Telangana

News March 31, 2024

HYD: BJPదే విజయం: కిషన్‌రెడ్డి

image

రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో దేశంలో మళ్లీ బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. HYD కాచిగూడ డివిజన్‌లో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు దేశాన్ని ప్రగతి పథంలోకి తీసుకెళ్లాయన్నారు. కార్పొరేటర్ కన్నె ఉమా రమేశ్ యాదవ్ పాల్గొన్నారు.

News March 31, 2024

ఉమ్మడి మెదక్ జిల్లాకు ఆరెంజ్ ALERT

image

ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరిగిపోవడంతో అధికారులు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఆటోమెటిక్ వెదర్ స్టేషన్లలో ఈరోజు మధ్యాహ్నం ఉష్ణోగ్రత వివరాలు.. సదాశివపేట 41.1, కొండాపూర్ 41.0, ధూల్మిట్ట 40.8, నిజాంపేట 40.7,చేగుంట, పటాన్‌చెరు, సిద్దిపేట 40.6, దౌల్తాబాద్ 40.5, పాశమైలారం, పాతూర్, నారాయణఖేడ్ 40.2, దామరంచ 40.1 సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు. 

News March 31, 2024

MBNR: సీఎం రేవంత్ రెడ్డిపై విరుచుకుపడ్డ డీకే అరుణ

image

బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ సీఎం రేవంత్ రెడ్డిపై మండిపడ్డారు. రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా పని చేస్తున్నారంటూ, ఓటుకు నోటు ఇచ్చి ఎమ్మెల్సీ ఎన్నికల్లో మోసపూరితంగా ప్రవర్తించారని అన్నారు. పాలమూరు బిడ్డగా న్యాయం చేయాల్సిన వ్యక్తి ద్రోహం చేశాడని వాపోయారు. రానున్న రోజుల్లో పాలమూరు ప్రజలు రేవంత్ రెడ్డికి సరైన గుణపాఠం నేర్పుతారని అన్నారు.

News March 31, 2024

జక్రాన్ పల్లిలో ట్రాక్టర్ ఢీ కొని వ్యక్తి మృతి

image

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన ఘటన జక్రాన్ పల్లిలో జరిగింది. సికింద్రాపూర్ గ్రామానికి చెందిన తలారి బుర్రన్న(42) బాల్ నగర్ నుంచి స్కూటీ పై సికింద్రాపూర్‌కి వస్తుండగా వెనకనుంచి వచ్చిన ట్రాక్టర్ ఢీకొంది. దీంతో అతడు అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News March 31, 2024

MNCL: విద్యార్థినులకు వేధింపులు.. 22 మందిని పట్టుకున్న పోలీసులు

image

రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో 10వ తరగతి పరీక్ష కేంద్రాల వద్ద విద్యార్థినులను వేధిస్తున్న 22 మంది ఆకతాయిలను షీటీమ్స్ డెకాయ్ ఆపరేషన్ నిర్వహించి పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. వారికి చెందిన 10 బైక్‌లు స్వాధీనం చేసుకుని స్థానిక పోలీస్ స్టేషన్లకు తరలించామని, 13 మంది మేజర్లపై కేసులు నమోదు చేసి, 9 మంది మైనర్లకు కుటుంబ సభ్యుల సమక్షంలో కౌన్సిలింగ్ నిర్వహించినట్లు పేర్కొన్నారు.

News March 31, 2024

మహబూబాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థిపై కేసు నమోదు

image

మహబూబాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి సీతారాం నాయక్ తోపాటు ఆయన అనుచరులపై భద్రాచల పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. శనివారం శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని దర్శించుకోవడానికి వచ్చిన సీతారాం నాయక్ నిబంధనలకు విరుద్ధంగా ఆలయంలోని గర్భగుడిలో ఫోటోలు దిగారు. అప్పటితో ఆగకుండా సోషల్ మీడియాలో గర్భగుడి ఫొటోలతో ప్రచురించటం పట్ల భక్తులు ఆగ్రహానికి గురయ్యారు. దీంతో ఆలయ అధికారుల ఫిర్యాదు మేరకు చర్యలు తీసుకున్నారు.

News March 31, 2024

HYD: బీసీలకు భిక్షం వద్దు.. హక్కులు కావాలి: R.కృష్ణయ్య

image

లోక్‌సభ ఎన్నికల్లో BRS, కాంగ్రెస్, బీజేపీ.. బీసీలకు జనాభా ప్రాతిపదికన టికెట్లు కేటాయించకుండా తీవ్ర అన్యాయం చేశాయని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య ఆరోపించారు. జాతీయ బీసీ యువజన సంఘం అధ్యక్షుడు గవ్వల భరత్ కుమార్, గుజ్జ కృష్ణ అధ్యక్షతన ఆదివారం కాచిగూడలో నిర్వహించిన సభలో ఆయన ప్రసంగించారు. బీసీలకు భిక్షం వద్దని.. రాజ్యాంగబద్ధమైన హక్కులు కావాలని అన్నారు.

News March 31, 2024

HYD: బీసీలకు భిక్షం వద్దు.. హక్కులు కావాలి: R.కృష్ణయ్య

image

లోక్‌సభ ఎన్నికల్లో BRS, కాంగ్రెస్, బీజేపీ.. బీసీలకు జనాభా ప్రాతిపదికన టికెట్లు కేటాయించకుండా తీవ్ర అన్యాయం చేశాయని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య ఆరోపించారు. జాతీయ బీసీ యువజన సంఘం అధ్యక్షుడు గవ్వల భరత్ కుమార్, గుజ్జ కృష్ణ అధ్యక్షతన ఆదివారం కాచిగూడలో నిర్వహించిన సభలో ఆయన ప్రసంగించారు. బీసీలకు భిక్షం వద్దని.. రాజ్యాంగబద్ధమైన హక్కులు కావాలని అన్నారు.

News March 31, 2024

 మణుగూరు: ఇంటి దూలం కూలి బాలుడు మృతి

image

మణుగూరు మండలంలోని ఖమ్మంతోగూ గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. బండ్ల చంద్రయ్య, లక్ష్మీకాంత దంపతుల బాలుడు ప్రమాదవశాత్తు ఇంటి దూలం కూలి గాయాలయ్యాయి. వెంటనే కుటుంబ సభ్యులు మణుగూరు ఏరియా ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

News March 31, 2024

MDK: BRS, కాంగ్రెస్‌ని నమ్మకండి: రఘునందన్‌రావు

image

BRS, కాంగ్రెస్‌ని ప్రజలు నమ్మొద్దని, వాటికి ఓటేసి మోసపోవద్దని BJP మెదక్ పార్లమెంట్ అభ్యర్థి రఘునందన్‌రావు అన్నారు. ఆదివారం సిద్దిపేట జిల్లా జగదేవ్‌పూర్‌లో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. BRS, కాంగ్రెస్ పార్టీలు ఒకటే అని ఆరోపించారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రవేశపెట్టిన పథకాలు ప్రతి ఒక్కరికీ అందుతున్నాయని తెలిపారు. దేశం అభివృద్ధి పథంలో దూసుకుపోతుందన్నారు. బీజేపీ నాయకులు పాల్గొన్నారు.