India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
వరంగల్ నగరంలోని ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ మూడు రోజులు బంద్ ఉంటుందని మార్కెట్ కార్యదర్శి ఓ ప్రకటనలో తెలిపారు. 27 శనివారం వారంతపు యార్డు, 28 ఆదివారం వారంతపు సెలవు, 29 సోమవారం బోనాల పండుగ సందర్భంగా బంద్ ఉంటుందన్నారు. కావున శనివారం నుంచి సోమవారం వరకు వరసగా(3) రోజులు మార్కెట్ తెరిచి ఉండదన్నారు. తిరిగి ఈనెల 30న మంగళవారం రోజున పునఃప్రారంభం అవుతుందన్నారు.
వైరా ఎమ్మెల్యే మాలోతు రాందాస్ నాయక్‌కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ప్రజా సేవలో నిమగ్నమై, రాష్ట్ర అభివృద్ధికి, ప్రజా పాలనలో భాగస్వామ్యం కావడానికి భగవంతుడు మీకు సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని, మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. అటు పలువురు జిల్లా నేతలు ఎమ్మెల్యే కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
నిజామాబాద్ నగరంలోని హమాల్వాడిలో తాళం వేసిన ఓ ఇంట్లో భారీ చోరీ జరిగింది. స్థానికంగా నివాసం ఉండే పెంటయ్య ఇంటికి తాళం వేసి కుటుంబీకులతో కలిసి బయటకు వెళ్లాడు. బుధవారం అర్ధరాత్రి ఇంట్లో చొరబడిన దొంగలు బీరువాలో ఉన్న సుమారు 13 తులాల బంగారు ఆభరణాలు దోచుకెళ్లినట్లు బాధితుడు తెలిపాడు. గురువారం ఉదయం చోరీ ఘటన బయటపడగా మూడో టౌన్ పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు.
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో మొక్కజొన్న ధరలు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. మార్కెట్ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా గత వారం రూ. 2,780 పలికిన మక్కల ధర.. ఈ వారం స్వల్పంగా తగ్గాయి. గత మూడు రోజులు రూ. 2,750 పలికిన మక్కలు, ఈరోజు మరింత తగ్గి రూ.2,715 అయినట్లు రైతులు తెలిపారు. మార్కెట్లో కొనుగోళ్ల ప్రక్రియ జోరుగా కొనసాగుతోంది.
భద్రాచలం వద్ద గోదావరికి మళ్లీ వరద పోటెత్తింది. గురువారం ఉదయం 6 గంటలకు 46.1 అడుగు ఉన్న గోదావరి 9 గంటలకు 47.1 అడుగుకు చేరింది. ఉదయం 11 గంటలకు 47.5 అడుగులకు చేరి రెండవ ప్రమాద హెచ్చరికకు చేరువ కానుంది. 48 అడుగులు దాటితే రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. ఇప్పటికే గోదావరి పరివాహకంలోని పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.
మణుగూరు సింగరేణి ఏరియా ఓసి 3 నందు డంపర్ సెక్షన్‌లో విధులు నిర్వర్తిస్తున్న నరేష్ (41) అనే వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. మృతదేహాన్ని సింగరేణి మార్చరీకి తరలించారు. విషయం తెలుసుకున్న టీబీజీకేఎస్ ఏరియా ఉపాధ్యక్షుడు నాగేల్లి సందర్శించి మృతి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
మలక్‌పేట్‌లో <<13702575>>బాలిక(8)పై అత్యాచారం<<>> జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. కాగా బాలికను భరోసా కేంద్రానికి తరలించారు. ఓ వైపు మెలిపెట్టే నొప్పి, మరోవైపు 15 రోజులుగా ఒకరి తర్వాత మరొకరు వేస్తోన్న ప్రశ్నలతో ఆ చిట్టితల్లి ఆందోళనకు గురైంది. మానసిన నిపుణులు వేసిన ప్రశ్నలకు బాలిక సరైన సమాధానాలు చెప్పలేకపోతోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు యువకుడిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.
చౌటుప్పల్ మండలం కొయ్యలగూడెం జాతీయ రహదారిపై ప్రమాదం జరిగింది. రోడ్డు దాటుతున్న వ్యక్తిని డీసీఎం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో గుర్తుతెలియని యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
మలక్‌పేట్‌లో <<13702575>>బాలిక(8)పై అత్యాచారం<<>> జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. కాగా బాలికను భరోసా కేంద్రానికి తరలించారు. ఓ వైపు మెలిపెట్టే నొప్పి, మరోవైపు 15 రోజులుగా ఒకరి తర్వాత మరొకరు వేస్తోన్న ప్రశ్నలతో ఆ చిట్టితల్లి ఆందోళనకు గురైంది. మానసిన నిపుణులు వేసిన ప్రశ్నలకు బాలిక సరైన సమాధానాలు చెప్పలేకపోతోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు యువకుడిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.
మెదక్, సంగారెడ్డి జిల్లాలకు చెందిన గ్రామీణ పురుషులకు ఆగస్టు 5 నుంచి నెలరోజుల పాటు ఎలక్ట్రికల్ హౌస్ వైరింగ్‌లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు సంస్థ డైరెక్టర్ వంగా రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. గ్రామీణ నిరుద్యోగ యువకులు వినియోగించుకుని, శిక్షణలో వసతి, భోజనం, కోర్సు మెటీరియల్ పూర్తి ఉచితంగా ఉంటుందని, శిక్షణ అనంతరం సర్టిఫికేట్లతో పాటు టూల్ కిట్ ఇస్తామన్నారు.
Sorry, no posts matched your criteria.