Telangana

News March 31, 2024

ఖమ్మం: ఒక్క పోస్టుకు 71 మంది పోటీ

image

ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి ఏఆర్టీ సెంటర్లో ఖాళీగా ఉన్న ల్యాబ్ టెక్నీషియన్ పోస్ట్ భర్తీకి శనివారం రాత పరీక్ష నిర్వహించారు. ఒక పోస్ట్ భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వగా దరఖాస్తు చేసుకున్న 84 మందిలో 71 మంది అభ్యర్థులు హాజరయ్యారు. పరీక్షను పర్యవేక్షించిన డిప్యూటీ సూపరిండెంట్ బి.కిరణ్ కుమార్ మాట్లాడుతూ.. ప్రతిభ ఆధారంగా అర్హత ఉన్న వ్యక్తిని ఎంపిక చేస్తామని తెలిపారు.

News March 31, 2024

ఖమ్మం: ఇంటి పన్నుకు నేడే చివరి రోజు

image

ఇంటి పన్ను వడ్డీపై రాయితీకి నేటితోగడువు ముగియనుందని, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఖమ్మం నగరపాలక సంస్థ కమీషనర్ ఆదర్శ్ సురభి ఒక ప్రకటనలో తెలిపారు. ఇంకా ఇంటి పన్ను కట్టాల్సిన వాళ్ళు ఉంటే ఈరోజు ఉదయం ఏడు గంటల నుండి రాత్రి 9 గంటల వరకు నగర వ్యాప్తంగా ఏర్పాటుచేసిన కౌంటర్లలో బిల్ కలెక్టర్లకు చెల్లించాలని తెలిపారు.

News March 31, 2024

సువిధా ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా అనుమతి: కలెక్టర్

image

సువిధా ఆన్‌లైన్ పోర్టల్‌లో ధరఖాస్తు చేసుకొని అనుమతి పొందాలని కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. సాధార‌ణ ఎన్నికల నియమావళిలో భాగంగా వివిధ రాజకీయ పార్టీలు, అభ్యర్ధులకు కీలక సూచన చేశారు. పబ్లిక్ మీటింగ్‌లు, ర్యాలీలు, వివిధ ప్రచార వాహనాలు, తాత్కాలిక పార్టీ కార్యాలయాలు, మైక్‌లు, లౌడ్ స్పీకర్లు, బారీకేడ్స్ , హెలికాప్టర్ లాండింగ్ తదితర ప్రచార అనుమతులు పొందవచ్చన్నారు. SHARE IT

News March 31, 2024

MBNR: వంద రోజుల్లో మంచి పరిపాలన అందించాం: చిన్నారెడ్డి

image

కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వంద రోజుల్లో సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో మంచి పరిపాలన అందించామని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు చిన్నారెడ్డి అన్నారు. ఆయన మాట్లాడుతూ.. ఈ వంద రోజుల పరిపాలన గురించి పూర్తిస్థాయిలో ప్రజలకు వివరించాలని కార్యకర్తలకు, బూత్ లెవల్ ఏజెంట్లకు పిలుపునిచ్చారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని భారీ మెజారిటీతో గెలిపించాలన్నారు.

News March 31, 2024

ADB: ‘ఉపాద్యాయులు తగు జాగ్రత్తలు తీసుకోవాలి’

image

ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల ఉపాధ్యాయులు తగు జాగ్రత్తలు తీసుకొవాలని జిల్లా విద్యాధికారి ప్రణీత ఓ ప్రకటనలో తెలిపారు. విద్యార్థులకు మంచి నీటిని అందుబాటులొ ఉంచాలని, ఎండలో ఆడుకోకుండా చూడాలన్నారు. ఏవైనా ఆరోగ్య సమస్యలు వస్తే వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించాలన్నారు. ప్రైవేట్ విద్యాసంస్థలు మధ్యాహ్నం వేళల్లో తరగతులు నిర్వహించరాదని హెచ్చరించారు.

News March 31, 2024

కామారెడ్డి: కేకేను అభినందించిన షబ్బీర్ అలీ

image

కాంగ్రెస్ పార్టీలో చేరిన కేశవరావును రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ అభినందించారు. ఈ మేరకు ఆయన నివాసానికి వెళ్లి పుష్పగుచ్ఛం అందచేశారు. 19 సంవత్సరాల తర్వాత తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి రావడం ఎంతో అభినందనీయమని కొనియాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పటిష్ఠంగా తయారైందన్నారు.

News March 31, 2024

నిజామాబాద్ ఎంపీగా గెలిపించాలి: జీవన్ రెడ్డి

image

రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో తనను ఎంపీగా భారీ మెజారిటీతో గెలిపించాలని కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి కోరారు. ఈ మేరకు శనివారం సాయంత్రం నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎన్నికల సన్నహక సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

News March 31, 2024

ఎన్నికల విధులను అత్యంత జాగ్రత్తగా నిర్వహించాలి: కలెక్టర్ గౌతమ్

image

ఎన్నికల నోడల్ అధికారులు, తమకు కేటాయించిన విధులను సమర్థవంతంగా చేపట్టాలని, రాబోయే ఎన్నికలు ఎలాంటి పొరపాట్లకు తావు ఇవ్వకుండా సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలని ఖమ్మం కలెక్టర్ గౌతమ్ అన్నారు. కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో ఎన్నికల నోడల్ అధికారులతో, ఎన్నికల సన్నద్ధతపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్నికల విధులను అత్యంత జాగ్రత్తగా నిర్వహించాలని ఆయన సూచించారు.

News March 31, 2024

KNR: ధాన్యం కొనుగోళ్ళలో ప్రమాణాలు పాటించాలి: కలెక్టర్

image

ధాన్యం కొనుగోళ్లలో మిల్లర్లు నాణ్యత ప్రమాణాలు పాటించాలని, మిల్లర్ల సమస్యలపై ఎఫ్సీఐ అధికారులతో సమీక్షిస్తానని కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి పేర్కొన్నారు. శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో వానాకాలం రబీ కొనుగోలుపై మిల్లర్లు, సివిల్ సప్లై అధికారులతో సమీక్షించారు. కలెక్టర్ పమేలా సత్పతి మాట్లాడుతూ.. రైస్ మిల్లర్లు ఎదుర్కొంటున్న సమస్యలపై సానుకూలంగా వ్యవహరించి సహాయ సహకారాలు అందిస్తామన్నారు.

News March 31, 2024

హైదరాబాద్‌లో బీఆర్‌ఎస్ నిరాశ!

image

హైదరాబాద్‌లో BRSకు‌ ఎదురుదెబ్బలు తప్పడంలేదు. గత GHMC ఎన్నికల్లో 48 స్థానాల్లో విజయం సాధించిన గులాబీ పార్టీ ప్రస్తుతం 10 మందిని కోల్పోయింది. మేయర్‌, డిప్యూటీ మేయర్, బొంతు శ్రీదేవి, బాబా ఫసియుద్దీన్‌‌తో పాటు కీలక నేతలు INCలోకి చేరిపోయారు. మరో 10 మంది కార్పొరేటర్లు కూడా BRSను వీడే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇలా రోజుకొకరు పార్టీని వీడుతుండటం గులాబీ శ్రేణులను నిరాశ పరుస్తోంది. దీనిపై మీ కామెంట్..?