Telangana

News July 25, 2024

జూరాలలో 43.852 మిలియన్ యూనిట్ల విద్యుదత్పత్తి

image

జూరాల ప్రాజెక్టు దిగువ, ఎగువ జలవిద్యుదుత్పత్తి కేంద్రాల్లో బుధవారం 11 యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తి చేపట్టినట్లు జెన్కో ఎస్ఈలు రామసుబ్బారెడ్డి, సురేష్ అన్నారు. ఎగువలో 5 యూనిట్ల ద్వారా 195 మెగా వాట్లు, దిగువలో 6 యూనిట్ల ద్వారా 240 మెగావాట్లు విద్యుదుత్పత్తిని చేపడుతున్నారు. ఎగువ, దిగువ జలవిద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో ఇప్పటివరకు 43.852 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తి సాధించామని తెలిపారు.

News July 25, 2024

MBNR: మీ పిల్లల బడి బస్సుకు ఫిట్ నెస్ ఉందా !

image

ఉమ్మడి జిల్లాలో ప్రైవేటు పాఠశాల, కళాశాల యాజమాన్యాలు బస్సుల ఫీట్ నెస్ నిర్లక్ష్యంగా వహిస్తున్నాయి. ఉమ్మడి జిల్లాలో 173 విద్యాసంస్థల బస్సులకు ఫీట్ నెస్ పరీక్షలు చేయించలేదు. 1,339 బస్సులు ఉండగా వీటిలో 1,166 బస్సులకు యాజమాన్యాలు ఫీట్ నెస్ చేయించారు. మిగతా 173 సామర్థ్యం లేని బస్సులు తిరుగుతున్నాయి. ఫిట్ నెస్ లేని బస్సులను సీజ్ చేస్తున్నామని, ఇప్పటికే నోటీసులు ఇచ్చామని రవాణా అధికారి రవి అన్నారు.

News July 25, 2024

కాసిపేటలో మహిళ దారుణ హత్య

image

మహిళను ఓ వ్యక్తి హత్య చేసిన ఘటన కాసిపేట మండలంలో చోటుచేసుకుంది. లంబడి తండా గ్రామానికి చెందిన అజ్మీరా నీలా (45) భర్త 15 ఏళ్ల క్రితం మరణిచడంతో గాండ్ల రవి అనే వ్యక్తితో సహజీవనం చేస్తుంది. రవి స్నేహితుడు అంబరావు బుధవారం రవి లేని సమయంలో నీలా పై అత్యాచారం చేసేందుకు యత్నించాడు. ఆమె ఒప్పుకోకపోవడంతో గొంతు నులిమి హత్యచేసినట్లు పోలీసులు తెలిపారు. 

News July 25, 2024

KMM: గురుకులాల్లో ప్రవేశాలకు స్పాట్ కౌన్సెలింగ్

image

ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకులాల్లో ప్రవేశాల కోసం ఈనెల 26, 27వ తేదీల్లో స్పాట్ కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇంటర్ మొదటి సంవత్సరం జనరల్ గ్రూప్లతో పాటు ఒకేషనల్ గ్రూప్లో మిగిలిన సీట్ల భర్తీకి కోసం ప్రభుత్వం అవకాశం కల్పించిందని పేర్కొన్నారు. బాలికలకు 26వ తేదీన టేకులపల్లి గురుకులంలో, బాలురకు 27వ తేదీన తిరుమలయపాలెంలో కౌన్సెలింగ్ ఉంటుందన్నారు.

News July 25, 2024

57 మంది పోలీసులకు ఉత్తర్వులు జారీ చేసిన సీపీ

image

వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వివిధ పోలీస్ స్టేషన్లలో విధులు నిర్వహిస్తున్న పోలీసులు కౌన్సెలింగ్ పద్ధతిలో ఎంపిక చేసుకున్న పోలీస్ స్టేషన్లకు బుధవారం బదిలీ చేస్తూ వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జాఉత్తర్వులు జారీ చేశారు. పోలీస్ స్టేషన్లకు బదిలీ చేసిన వారిలో నలుగురు కానిస్టేబుల్స్, 40మంది హెడ్ కానిస్టేబుల్స్, 13 మంది ఎఎస్సైలు ఉన్నారు.

