India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందని నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి ఆరోపించారు. ఢిల్లీలో కేంద్ర బడ్జెట్‌కు వ్యతిరేకంగా ఇండియా కూటమి ఎంపీలతో కలిసి నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్డీయే ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ప్లకార్డులను ప్రదర్శించారు. ఎన్డీఏ ప్రభుత్వం తెలంగాణకు అన్యాయం చేసిందన్నారు.
శాతవాహన యూనివర్సిటీ పరిధిలో నిర్వహించే బీపీఈడీ ఆరో సెమిస్టర్ పరీక్షలు ఆగస్టు 1 నుంచి, రెండో సెమిస్టర్ పరీక్షలు ఆగస్టు 2 నుంచి ప్రారంభమవనున్నాయి. యూనివర్సిటీ కామర్స్, బిజినెస్ బ్రాంచ్‌లో మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు SU పరీక్షల నియంత్రణాధికారి డా. శ్రీరంగప్రసాద్ ఓ ప్రకటనలో తెలిపారు.
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా 317 జీవోపై అప్పీల్ చేసుకున్న ఉపాధ్యాయులు నాగర్ కర్నూల్ జిల్లాలోనే ఎక్కువ మంది ఉన్నారు. NGKL566 మంది, నారాయణపేటలో 319, వనపర్తిలో 220, గద్వాలలో 179, మహబూబ్ నగర్ జిల్లాలో అతి తక్కువగా 118 మంది ఉపాధ్యాయులు అప్పీల్ చేసుకున్నారు. ప్రభుత్వం వారి అభ్యర్ధనను ఆమోదిస్తే సొంత జిల్లాలకు బదిలీ అయ్యే అవకాశముంది. ధ్రువపత్రాలను పరిశీలిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో పత్తి ధర భారీగా పతనమైంది. గత మూడు రోజులుగా పెరుగుతూ వచ్చిన పత్తి ఈరోజు భారీగా పడి పోయింది. సోమవారం రూ.7,150 పలికిన క్వింటా పత్తి మంగళవారం రూ.7,180, బుధవారం రూ.7,230 అయింది. ఈ క్రమంలో నేడు దారుణంగా పతనమై రూ.7,025కి చేరింది. దీంతో మార్కెట్‌కు పత్తి తీసుకుని వచ్చిన రైతులు ఆందోళన చెందుతున్నారు.
నేడు రాష్ట్ర పూర్తిస్థాయి బడ్జెట్‌ను అసెంబ్లీలో డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క ప్రవేశపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో ఆదిలాబాద్ జిల్లాలోని పలు అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు కేటాయించాలని జిల్లా వాసులు ఆశాభావం వ్యక్తం చేశారు. కుప్టి ప్రాజెక్ట్, చనాఖా-కోర్ట ప్రాజెక్టు ప్రధాన కాలువల నిర్మాణం, జిల్లా కేంద్రంలో ఎయిర్‌పోర్ట్ నిర్మాణం, రైల్వే వంతెనల నిర్మాణాలకు నిధులివ్వాలని కోరుతున్నారు.
హైదరాబాద్ ఖైరతాబాద్‌లోని రవాణా కార్యాలయంలో జరిగిన వేలంలో ‘TG09A9999’ నంబర్ ఏకంగా రూ.19,51,111 పలికింది. హానర్స్ డెవలపర్స్ సంస్థ అంత మొత్తం చెల్లించి నంబరును సొంతం చేసుకుంది. కొత్తగా ప్రారంభమైన ‘TG09 B’ సిరీస్‌లో ‘0001′ నంబరును రూ.8.25 లక్షలు చెల్లించి ఎన్‌జీ మైండ్ ఫ్రేమ్ సంస్థ దక్కించుకుందని జేటీసీ రమేశ్ తెలిపారు. ఫ్యాన్సీ నంబర్ల ద్వారా రూ.51,17,514 ఆదాయం సమకూరిందని వివరించారు.
హైదరాబాద్ ఖైరతాబాద్‌లోని రవాణా కార్యాలయంలో జరిగిన వేలంలో ‘TG09A9999’ నంబర్ ఏకంగా రూ.19,51,111 పలికింది. హానర్స్ డెవలపర్స్ సంస్థ అంత మొత్తం చెల్లించి నంబరును సొంతం చేసుకుంది. కొత్తగా ప్రారంభమైన ‘TG09 B’ సిరీస్‌లో ‘0001′ నంబరును రూ.8.25 లక్షలు చెల్లించి ఎన్‌జీ మైండ్ ఫ్రేమ్ సంస్థ దక్కించుకుందని జేటీసీ రమేశ్ తెలిపారు. ఫ్యాన్సీ నంబర్ల ద్వారా రూ.51,17,514 ఆదాయం సమకూరిందని వివరించారు.
గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపిన ఘటన ములకలపల్లి మండలంలో బుధవారం వెలుగు చూసింది. స్థానికుల వివరాల ప్రకారం.. నరసాపురం గ్రామ శివారులోని కాకతీయుల కాలంనాటి పురాతన ఆలయం వద్ద గుప్తనిధుల కోసం తవ్వకాలు జరిగినట్లు స్థానిక రైతులు బుధవారం గుర్తించారు. గుప్తనిధుల కోసం తవ్వకాలు జరపడం పరిపాటిగా మారిందని, అధికారులు పరిశీలించి తగు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
గతనెలలో చేపట్టిన ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ పూర్తయిన తర్వాత మిగిలిపోయిన 109 ఖాళీలను మళ్లీ పదోన్నతులతో భర్తీ చేసేందుకు విద్యా శాఖ కసరత్తు చేస్తోంది. దీంతో పదోన్నతులపై ఉపాధ్యాయుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. గతంలో ఒక్కో ఉపాధ్యాయుడు రెండు నుంచి మూడేసి పోస్టుల్లో పదోన్నతి పొంది ఒక పోస్టులో జాయిన్ కావడంతో మిగతావి ఖాళీగా మిగిలిపోయాయి. కొందరు పదోన్నతి పొంది కూడా పోస్టు వద్దని రాసిచ్చారు.
ఉమ్మడి పాలమూరు జిల్లాలో 3,215 ప్రభుత్వ పాఠశాలల్లో.. 3,01,880 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో సుద్ధముక్క, విద్యార్థుల హాజరు పుస్తకాలు, రిజిస్టర్లు, చీపుర్లు, మరుగుదొడ్ల క్లీనింగ్ రసాయనాలు, ప్రయోగశాల సామాగ్రి వంటి తదితర సామాగ్రి కొనుగోలుకు ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో HM ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అత్యవసర ఖర్చులకు ఇబ్బందులు లేకుండా చూస్తామని పేట DEO అబ్దుల్ ఘని తెలిపారు.
Sorry, no posts matched your criteria.