Telangana

News March 31, 2024

నల్గొండ: రోడ్డుప్రమాదంలో యువకుడి దుర్మరణం

image

రోడ్డుప్రమాదంలో యువకుడు మృతిచెందాడు. దేవరకొండ మండలం మైనంపల్లి స్టేజి వద్ద శనివారం రాత్రి ఈ ప్రమాదం జరిగింది. చందంపేట మండలం బొల్లారం గ్రామానికి చెందిన అశోక్ అనే యువకుడు బైక్‌పై వెళుతున్నాడు. ఆటో ఢీకొనడంతో తీవ్రగాయాలయ్యాయి. హైదరాబాద్లోని ఓ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అశోక్ మృతి చెందినట్లు కుటుంబీకులు తెలిపారు.

News March 31, 2024

MBNR: జాతీయ రహదారిపై 5 అండర్‌ బ్రిడ్జిల నిర్మాణం

image

అడ్డాకుల: జాతీయ రహదారి 44పై త్వరలో 5 అండర్‌ బ్రిడ్జిల పనులు ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తోంది. అవి వనపర్తి జిల్లాలోని కొత్తకోట మండలం కనిమెట్ట, పెద్దమందడి మండలంలోని వెల్టూర్‌ స్టేజీ, మూసాపేట మండలంలోని వేముల స్టేజీ, జానంపేట బస్‌స్టాప్‌, భూత్పూర్‌ మండలంలోని శేర్‌పల్లి(బీ) వద్ద జాతీయ రహదారిపై అండర్‌ బ్రిడ్జిలను నిర్మించడానికి నిధులు మంజూరు చేయడంతో టెండర్ల ప్రక్రియ కొనసాగుతోంది.

News March 31, 2024

ములుగు: పాత కక్షల కారణంగా కత్తితో దాడి

image

మహదేవపూర్ మండలం బెగ్లూర్ గ్రామానికి చెందిన మల్లయ్య అనే వ్యక్తిని హత్యాయత్నం ఘటనలో శనివారం రిమాండ్‌కు తరలించినట్లు ఎస్ఐ ప్రసాద్ వెల్లడించారు. అదే గ్రామానికి చెందిన కారు పోచయ్యపై పాత కక్షలతో కారు మల్లయ్య కత్తితో దాడి చేసినట్లు పేర్కొన్నారు. బాధితుడి భార్య దుర్గమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయగా, దర్యాప్తు చేసి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు.

News March 31, 2024

ASF: పురుగు మందు తాగి యువకుడు మృతి

image

రెబ్బెన మండల కేంద్రానికి చెందిన గజ్జల భీం రావ్(35) పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్ఐ చంద్రశేఖర్ తెలిపారు. వారు తెలిపిన కథనం ప్రకారం.. భీమ్‌రావ్ ఏ పని చేయకపోవడంతో పాటు మద్యానికి బానిసయ్యాడు. ఈ క్రమంలో అతని భార్య పుట్టింటికి వెళ్లింది.. మద్యానికి బానిసైన భీం రావ్ ఇంట్లో పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈమెకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.

News March 31, 2024

బాన్సువాడ: బొలెరో వాహనం ఢీ.. ఒకరి మృతి

image

బాన్సువాడ శివారులోని చాదర్ లాక్ కెనాల్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. పోలీసుల వివరాల ప్రకారం బాన్సువాడకు చెందిన దంపతులు మహమ్మద్ ముఖ్తాద్, ఆయేషా దంపతులు వెల్లుట్ల నుంచి బాన్సువాడకు బైక్ పై వస్తున్నారు. వారిని అతివేగంగా వచ్చిన బొలెరో ఢీకొట్టింది. దీంతో వారికి తీవ్రగాయాలయ్యాయి. వారికి మెరుగైన వైద్యం అందించేందుకు నిజామాబాద్ తరలిస్తుండగా మార్గ మధ్యలో ముఖ్తార్ మృతి చెందారు.

