India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
వీధి కుక్కలు నగరవాసులపై దాడి చేస్తోన్న ఘటనలు పెరుగుతుండటంతో GHMC కాల్ సెంటర్ నంబర్లను ప్రకటించింది. రోజంతా కాల్ సెంటర్ పని చేస్తుందని, 040-21111111, 23225397 నంబర్లను సంప్రదించవచ్చని అధికారులు వెల్లడించారు. కుక్కకాటువల్ల ఇటీవల జవహర్ నగర్‌లో ఓ చిన్నారి చనిపోవడం, ఈ తరహా దుర్ఘటనలు తరచూ చోటు చేసుకోవడంపై ఇటీవల రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.
వనమహోత్సవం, మహిళా శక్తి, వర్షాకాలంలో ప్రబలే సీజనల్ వ్యాధులపై జిల్లా కలెక్టర్ శశాంక వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. వనమహోత్సవంలో భాగంగా వర్షాకాలంలోనే మొక్కలు నాటే విధంగా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సీజనల్ వ్యాధుల నివారణకు మందులు అందుబాటులో ఉంచాలన్నారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పుట్టిన రోజు వేడుకలు నందినగర్ నివాసంలో జరిగాయి. సతీమణి శైలిమ, కుమారుడు హిమాన్షు, కూతురు అలేఖ్యతో కలిసి.. తండ్రి కేసీఆర్, తల్లి శోభమ్మలకు పాద నమస్కారాలు చేసి వారి ఆశీర్వాదాలను కేటీఆర్ తీసుకున్నారు.ఈ సందర్భంగా కుమారుడు కేటీఆర్‌ను ప్రేమతో గుండెకు హత్తుకున్న కేసీఆర్.. మిఠాయిలు తినిపించి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని కోరారు.
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను పార్లమెంట్‌లోని ఆయన ఛాంబర్‌లో మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్ రావు మర్యాదపూర్వకంగా కలిశారు. మెదక్ పార్లమెంట్ పరిధికి సంబంధించిన పలు అంశాలపై కేంద్ర మంత్రి అమిత్ షాతో చర్చించారు. తెలంగాణకు సంబంధించిన పలు అంశాలపై చర్చించినట్లు ఎంపీ రఘునందన్ రావు తెలిపారు.
పోలీస్ అధికారులు నేరాల నియంత్రణపై దృష్టి సారించాలని ఎస్పీ యోగేష్ గౌతమ్ అన్నారు. బుధవారం నారాయణపేట ఎస్పీ కార్యాలయంలో జిల్లాలోని పోలీస్ అధికారులతో నెలవారీ నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. పోలీస్ స్టేషన్ వారీగా పెండింగ్లో ఉన్న కేసులను అడిగి తెలుసుకున్నారు. పెండింగ్లో ఉన్న కేసులను త్వరగా పరిష్కరించాలని అన్నారు. బాధితులు అందించే ఫిర్యాదులపై తక్షణం స్పందించాలని, బాధితులకు న్యాయం చేయాలని చెప్పారు.
జేఈఈలో ర్యాంకు ద్వారా పాట్నా ఐఐటీలో సీటు సాధించి, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం గోనే నాయక్ తండాకు చెందిన విద్యార్థిని బాదావత్ మధులతకు ప్రజా ప్రభుత్వం అండగా నిలిచింది. ‘ఐఐటీకి వెళ్లలేక.. మేకల కాపరిగా’ మారడంతో సీఎం స్పందించారు. బుధవారం హైదరాబాద్‌లోని సచివాలయంలో గిరిజన శాఖ కార్యదర్శి శరత్ ద్వారా విద్యార్థిని మధులతకు రూ.1,51,831 చెక్కును అందించారు.
ఈనెల 26 నుండి జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలలో “ఇంటింటి జ్వర సర్వే” నిర్వహించాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి మున్సిపల్ కమిషనర్లు, వైద్యఆరోగ్యశాఖ అధికారులను ఆదేశించారు. బుధవారం అయన జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్లతో వివిధ అంశాలపై సమీక్ష నిర్వహించారు. “ఇంటింటి జ్వర సర్వే” లో భాగంగా తక్షణమే మెప్మా సిబ్బంది, వైద్య ఆరోగ్యశాఖ సిబ్బందితో బృందాలను ఏర్పాటు చేయాలన్నారు.
బడ్జెట్‌లో రాష్ట్రాలపై వివక్ష చూపుతున్నారని పార్లమెంటు ఆవరణలో విపక్షాలు నిరసన చేపట్టాయి. ప్రతిపక్ష పార్టీల పాలనలో ఉన్న రాష్ట్రాలపై బడ్జెట్‌లో వివక్ష చూపుతున్నారని ఆరోపించారు. ఈ నిరసనలో కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, మల్లికార్జున్ ఖర్గే పాల్గొనగా.. వీరి వెంట జహీరాబాద్ ఎంపీ సురేష్ శెట్కార్ సైతం పాల్గొని ప్లకార్డు ప్రదర్శించి నిరసన తెలిపారు.
ఖమ్మం: కొత్త నేర చట్టాలను సవరించాలని కోరుతూ బుధవారం కేంద్ర న్యాయ శాఖ మంత్రికి ఎంపీ వద్దిరాజు రవిచంద్ర వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. పెండింగ్ లో ఉన్న సెంట్రల్ నోటరీల నియామకాలను వెంటనే చేపట్టాలన్నారు. అడ్వకేట్స్ ప్రొటెక్షన్ బిల్లును అమలు జరపాలని కేంద్ర మంత్రిని కోరారు. అదేవిధంగా పలు సమస్యలను కేంద్ర మంత్రికి ఎంపీ వివరించారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా రాబోయే రెండు మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. గురువారం ఉమ్మడి జిల్లాలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఈ నేపథ్యంలో అలర్ట్ జారీ చేశారు. గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారివర్షాలకు ఉమ్మడి జిల్లాలో ఉన్న జలపాతాలు జలసవ్వడి చేస్తున్నాయి. ప్రాజెక్టులు నీరు వచ్చి చేరడంతో కళకళలాడుతున్నాయి.
Sorry, no posts matched your criteria.