Telangana

News July 25, 2024

ఆదిలాబాద్: DEECET ఫలితాలు విడుదల

image

డిప్లమా ఇన్‌ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌ (D.ED) కళాశాలలో సీట్ల భర్తీ కోసం ఈ నెల 10న ఆన్‌లైన్‌లో నిర్వహించిన డీఈఈసెట్‌-2024 పరీక్ష ఫలితాలు విడుదలైనట్లు ఆదిలాబాద్ డైట్ కళాశాల ప్రిన్సిపాల్ రవీందర్ రెడ్డి పేర్కొన్నారు. ఫలితాల కోసం https://deecet.cdse.telangana.gov.in/ వెబ్ సైట్‌ను సందర్శించాలని సూచించారు. సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ ప్రక్రియ, వెబ్‌ ఆప్షన్ల నమోదు వంటి తేదీలు త్వరలో విడుదల చేస్తామన్నారు.

News July 25, 2024

కాలేశ్వరంలో తగ్గుముఖం పట్టిన గోదావరి ప్రవాహం

image

భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద వరద ప్రవాహం తగ్గుముఖం పట్టింది. నిన్నటి వరకు ఉగ్రరూపం దాల్చిన గోదావరి, ప్రాణహిత నదులు కొంత శాంతించాయని, పుష్కర ఘాట్లను తాకుతూ ప్రవహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. అయినప్పటికి వర్షాలు పడుతున్న నేపథ్యంలో లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు పేర్కొన్నారు.

News July 25, 2024

HYD: సచివాలయంలో నేడు బోనాల వేడుకలు

image

తెలంగాణ రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలను పాటిస్తూ నేడు సచివాలయంలో బోనాల వేడుకలను నిర్వహించనున్నారు. సచివాలయ ఆవరణలోని నల్లపోచమ్మ దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో వేడుకలు జరగనున్నాయి. ఈ క్రమంలో సచివాలయంలోని ద్వారాల వద్ద అమ్మవారు, ఆదిశేషుడు తదితర ప్రతిమలను ఏర్పాటు చేశారు. సచివాలయ ఉద్యోగులు గురువారం మధ్యాహ్నం బోనాల వేడుకల్లో పాల్గొంటారు.

ఖానాపురం: భార్యకు గుడి కట్టించిన భర్త

image

వరంగల్ జిల్లా ఖానాపురం మండలం బుధరావుపేటకు చెందిన వెంకటనారాయణ భార్య సుజాత గుండెపోటుతో మృతి చెందింది. భార్య మరణాంతరం ఆమె గుర్తుగా పొలం వద్ద వెంకటనారాయణ గుడి కట్టించి భార్య విగ్రహం ఏర్పాటు చేశారు. భార్య జ్ఞాపకార్థం విగ్రహాన్ని ఏర్పాటు చేసిన వెంకటనారాయణను గ్రామస్థులు అభినందిస్తున్నారు.

News July 25, 2024

బడ్జెట్లో HYDకు నిధుల కేటాయింపు ఇలా..!

image

తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ నిధుల కేటాయింపు వివరాలను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అసెంబ్లీలో ఈరోజు వెల్లడించారు. HYD నగరానికి కేటాయించిన బడ్జెట్ వివరాలు ఇలా ఉన్నాయి. ✓HYD అభివృద్ధికి రూ.10,000 కోట్లు ✓RRR(రీజినల్ రింగ్ రోడ్డు)- రూ.1525 కోట్లు ✓మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్- రూ.1500 కోట్లు ✓వాటర్ బోర్డు కోసం రూ.3,385 కోట్లు ప్రతిపాదించినట్లు వెల్లడించారు.

News July 25, 2024

బడ్జెట్లో HYDకు నిధుల కేటాయింపు ఇలా..!

image

తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ నిధుల కేటాయింపు వివరాలను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అసెంబ్లీలో ఈరోజు వెల్లడించారు. HYD నగరానికి కేటాయించిన బడ్జెట్ వివరాలు ఇలా ఉన్నాయి.
✓HYD అభివృద్ధికి రూ.10,000 కోట్లు
✓RRR(రీజినల్ రింగ్ రోడ్డు)- రూ.1525 కోట్లు
✓మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్- రూ.1500 కోట్లు
✓వాటర్ బోర్డు కోసం రూ.3,385 కోట్లు ప్రతిపాదించినట్లు వెల్లడించారు.

News July 25, 2024

ఖమ్మం జిల్లాలో 3 లక్షల ఎకరాల్లో పంటల సాగు

image

ఖమ్మం జిల్లాలో ఆశించిన మేర వర్షపాతం నమోదు కాలేదు. దీంతో ఆశించిన మేర పంటల సాగు జరగలేదు. ఈ సీజన్ ఆరంభంలోనూ ఆశించిన మేర వర్షపాతం నమోదు కాకపోయినప్పటికీ జూలై ఆరంభం నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఈ సీజన్లోనైనా సాగు సమృద్ధిగా జరగాలనే ఉద్దేశంతో రైతులందరూ సాగు పనుల్లో నిమగ్నమై ఉన్నారు. అందుకు అనుగుణంగానే ఇప్పటికే జిల్లాలో రికార్డు స్థాయిలో 3లక్షల ఎకరాల్లో పంటలు సాగు చేస్తున్నారు.

News July 25, 2024

సరోజినీదేవి కంటి ఆస్పత్రిలో బదిలీలు.. సామాన్యుల ఇక్కట్లు

image

సరోజినీదేవి కంటి ఆస్పత్రిలో పలువురు వైద్యులు బదిలీ కావడంతో కంటి చూపు పరీక్షల కోసం వచ్చిన సామాన్యులు ఇబ్బంది పడుతున్నారు. ఆస్పత్రిలోని సూపరింటెండెంట్‌తో సహా ఐదుగురు ప్రొ.డాక్టర్లు, నలుగురు అసోసియేట్ డాక్టర్లు, 11 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్లు, ఫార్మాసిట్, ముగ్గురు ల్యాబ్ టెక్నీషియన్లు, సిస్టర్స్, హెల్త్ ఇన్‌స్పెక్టర్, స్వేకుంట్, గ్లకోమా అండ్ కార్నియాను సంబంధించిన సిబ్బంది బదిలీపై వెళ్లారు.