News July 25, 2024

కరీంనగర్: బాలికపై అత్యాచారం.. ఇద్దరికి జీవిత ఖైదు

image

ఇద్దరికి జీవిత ఖైదు విధిస్తూ అదనపు జిల్లా సెషన్స్ జడ్జి వెంకటేశ్ తీర్పు చెప్పారు. కరీంనగర్ పట్టణంలో ఉంటున్న భార్యాభర్తలకు తొమ్మిదేళ్ల కుమార్తె 2020 FEB 24ర ఆడుకుంటుండగా ఇంలల్లి సమీపంలో ఉన్న నరేశ్, రవితేజ బాలిక ఓంటరిగా కనిపించడంతో అత్యాచారం చేసి చంపుతానని బెదిరించారు. మరుసటి రోజు కూడా బాలికపై అత్యాచారం చేయడంతో అస్వస్థతకు గురైంది, ఈక్రమంలో రక్త పరీక్షలు చేయగా విషయం తెలిసింది. కైసు నమోదైంది

News July 25, 2024

డీసీసీబీలో 37,625 మందికి రుణమాఫీ

image

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలుచేసిన రుణమాఫీని రైతులు సద్వినియోగం చేసుకోవాలని డీసీసీబీ చైర్మన్ దొండపాటి వెంకటేశ్వర్లు సూచించారు. టేకులపల్లి మండలం బేతంపూడి పీఏసీఎస్, ఇల్లెందు, గుండాలలోని పీఏసీఎస్, డీసీసీబీ బ్రాంచితో పాటు కామేపల్లి మండలం తాళ్లగూడెం, కారేపల్లిలోని డీసీసీబీ బ్రాంచ్ను బుధవారం ఆయన సందర్శించారు. డీసీసీబీ పరిధిలో 37,625 రైతులకు రూ.121,63,40,360 రుణమాఫీ జరుగుతోందని తెలిపారు

News July 25, 2024

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

image

> ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పలు మండలాల్లో మోస్తారు వర్షాలు
> తగ్గుముఖం పడుతున్న గోదావరి
> లోతట్టు ప్రాంతాలకు ముంపు ముప్పు నుండి విముక్తి
> నేడు భద్రాద్రి రామయ్య, పాల్వంచ పెద్దమ్మతల్లి ఆలయాల్లో ప్రత్యేక పూజలు
> నేడు ఉమ్మడి జిల్లాలో పర్యటించనున్న ఇరు జిల్లాల కలెక్టర్లు
> భద్రాద్రి జిల్లాలోని పలు గ్రామాల్లో ప్రత్యేక వైద్య శిబిరాలు
> నేడు వైరా నియోజకవర్గ వ్యాప్తంగా ఎమ్మెల్యే పుట్టినరోజు వేడుకలు

News July 25, 2024

సంగారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ముగ్గురు దుర్మరణం

image

సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కంది మండలం తనికిళ్ల తండా వద్ద నాందేడ్- అకోలా జాతీయ రహదారిపై లారీని వెనుక నుంచి బైక్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News July 25, 2024

WNP: సిలిండర్ ప్రమాదం.. చికిత్స పొందుతూ దంపతుల మృతి

image

చికిత్స పొందుతూ దంపతులు మృతిచెందిన ఘటన  గోపాల్‌పేట మండలంలో జరిగింది. మున్ననూరుకు చెందిన దంపతులు వెంకటయ్య(55), చిట్టెమ్మ దంపతులు ఈనెల18న జరిగిన వంట గ్యాస్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. HYDలోని ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. మంగళవారం మధ్యాహ్నం భర్త చనిపోగా బుధవారం ఉదయం భార్య ప్రాణాలొదిలారు. దంపతులను పక్కపక్కనే ఖననం చేశారు. ఏడడుగులు వేసిన వారు ఖనానికి కలిసి వెళ్తున్న ఘటన స్థానికులను కలిచివేసింది.