News March 31, 2024

ఉమ్మడి జిల్లాలో నేటి కార్యక్రమాలు!

image

✔నేడు ఏర్పాట్లు.. రేపటి నుంచి వరి ధాన్యం కొనుగోలు
✔పలు నియోజకవర్గాల్లో పర్యటించనున్న MBNR,NGKL ఆయా పార్టీల ఎంపీ అభ్యర్థులు
✔ఉమ్మడి జిల్లాలో నిఘా కట్టుదిట్టం.. పలుచోట్ల తనిఖీలు
✔అమ్రాబాద్: నేడు కరెంట్ కట్
✔త్రాగునీటి సమస్యలపై అధికారులు ఫోకస్
✔నేటి రంజాన్ వేళలు:
ఇఫ్తార్(SUN)-6:36, సహార్(MON)-4:50
✔నేడు పలుచోట్ల ‘ఇఫ్తార్ విందు’.. హాజరుకానున్న నేతలు
✔నేడు పలుచోట్ల కేంద్ర బలగాలతో కవాతు

News March 31, 2024

HYD: నేటితో ముగియనున్న ఓటీఎస్

image

ప్రాపర్టీ టాక్స్ చెల్లింపులకు వన్‌ టైం సెటిల్‌మెంట్ స్కీం రాయితీ నేటితో ముగియనున్నందున దీనిని సద్వినియోగం చేసుకోవాలని GHMC కమిషనర్ రోనాల్డ్ రోస్ తెలిపారు. ఆదివారం రాత్రి 12 గంటల లోపు తమ ప్రాపర్టీ టాక్స్ చెల్లించి వడ్డీ పై 90% రాయితీ పొందవచ్చని తెలిపారు. శనివారం BSNL కంపెనీ తమ 140 ప్రాపర్టీలకు సంబంధించిన రూ.13,01,15,464 బకాయిలు ఆన్ లైన్లో చెల్లించినట్లు తెలిపారు.

News March 31, 2024

వనపర్తి: భార్యను చంపిన భర్తకు రిమాండ్

image

భార్యను భర్త చంపిన ఘటన వనపర్తి జిల్లాలో శనివారం చోటుచేసుకుంది. CI నాగభూషణం రావు వివరాల ప్రకారం.. ఎద్దులగేరికికి చెందిన దంపతులు వెంకటేష్, మహేశ్వరి. భర్త ఇతరులతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని భార్య అనుమానంతో గొడవ పడేది. ఈనెల 15న రాత్రి గొడవ పడగా.. భార్య ముఖంపై దిండుతో నొక్కి ఊపిరాడకుండా చంపేశాడు. శనివారం అతన్ని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచగా రిమాండ్‌కు తరలించినట్లు CI తెలిపారు.

News March 31, 2024

HYD: నేటితో ముగియనున్న ఓటీఎస్

image

ప్రాపర్టీ టాక్స్ చెల్లింపులకు వన్‌ టైం సెటిల్‌మెంట్ స్కీం రాయితీ నేటితో ముగియనున్నందున దీనిని సద్వినియోగం చేసుకోవాలని GHMC కమిషనర్ రోనాల్డ్ రోస్ తెలిపారు. ఆదివారం రాత్రి 12 గంటల లోపు తమ ప్రాపర్టీ టాక్స్ చెల్లించి వడ్డీ పై 90% రాయితీ పొందవచ్చని తెలిపారు. శనివారం BSNL కంపెనీ తమ 140 ప్రాపర్టీలకు సంబంధించిన రూ.13,01,15,464 బకాయిలు ఆన్ లైన్లో చెల్లించినట్లు తెలిపారు.

News March 31, 2024

సూర్యాపేట: పోలీసులపై దాడి

image

సారా కాస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేసేందుకు వెళ్తే పోలీసులపైనే దాడి చేసిన ఘటన చింతలపాలెం మండలం కొత్తగూడెం తండాలో జరిగింది. ఆబ్కారీ ఎస్సై దివ్య ఇటీవల తనిఖీ చేయగా.. తులసీరాం ఇంట్లో నల్లబెల్లం పట్టుబడింది. నిందితుడు దొరకలేదు. కేసు నమోదు చేశారు. అతణ్ని పట్టుకునేందుకు వెళ్లగా పోలీసుల వాహనంపై రాళ్లు రువ్వారు. ఈ ఘటనలో డ్రైవర్‌కు గాయాలయ్యాయి. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.