాడు.
సీజనల్ వ్యాధులు వ్యాపించకుండా అన్ని రకాల చర్యలు చేపట్టాలని నిర్మల్ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ అధికారులను ఆదేశించారు. గురువారం సాయంత్రం కలెక్టరేట్ సమావేశ మందిరంలో సీజనల్ వ్యాధులు వ్యాపించకుండా తీసుకుంటున్న చర్యలపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రతి మంగళ, శుక్రవారాల్లో తప్పనిసరిగా డ్రైడే కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఖమ్మం జిల్లా కలెక్టరేట్ నందు గురువారం నిర్వహించిన వైద్య శిబిరాన్ని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. కలెక్టరేట్ అధికారులు, ఉద్యోగుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశామన్నారు. వైద్య సిబ్బంది అధికారులు, ఉద్యోగులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిఎంహెచ్వో డాక్టర్ మాలతి పాల్గొన్నారు.
సచివాలయంలో నిర్వహించిన నల్ల పోచమ్మ బోనాల ఉత్సవ వేడుకల్లో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పాల్గొని బోనం ఎత్తుకొని సందడి చేశారు. తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీక బోనాల పండుగ అని, బోనాల పండుగ వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుందని చెప్పారు. కార్యక్రమంలో వరంగల్ మేయర్ గుండు సుధారాణి పాల్గొన్నారు.
తెలంగాణ విశ్వవిద్యాలయ పరిధిలో ఇంటిగ్రేటెడ్ పీజీ సెమిస్టర్ రెగ్యులర్, బ్యాక్ లాగ్ పరీక్షలు 9వ రోజైన గురువారం ప్రశాంతంగా జరిగాయని టీయూ ఆడిట్ సెల్ డైరెక్టర్ ఆచార్య ఘంటా చంద్రశేఖర్ తెలిపారు. గురువారం ఉదయం జరిగిన పరీక్షకు 71 మంది విద్యార్థులు హాజరయ్యారన్నారు. అయితే మధ్యాహ్నం జరిగిన పరీక్షకు 187 మంది విద్యార్థులకు గాను 169 మంది విద్యార్థులు హాజరయ్యారని, 18 మంది విద్యార్థులు గైరాజరయ్యారని తెలిపారు.
ఏటూరు నాగారంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. చిన్నబోయినపల్లి సమీపంలో 163 జాతీయ రహదారిపై గురువారం భారీ వృక్షం కూలింది. అటు వైపు వెళుతున్న బైక్‌పై వృక్షం పడడంతో వ్యక్తి అక్కడి కక్కడే మృతి చెందాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. కాగా మృతుడు చిన్నబోయినపల్లి జహంగీర్‌గా స్థానికులు గుర్తించారు.
డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (D.ED) కళాశాలలో సీట్ల భర్తీ కోసం ఈ నెల 10న ఆన్‌లైన్‌లో నిర్వహించిన DEECET-2024 పరీక్ష ఫలితాలు విడుదలైనట్లు నిజామాబాద్ డైట్ కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాస్ తెలిపారు. ఫలితాల కోసం https://deecet.cdse.telangana.gov.in/ వెబ్ సైట్‌ను సందర్శించాలని ఆయన సూచించారు. సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రక్రియ, వెబ్ ఆప్షన్ల నమోదు తేదీలను త్వరలో ప్రకటిస్తారని ఆయన వివరించారు.
నార్కెట్ పల్లి మండలం, ఎల్లారెడ్డి గూడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ ద్వారా చేపట్టిన పనులన్నీ ఆగస్టు 15 నాటికి పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి ఆదేశించారు. గురువారం ఆయన ఎల్లారెడ్డి గూడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాల తరగతి గదులు ,వంటగది, తాగునీటి సౌకర్యం, ప్రహరీ ,పాఠశాల ఆటస్థలం, టాయిలెట్స్ తదితర సౌకర్యాలను పరిశీలించారు.
హన్మకొండ జిల్లా పరకాల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అవినీతి నిరోధకశాఖ అధికారులు గురువారం తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో పరకాల సబ్ రిజిస్ట్రార్ సునీత రూ.80వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు. పరకాల మున్సిపాలిటీ సీతారాంపురానికి చెందిన 9గుంటల భూమిని రిజిస్ట్రేషన్ చేసేందుకు లంచం డిమాండ్ చేయగా.. మధ్యవర్తి ద్వారా లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నట్లు సమాచారం.
తెలంగాణకు గర్వకారణమైన బోధన్‌లోని నిజాంషుగర్స్‌ను తిరిగి తెరిపిస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బడ్జెట్ సమావేశాల్లో ప్రకటించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఫ్యాక్టరీ పునరుద్ధరణ కోసం కమిటీని ఏర్పాటు చేశామన్నారు. గత ప్రభుత్వం షుగర్స్‌ను తెరిపించేందుకు కనీస శ్రద్ధ చూపించలేదని, కానీ తాము త్వరలోనే ఫ్యాక్టరీని తిరిగి ప్రారంభిస్తామని ఆయన స్పష్టం చేశారు.
Sorry, no posts matched your criteria.